THE COMPLETE BLOG FOR PEOPLE // NEWS, DEVOTIONAL, TECHNOLOGY, LIFE STYLE, SPORTS, ENTERTAINMENT, SCIENCE, ONLINE EARNING, RIDDLES, SILLY QUESTIONS, IMPORTANT DAYS, BEAUTY TIPS, HEALTH
Adsense
Showing posts with label pooja flowers. Show all posts
Showing posts with label pooja flowers. Show all posts
Friday, March 24, 2023
పుష్పాలకు అధిదేవతలు
🌾దేవాలయాలలో ఆగమశాస్త్రోక్తంగా పూజలు, కైంకర్యాలు నిర్వహించబడకపోతే ఆ ఆలయానికి , ఆ ఊరి ప్రజలకు కీడు కలుగుతుందని శాస్త్రాలు వివరిస్తున్నాయి.
🌾అందువలన నిత్యమూ ఆలయాలలో క్రమబధ్ధంగా భక్తి శ్రధ్ధలతో, నియమ నిష్టలు పాటిస్తూ పూజలు జరపాలి.
🌾ఆలయాలలో ఏ ఏ సమయాలలో ఏవిధమైన సేవలు జరగాలో
" మహోత్సవ వివరం" అనే గ్రంధం తెలుపుతున్నది. ఆ గ్రంధంలోని వివరాలు కొన్ని మనమూ తెలుసుకుందాము.
🌾ఐదు విధాలైన ఉపచారాలు : భగవంతునికి
చేసే ఉపచారాలన్నీ కూడా పంచ భూతాలకి
సంబంధించినవిగా
వుంటాయి. అవి ఐదు విధాలు:
🌾భూమికి సంబంధించిన ఉపచారాలు...
చందనం, పుష్పాలు, దుంపలు, వేళ్ళు, పళ్ళు, అన్నం మొదలైనవి.
🌾నీటికి సంబంధించినవి : జలం, పాలు, పెరుగు,తేనె మొదలైనవి.
🌾అగ్ని : బంగారం, రత్నం, దీపం, కర్పూరం,
ఆభరణం.
వాయువు : ధూపం, చామరం, మొదలైనవి.
🌾ఆకాశం : గంట, వాయిద్యం, స్తోత్రాలు, పాటలు మొదలైనవి.
🌾పంచ వాయిద్యాలు : ఐదు రకాల వాద్యాలతో దేవునికి సేవలు జరపాలి.
🌾మాస పూజలు : పన్నెండు మాసాలలో ఏ ఏ విధాలుగా పూజలు నిర్వహించాలో శాస్త్రాలలో నిర్ణయించారు . అవి -
🌾మేష మాస పూజ , వృషభ మాసపూజ,
మిధున మాస పూజ ,
కర్కాటక మాస పూజ ,
సింహమాస పూజ,
కన్య మాస పూజ,
తులా మాస పూజ
ధనుర్మాస పూజ
వృశ్చిక మాస
పూజ.
మకర మాస పూజ.
కుంభ మాస పూజ
మీన మాస పూజ
🌾వివిధ దేవతామూర్తుల పూజలకై వినియోగించవలసిన పువ్వుల విశేషాలని
ముఖ్యంగా యీ గ్రంధం వివరించింది.
పొగడపువ్వులలో సరస్వతి,
కరవీర పువ్వులలో
బ్రహ్మ,
జమ్మి లో అగ్ని,
నంది వర్ధనాలలో నంది ,
పున్నాగలలో వాయువు,
జిల్లేడు పువ్వులలో సూర్యుడు,
సంపెంగ పువ్వులలో సుబ్రహ్మణ్యస్వామి బిల్వాలలో
మహాలక్ష్మి,
మామిడాకులలో వరుణుడు ,
జాజి పూవులలో ఈశాన్యుడు,
వాగై పుష్పాలలో నైరుతి ,
ఎఱ్ఱ తామరలలో
సూర్యుడు,
కలువలలో చంద్రుడు, మందారాలలో దేవేంద్రుడు, మధుమాలతిలో కుబేరుడు ,
తామర పుష్పాలలో పరమశివుడు
గరికలో గణేశుడు, నీలోత్పలములలోను, సువాసనకల పుష్పాలయందు ఉమాదేవి
అధిదేవతలుగా వున్నందున ఆ యా పుష్పాలను సేకరించి దేవాలయాలలో ఆ దేవతలకు పూజలు జరపాలి.
శేషశ్రీ గారి సౌజన్యం తో
Subscribe to:
Posts (Atom)