Adsense

Showing posts with label prawns biryani. Show all posts
Showing posts with label prawns biryani. Show all posts

Wednesday, March 29, 2023

ఇంట్లోనే చాలా సుల‌భంగా రొయ్య‌ల బిర్యానీని రుచిగా చేసుకోవ‌చ్చు.. ఎలాగంటే..? prawns biryani

రొయ్య‌ల బిర్యానీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బాస్మ‌తి బియ్యం – 400 గ్రా., ప‌చ్చి రొయ్య‌లు – 400 గ్రా., నూనె – 3 టేబుల్ స్పూన్స్, పొడుగ్గా త‌రిగిన ఉల్లిపాయ – 2 (మ‌ధ్య‌స్థంగా ఉన్న‌వి), చిన్న‌గా త‌రిగిన ప‌చ్చి మిర్చి – 3, ప‌సుపు – అర టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, త‌రిగిన ట‌మాట – 1, ధ‌నియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, కారం పొడి – ఒక‌టిన్న‌ర టేబుల్ స్పూన్స్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, ఉప్పు – త‌గినంత‌.

మ‌సాలా దినుసులు..
బిర్యానీ ఆకు – ఒకటి, సాజీరా – ఒక టీ స్పూన్, ల‌వంగాలు – 5, యాల‌కులు – 3, దాల్చిన చెక్క ముక్క‌లు – 3, అనాస పువ్వు – 1.

రొయ్య‌ల బిర్యానీ త‌యారీ విధానం..

ముందుగా బాస్మ‌తి బియ్యాన్ని శుభ్రంగా క‌డిగి తగినన్ని నీళ్ల‌ను పోసి అరగంట పాటు నాన‌బెట్టాలి. త‌రువాత రొయ్య‌ల‌ను కూడా 2 నుండి 3 సార్లు శుభ్రంగా క‌డిగి ప‌క్క‌న‌ పెట్టుకోవాలి. త‌రువాత ఒక కుక్క‌ర్ లో నూనె వేసి కాగాక ఉల్లిపాయ‌ల‌ను వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన త‌రువాత మ‌సాలా దినుసుల‌ను, త‌రిగిన ప‌చ్చి మిర్చిని వేసి వేయించుకోవాలి. త‌రువాత క‌డిగి పెట్టుకున్న రొయ్య‌ల‌ను వేసి వేయించాలి. వీటిలో ఉండే నీరు అంతా పోయి రొయ్య‌లు వేగిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ట‌మాట ముక్క‌లను వేసి వేయించాలి. ఇవి పూర్తిగా వేగాక ప‌సుపు, కారం, ధ‌నియాల పొడి వేసి క‌లుపుకోవాలి.

త‌రువాత ఒక క‌ప్పు బాస్మ‌తి బియ్యానికి ఒక‌టిన్న‌ర క‌ప్పు నీళ్ల చొప్పున త‌గిన‌న్ని నీళ్లను పోయాలి. ఇప్పుడు రుచికి స‌రిప‌డా ఉప్పును వేసి క‌లుపుకోవాలి. నీళ్లు మ‌రిగిన త‌రువాత నాన బెట్టుకున్న బాస్మ‌తి బియ్యాన్ని, త‌రిగిన కొత్తిమీర వేసి క‌లిపి 5 నిమిషాల పాటు ఉంచి మూత పెట్టి 3 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించుకోవాలి. త‌రువాత మూత తీసి ఒక‌సారి అంతా క‌లుపుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల చాలా సులువుగా, ఎంతో రుచిగా ఉండే రొయ్య‌ల బిర్యానీ త‌యార‌వుతుంది. ప‌చ్చి ఉల్లిపాయ‌, నిమ్మర‌సంతో క‌లిపి తింటే.. రొయ్య‌ల బిర్యానీ ఎంతో రుచిగా ఉంటుంది