చింతపండు పచ్చడిని తెలుగువారు కొందరు చిన్నమ్మ అని కందిపప్పు పచ్చడిని 'పెద్దమ్మ' అని వాడుటగలదు. ఏకూరలు దొరకనప్పుడు యీ రెండు పచ్చళ్లను చేసికొని అన్నమును భుజించెదరు. ఈపచ్చడిని చేయువిధమును నాకుతెలిసినది వ్రాయుచున్నాను.
కావలసిన చింతపండును తీసికొని, అందుండు యీనెలను విత్తులను తీసివైచి మెత్తగానూరి పెట్టుకొనవలయును. అటుపిమ్మట పొయ్యిమీద బాణలి పెట్టి నువ్వులనూనెను పోసి, కాగినపిమ్మట ఇంగువఫలుకులను నూనెలో వేసి పేలినపిమ్మట కావలసిన యెండుమిరపకాయలను నూనెలో వేసి, మిరపకాయలు ఎర్రరంగుగా మారువరకు వేయించ వలయును. పిమ్మట కొద్దిగా మెంతులు మెంతులకు మూఁడుభాగములు జీలకర్ణను బాణలిలో వేసి చిటపట వేగినపిమ్మట బాణలిని క్రిందికిదించి పెట్టవలయును. వేగిన మిరపకాయల వేడి ఆరకముందే బండమీదవేసి కావలసిన ఉప్పును వేసి నూరినపిమ్మట, చింతపండును వేసి, కలియనూరవలెను. కడపట వేగిన మెంతులను జీలకర్రను, ఇంగువను వేసి నూరి, తీసికొన వలయును. కొందరు కొద్దిగ బెల్లమునుకూడ చేర్చినూరుకో నెదరు.
మినుముల చింతపండు పచ్చడి.:
మినుముల చింతపండు పచ్చడికూడ ఆంధ్రులకు ప్రియమైనదే. ఈ పచ్చడిని మినపపప్పుతో చేయుట కంటె, ముడిమినుములతో తయారు చేసిననే దాని రుచి తెలియగలదు.
ప్రయాణములకు యాత్రకు బోవువారుయీ సంబారు చింతపండు పచ్చడిని అన్నంలోపొడిని యేమారరు.
దీనిని నీళ్లు లేక నూరిన ఒక మాసము వరకుకూడ నిలువయుండును. దీనిని మెత్తగ నూగకూడదు. " వక్కా ముక్కగా నూరిననే దానిరుచి' అని ఆంధ్రులనెదరు. మినపగింజ పంటికి తగులుచుండ వలయును. దీనిని యీ క్రిందివిధముగ తయారుచేయనగును.
చింతపండును తీసికొని దానిలో యీనెలు, తొక్కలు, విత్తులు వేరుపరచి, కావలసిన ఉప్పును వేసి మెత్తగా రోటిలో దంచవలయును. ఆ దంచినముద్దను వేరుగా "పెట్టుకొనవలయును
పిమ్మట పొయ్యిమీద బాణలిని పెట్టి నువ్వులనూనెను బాణలిలోపోసి యింగువముక్కలను కాల్చి తీసి పెట్టుకొనవలయును. పిమ్మట ఆకాగిన నూనెలోనే బాగుచేసిన ముడిమినుములను కావలసిన మట్టుకు వేసి కమ్మని వాసనరాగానే, యెండుమిరపకాయలను బాణలిలో వేసి వేయించి క్రింద పెట్టవలయును, మొదట వేయించిన మినుములను పక్కా ముక్కగదంచి, పిమ్మట మిరపకాయలు, ఉప్పు, యింగువనుకలిపి దంచ వలయును.
పిమ్మట చింతపండును దానిలోవేసి ముద్దగునట్లు దంచి వాడుకొనవలయును. దీనిలోకూడ కొద్దిగ బెల్లమును వేసి నూరవచ్చును.