Adsense

Tuesday, October 20, 2020

మంత్రం అందరికి ఎందుకు సిద్దించడం లేదు

ఒక మంత్రం కానీ పూజ కానీ పరిహారంగా చేయమని చెప్పి నప్పుడు దానికి లక్షల్లో జపం చేయమని ఎవ్వరూ చెప్పరు..ఎందుకంటే అవి పరిహారం కోసం ఇవ్వబడ్డాయి సమస్యని తొలగించి ఉపశమనం. కలిగించే మంత్రాలు అవి ఇన్ని వారాలు లేదా ఇన్ని రోజులు ఇన్నిసార్లు చేయాలి అనే నియమమే ఉంటుంది..

సిద్ది పొందడానికి చేసే ఉపాసనలు మటుకే దశమభాగం విధులు చేయాలి గనుక దాన్ని లక్షల్లో జపం చేయవలసి ఉంటుంది..

ఏదైనా సమస్య పరిస్కారం కావాలి అని ఆ మంత్రం జపం చేస్తే పని అపోతుంది అని ఎప్పుడెప్పుడు జపం పూర్తి ఐపోతుంది దానిపైనే దృష్టి పెట్టి ఉంటారు కానీ భక్తి శ్రద్ద అనేది ఉండదు. ఏ మంత్రాన్ని అయితే జపం చేస్తున్నాము ఆ మంత్రాది దేవత పైన భక్తి ఉండాలి ఆ దేవత ని స్త్రోత్రం చేయాలి మనస్ఫూర్తిగా జపం చేయాలి జప సంఖ్య కన్నా కాస్త ఎక్కువ సార్లు చేయాలి. 

జపం చేసే వాళ్ళు మాసిన వస్త్రాలు ధరించకూడదు నిన్న కాసేపు వేసుకున్నదే కదా అని మరుసటి రోజు ధరించ కూడదు.. మెడలో ధరించిన మాలని జాపనికి వాడకూడదు.

శ్వాసలో దుర్వాసన రాకూడదు, పొద్దు వచ్చాక స్నానం చేయాకుడదు...మీరు జపం ఆలస్యంగా మొదలు పెట్టిన స్నానం మటుకు సూర్యోదయం కి ముందే చేయాలి ఇది చాలా మందికి తెలియక 7,8,9 అలా పోదేక్కిన తర్వాత స్నానం చేయడం వల్ల జప ఫలితము కూడా దక్కదు.. ఇది నిజం స్నానంకి అంత  ముఖ్యమైన పాత్ర ఉందా అనుకోకండి మీరు ఒక నెల రోజులు పాటు వరుసగా 5. లేదా 5.30 గం కె స్నానం ముగించండి మీరు చేసే పూజ కానీ జపం కానీ ఎంత త్వరగా ప్రభావం చూపిస్తుంది చూడండి... సూర్యుడికి  నమస్కారం చేస్తే రోజు మీకు అన్నివిధాల శుభం కలుగుతుంది. 

కొన్ని మంత్ర జపాలకు మటుకే ఆహార నియమం పాటించాలి, కానీ అన్ని పరిహారాలకు ఆహార నియమం అవసరం లేదు.. మంగళవారం,శనివారం  మటుకు గుడ్డు మాంసం తినకూడదు.. 

ఏ మంత్ర జపం, ఏ పరిహారం చేసే వాళ్ళు అయినా వారి కుల దేవతని మంగళవారం విశేషం గా ఆరాధించాలి బియ్యం పిండితో దీపం పెట్టి స్త్రోత్రం చేసి దేనికోసం పరిహార జపం చేస్తున్నారో అది ఫలించే లాగా అనుగ్రహించమని కోరుకోవాలి అప్పుడు ఆటంకాలు రాకుండా కులదేవత కూడా అనుగ్రహిస్తుంది..

వివాహం ,ఉద్యోగం, వృత్తి వ్యాపారాలు, ఆస్తి తగాదాలు, శత్రువులు బాధలు ముఖ్యంగా పరిహారం చేసుకుంటూ ఉంటారు ఎంత కోపం ఉన్నా జపం చేసే సమయంలో కోపంతో జపం చేయాకుడదు.. మీకు ద్రోహం చేసి వారు అయితే కచ్చితంగా వారుకి ఎలాగో శిక్ష పడుతుంది కానీ ఉపాసించే మంత్రం జపం చేస్తూ మనసులో శతృభావంతో చేయాకుడదు. అది మీకు కూడా మంచిది కాదు , ఎవరు తప్పు చేశారో కచ్చితంగా తెలియనప్పుడు ఆముకం దగ్గర శత్రువులు అనిపెట్టాలి కానీ ఎవరి పేరు చడవకూడదు .

దేవీ ఉపాసన మంత్రాలు స్ట్రోత్రాలు చదివే వారు ముందుగా గణేషుడి కి నమస్కారం చేసి దక్షణామూర్తి ని స్త్రోత్రం చేసే దేవీ ఉపాసన మొదలు పెడితే పూజ ఫలిస్తుంది.. అలాగే దసమహావిద్య లోని దేవతలను పూజిస్తూ ఆరాధిస్తూ ఆ మంత్రం జపం చేసే వాళ్ళు ఆయా దశమ దేవతా రూపాలకు ఉన్న బైరవుడి ని ఆరాధించి ఆ మంత్రం జపించి తర్వాత ఆ దేవత ఆరాధన మొదలు పెట్టాలి.. అప్పుడే ఆ సాధన ఫలిస్తుంది లేకుంటే ఎంత చేసినా ఫలితం త్వరగా రాదు .(దసమహావిద్య అనే పోస్ట్ లో ఏ దేవతకి ఏ భైరవ మంత్రం చదవాలి ఆ మంత్రం కూడా వివరంగా ఇచ్చాను గమనించండి).

రాహుకాలంలో భోజనం చేసిన, స్నానం చేసిన, మైధునం జరిగిన మీరు చేసుకున్న జప ఫలితం, పూజ ఫలితం అంతా రాహువుకి పోతుంది.. ఆ సమయం దాటాక భోజనం చేయాలి లేదా ముందుగా చేయాలి.. అటువంటి పగటి సమయంలో గర్భం నిలిస్తే తల్లితండ్రులను హింసించే పిల్లలు పుడుతారు లేదా పిల్లల వల్ల ఎదో విధంగా బాధ పడుతూనే ఉంటారు..ఇది కొత్త దంపతులు ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాలి. పొద్దు వాలే సమయం అంటే సూర్యుడు అస్తమించే సమయంలో కూడా ఇవే నియమాలు పాటించాలి అయితే సూర్యుడు అస్తమించే సమయంలో స్నానం చేసిన పర్వాలేదు కానీ భోజనం నిద్ర చేయాకుడదు.

మంత్ర జపం చేస్తున్నవారు ఎవరితో గొడవ పడకూడదు, దూషించ కూడదు, అమాయకులను బాధ పెట్టకూడదు ఎవ్వరిని కాలితో తన్న కూడదు...

కాకికి , కుక్కకి తరచుగా అన్నం పెట్టడం వల్ల మీ దోషాలు చాలా వరకు తగ్గుతుంది.. జప సంఖ్య పూర్తి ఐయ్యాక వదిలేయ కూడదు కొద్దిగా అయినా రోజు కాసేపు జపం చేస్తూ ఉండాలి.. 

ఎవరికి సమస్య ఉంటే వాళ్లే చేయాలి మా పిల్లలు చేయరు మేము చేస్తాము అని అడుగుతారు మీ పిల్లలు చేయని విధంగా అలా పెంచింది కూడా మీరే కనుక నచ్చచెప్పే మీరు చేయించాలి లేదా దేవుడికి దండం పెట్టి వాళ్ళ కర్మ అనుకుని ఊరుకోవాలి. లేదా ఇంట్లో శుభకార్యం జరగాలి అని కోరుకొని సుందరకాండ పారాయణం, లలితా సహస్రనామం  పారాయణ చేయండి మీకు మీ కుటుంబానికి మంచి కలుగుతుంది..

🌷శ్రీ మాత్రే నమః🌷

No comments: