Adsense

Monday, October 19, 2020

శ్రీ దేవీ ఖడ్గమాలా స్తోత్రం



శ్రీవిద్యలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం ప్రధానమైనది. శ్రీ చక్రంలో కొలువు తీరిన దేవతలను ఈ స్తోత్రం స్తుతిస్తుంది. ఒక్క ఖడ్గమాల స్తోత్రం చదువుతూ శ్రీ చక్రానికి కుంకుమతో అర్చించినా పూర్ణ శ్రీవిద్యా పూజగా పరిగణింపబడుతుంది....
తీవ్ర సమస్యలు వచ్చినప్పుడు పూర్ణ భక్తి తో ఈ స్తోత్ర పారాయణం చేస్తే వెంటనే రక్షణ లభిస్తుంది. జటిలమైన సమస్యల పరిష్కారానికి ఈ స్తోత్రాన్ని ప్రతి రోజు 11 సార్లు పారాయణం 41 రోజుల పాటు చేస్తూ అన్ని నియమాలను పాటిస్తూ ఆచరించిన యెడల సత్వర సహాయం లభిస్తుంది. చదవలేని వారు ఈ స్తోత్రం ప్రతిరోజూ విన్నా మెరుగైన ఫలితాలు కలుగుతాయి.

శ్రీ దేవీ ప్రార్థన.....

హ్రీంకారాసనగర్భితానలశిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం
సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్జ్వలామ్ |
వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్జ్వలాం
త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీమ్ ||

అస్య శ్రీ శుద్ధశక్తిమాలామహామంత్రస్య, ఉపస్థేంద్రియాధిష్ఠాయీ వరుణాదిత్య ఋషయః దేవీ గాయత్రీ ఛందః సాత్విక కకారభట్టారకపీఠస్థిత కామేశ్వరాంకనిలయా మహాకామేశ్వరీ శ్రీ లలితా భట్టారికా దేవతా, ఐం బీజం క్లీం శక్తిః, సౌః కీలకం మమ ఖడ్గసిద్ధ్యర్థే సర్వాభీష్టసిద్ధ్యర్థే జపే వినియోగః, మూలమంత్రేణ షడంగన్యాసం కుర్యాత్ |

No comments: