Adsense

Sunday, November 22, 2020

జనకుడు

జనకుడు మిథిలా నగరానికి రాజు. రామాయణంలో సీత తండ్రిగా ప్రసిద్ధుడు. ఈయన హ్రస్వరోముడి కొడుకు. జనకునికి సీరధ్వజుడు అనే పేరు కూడా ఉంది. భార్య రత్నమాల. కుశధ్వజుడు ఈతని సోదరుడు. సంతానంకోసం యజ్ఞం చేయదలచి భూమిని దున్నుతుంటే సీత దొరుకుతుంది. యాజ్ఞవల్కుడి వరంతో బ్రాహ్మణత్వాన్ని పొందుతాడు.


జనకుని వంశం
వాల్మీకి రామాయణంలో జనక మహారాజుల వంశక్రమం

నిమి
మిథి - మిథిలా రాజ్య స్థాపకుడు మరియు మొదటి జనకుడు
ఉదవసు
నందివర్ధనుడు
సుకేతు
దేవవ్రత
బృహవ్రత
మహావీర
సుధ్రితి
దృష్టకేతు
హర్యశ్వ
మారు
ప్రతింధక
కృతిరథ
దేవమిధ
విభూత
మహిధ్రత
కీర్తిరాతుడు
మహారోముడు
స్వర్ణరోముడు
హ్రశ్వరోముడు
సీరధ్వజుడు - రామాయణంలోని సీత తండ్రి మరియు కుశధ్వజుడు.
-సేకరణ


No comments: