Adsense

Saturday, March 27, 2021

సమయము

సమయము

           ఆ తల్లి పెరట్లో ఒక గులాబీ మొక్క వేసి తన కుమార్తెతో - అమ్మా....! ఇప్పుడు మనం గులాబీ మొక్క వేసాం కదా...! త్వరలో ఈ మొక్కకు ఒక పువ్వు పూస్తుంది. 

అది ఎంతో అందంగాను, సువాసనభరితముగాను ఉంటుంది అని చెప్పింది. అప్పుడా కుమార్తె ప్రతిరోజు పెరట్లోకి వెళ్లి ఆ గులాబి మొక్కను చూస్తూ ఉండేది. ఈ లోపట ఒక మొగ్గ వచ్చింది. అప్పుడా తల్లి-అమ్మా..! చూసావా మొగ్గ వచ్చేసింది, ఇంకొన్ని రోజులలో ఈ మొగ్గ చక్కగా విచ్చుకొని.. ఎంతో అందముగా, సువాసన వెదజల్లే పువ్వుగా మారుతుందని చెప్పగా... ఆ కుమార్తె ఎంతో సంతోషముతోను, టెన్షన్ తోను-అమ్మా..! పువ్వు రేపటికి వచ్చేస్తుందా లేదా ఎల్లుండుకు వచ్చేస్తుందా, నేను వెంటనే పువ్వు చూడాలి అని తన ఆత్రుతను బయట పెట్టింది. ఈ మొగ్గ పువ్వుగా మారాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలని తన తల్లి చెప్పింది
                

ఇక మూడు లేదా 
నాలుగు రోజులలో ఈ మొగ్గ విచ్చుకోబోతుండగా... ఈ పాప టెన్షన్ తట్టుకోలేక... తన మమ్మీ పనిలో బిజీగా ఉండడం గమనించి, తాను గార్డెన్ లోకి వెళ్లి.. విచ్చుకోవడానికి సిద్ధముగా ఉన్న ఆ మొగ్గ యొక్క రెమ్మలన్నిటినీ తనే తన చేతులతో విప్పేసింది. ఇప్పుడా మొగ్గ ఎంతో కొంత పువ్వులా కన్పిస్తుంది కావున ఆ పాప- అదిగో... పువ్వు వచ్చేసింది. దీనికోసం నేనెందుకు ఇంకో 3 లేదా 4 రోజులు ఆగాలి అని గబ గబా ఆ పువ్వును కోసి... తన తల్లి దగ్గరకు తీసుకెళ్ళి మమ్మీ!

 ఇదిగో నీవు 3 లేదా 4 రోజులు ఆగాలని చెప్పావు కానీ అన్ని రోజులు ఆగాల్సిన అవసరం లేకుండానే నేనే ఆ మొగ్గను పువ్వుగా మార్చేసా.. అని ఎంతో మురిసిపోతూ చెప్పింది.

            అప్పుడా తల్లి- అమ్మా.! నీవు తొందరపడి మొగ్గ యొక్క రెక్కలు విప్పి పుష్పం మార్చావు. కానీ గులాబీ యొక్క ప్రత్యేకత కేవలం కంటికి కనిపించే అందంలోనే కాదు, అది ఇచ్చేటటువంటి సువాసన మీద ఆధారపడి యుంది. నీవు నీ కంటికి కనిపించే రెమ్మలను నీ చేతితో విరిచేసావు కానీ ఇప్పుడు ఒక్కసారి వాసన చూడు అంటే... ఆ పాప వాసన చూడగా సువాసన రావడానికి బదులుగా పసర వాసన వస్తుంది

             ఇదేమిటి మమ్మీ ..! నీవు ఎంతో చక్కని వాసన వస్తుందని చెప్పాను కదా.. వాసనరావడం లేదేమిటి? అని అడిగితే.. అప్పుడా తల్లి- అమ్మా..! తన కొరకు నియమించబడిన సమయాన్ని పువ్వుకు నీవు ఇచ్చినట్లైతే ఆ పుప్పు అందాన్ని, అందంతోబాటు సువాసనను కూడా ఇచ్చేది. ఆ సమయాన్ని తొందరపడి నీ చేతుల్లోకి తీసుకున్నావు కావున చక్కగా పుష్పించాల్సిన పువ్వు అటు అందాన్ని, ఇటు సువాసనను కూడా పోగొట్టుకుంది.

👉నీ భవిష్యత్తుపట్ల, ఉద్యోగంపట్ల, వివాహముపట్ల, పరిచర్యపట్ల, వ్యాపారంపట్ల, విదేశీ ప్రయాణంపట్ల, నీవు చేసే పనిపట్ల, నీవు కలిగియున్న కుటుంబముపట్ల దేవునికి నిర్దిష్టమైన ప్రణాళిక, ఉన్నత ఉద్దేశాలు ఉన్నాయి. 

దాని వెనుక ఆయనకంటూ ఒక సమయము ఉంది. 

ఆయన ప్రకారము, ఆయన సమయము వచ్చేంతవరకు మనం విశ్వాసంతో, ఓర్పుతో మౌనముగానే ఎదురుచూడాలే తప్ప మన చేతులలోకి తీసుకుని మొగ్గను పువ్వుగా మార్చే ప్రయత్నము చేయకూడదు.

ఒకవేళ నీవు అలా చేసే ప్రయత్నము చేస్తే.. నీకు కావలసిన దానిని పొందుకుంటావు అని అనుభవించలేవు ఆనందించలేవు🌹

No comments: