ఉగాది పచ్చడి
ఉగాది రోజున పచ్చడి చేసుకుంటాం. అది కూడా పూర్తిగా స్వాభావికంగా. అంటే, ఏవిధంగానూ పచనం (వండటం) చెయ్యకుండా
తీపి,
పులుపు,
చేదు,
వగరు,
ఉప్పు,
కారం
అనే ఆరు రకాల రుచులు అందించే పదార్థాలు కలిపి తయారుచేసే పచ్చడి ఇది.
👉తీపి, కారం సమానంగా కలపాలి.
👉వీటి మోతాదుకు సగభాగం పులుపు, వగరు,
👉 వీటికి సగభాగం ఉప్పు, చేదు కలపాలి.
ఉగాది పచ్చడిలో ఉపయోగించే పదార్థాలన్నీ శరీరంలో సమతూకాన్ని, ఆరోగ్యాన్ని పెంపొందింపజేస్తాయి.
సంవత్సరం పొడవునా జీవితంలో ఏర్పడే కష్టనష్టాలు, సుఖసంతోషాలను సమానంగా స్వీకరించి ముందుకుసాగాలనే సందేశం ఉగాది పచ్చడిలో ఉంది🌹
No comments:
Post a Comment