కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (కార్పొరేట్ సామాజిక బాధ్యత) కింద ఎన్‌హెచ్‌పిసి లిమిటెడ్ కు చెందిన 2880 మెగావాట్ల దిబంగ్ బహుళార్థ ప్రాజెక్టు (అరుణాచల్ ప్రదేశ్), కోవిడ్-19 టీకాకరణ కోసం అరుణాచల్ ప్రభుత్వానికి కోల్ చైన్ పరికరాలను అందించింది.
శుక్రవారంనాడు అరుణాచల్ ప్రభుత్వానికి చెందిన కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ అయిన డాక్టర్ ఇ.రూమీకి 25 ఐస్‌లైన్డ్ రిఫ్రిజరేటర్లను అందచేశారు. ఇంతకు ముందు,, 07.01.2021న అరుణాచల్ ప్రభుత్వానికి 13 డీప్ ఫ్రీజర్లను అందించారు. సుమారు రూ. 29.7 లక్షల వ్యయంతో కోల్డ్ చైన్ పరికరాలను అందించారు.
ఎన్‌హెచ్‌పిసి లిమిటెడ్ అన్నది దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన జలవిద్యుత్ ప్రయోజన సంస్థ. విద్యుత్ మంత్రిత్వ శాఖ కింద పని చేసే మినీ రత్నా వర్గానికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థ.
Release Id :-1718881
No comments:
Post a Comment