- ‘మంచి ఆరోగ్యం, శ్రేయస్సునకు సుస్థిరాభివృద్ధి (సస్టైనబుల్ డెవలప్‌మెంట్) గోల్-3 దిశ‌గా అంతరాన్ని త‌గ్గించ‌డానికి సైన్స్, టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్‌ను ఉపయోగించడం’ అనే అంశంపై జ‌రిగిన ఉన్నత స్థాయి రౌండ్‌టేబుల్ స‌మావేశంలో ప్ర‌ధానంగా వెల్ల‌డించిన‌ భార‌త్‌

Posted Date:- May 19, 2021

‘మంచి ఆరోగ్యం, శ్రేయస్సునకు సుస్థిరాభివృద్ధి (సస్టైనబుల్ డెవలప్‌మెంట్) గోల్-3 దిశ‌గా అంతరాన్ని త‌గ్గించ‌డానికి సైన్స్, టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్‌ను ఉపయోగించడం’ అనే అంశంపై జ‌రిగిన ఉన్నత స్థాయి రౌండ్‌టేబుల్ స‌మావేశంలో.. కరోనా వైరస్ వ్యాప్తిని అరిక‌ట్టే దిశ‌గా చేస్తున్న ప‌లు ర‌కాల ప్ర‌య‌త్నాల‌ను భార‌త్ ప్ర‌ధానంగా వివ‌రించింది. ఐక్యరాజ్యసమితి-కమిషన్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ డెవలప్‌మెంట్ (యుఎన్-సీఎస్‌డీటీ) యొక్క 24వ సెషన్‌లో భాగంగా జరిగిన ఉన్నత స్థాయి రౌండ్‌టేబుల్‌లో డీఎస్‌టీ కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ తరపున భార‌త ప్ర‌భుత్వ‌పు సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్‌, ఇంటర్నేషనల్ డివిజన్ అధినేత డాక్టర్ ఎస్.కె.వ‌ర్ష్నే సందేశాన్ని అందించారు. సమాజంలో అన్ని వర్గాల వారి ఆరోగ్యం మరియు శ్రేయస్సు యొక్క సంరక్షణ కోసం భారత ప్రభుత్వం ప్రారంభించిన కోవిడ్-19 టీకా డ్రైవ్‌ను గురించి ప్ర‌ధానంగా ఆయ‌న‌ వివ‌రించింది. 18 మే 2021వ తేదీన వ‌ర్చువ‌ల్ విధానంలో ఏర్పాటు చేసిన ఈ ఉన్నత-స్థాయి రౌండ్‌టేబుల్‌లో జాంబియా సమాచార, కమ్యూనికేషన్‌లు మౌలిక సదుపాయాల మంత్రి, ఫిలిప్ఫీన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి, పాకిస్థాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి మరియు విద్యా మంత్రిత్వ శాఖ కార్యదర్శి, నేపాల్ విద్య‌, శాస్త్ర మ‌రియు సాంకేతిక శాఖ మంత్రి, డబ్ల్యూహెచ్‌ఓకు చెందిన ప‌లువు ప్యానలిస్ట్‌తో పాటు, బ్రెజిల్‌కు చెందిన అకాడెమిషియన్, గ్లోబల్ హెల్త్‌లో బోర్డ్ చైర్ ఆఫ్ ఉమెన్, ఐక్యరాజ్యసమితి యంగ్ లీడర్ ఫర్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ త‌దిత‌రులు పాల్గొన్నారు. మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సుకు స్థిరమైన అభివృద్ధి లక్ష్యం-3 అంతరాన్ని త‌గ్గించ‌డానికి సైన్స్, టెక్నాలజీ, ఆవిష్కరణలను ఉపయోగించడం కోసం సంబంధిత ప్రభుత్వాలు ప్రారంభించిన చర్యలు మరియు కార్యక్రమాలపై ప్యానెలిస్టులు మరియు మంత్రివర్గ బృందాలు సుదీర్ఘంగా చర్చించాయి. ముఖ్యంగా కరోనా మహమ్మారి సమయంలో ఈ దిశ‌గా చేసిన ప్ర‌య‌త్నాల‌ను గురించి ప్ర‌ధానంగా చ‌ర్చించారు.

Release Id :-1720004