Posted Date:- May 14, 2021

లక్ష్యాల మేరకు జల్ జీవన్ మిషన్ ను  అమలు చేయడానికి అనుసరించవలసిన వ్యూహంపై భాగస్వామ్య సంస్ధలతో జల్ శక్తి మంత్రిత్వ శాఖకి చెందిన నీరు, పారిశుధ్య శాఖ వెబినార్ ను నిర్వహించింది. జల్ జీవన్ మిషన్ తో జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో కలసి పనిచేయడానికి శాఖ 175 సంస్థలను ఎంపిక చేసింది. 2024 వరకు జాతీయ, రాష్ట్ర జిల్లా స్థాయిల్లో లక్ష్యాల సాధనకు అమలు చేయవలసిన కార్యక్రమాలను ఈ సంస్థలు వార్షిక, త్రైమాసిక ప్రణాళికలను రూపొందిస్తాయి. ఈ అంశాలను చర్చించడానికి నిర్వహించిన వెబినారులో జల్ జీవన్ మిషన్ అదనపు డైరెక్టర్, జల్ జీవన్ మిషన్ మిషన్ డైరెక్టర్ పథకం లక్యాలను వివరించారు. క్షీణిస్తున్న  నీటి వనరులు, నీటి నాణ్యత-సమస్యలు, గ్రామంలో మౌలిక సదుపాయాలు,  నిర్వహణ , వనరుల సామర్థ్యం లేకపోవడం, వివిధ రంగాలకు సరిపడా నీరు అందించడం లాంటి అంశాలపై భాగస్వామ్య సంస్థలు దృష్టి సారించి సమస్యల పరిష్కారానికి ప్రణాళికలను రూపొందించాలని మిషన్ డైరెక్టర్ సూచించారు.  

కార్యక్రమ అమలు , ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ (ఐఇసి) వ్యూహాలు, సామాజిక  సమీకరణ, సామర్ధ్యాన్ని పెంపొందించడం , శిక్షణా కార్యక్రమాల నిర్వహణలో  జాతీయ మిషన్ / రాష్ట్రాలతో కలిసి పనిచేయడం ద్వారా భాగస్వామ్య సంస్థలు  జెజెఎం అమలులో కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు.  విజయవంతమైన నమూనాలను గుర్తించి అమలు చేయడం , ఉత్తమ పద్ధతులను ప్రామానికరించడం , సామాజిక తనిఖీలు నిర్వహించడం , వర్క్‌షాప్‌లు, సమావేశాలు నిర్వహించడం లాంటి కార్యక్రమాలకు భాగస్వామ్య సంస్థలు ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది.   శిక్షణ పొందిన భాగస్వామ్య సంస్థలు గ్రామ / నివాస స్థాయిలో ఈ రంగంలో మాస్టర్ ట్రైనర్‌లుగా పనిచేసి ప్రజలకు శిక్షణ ఇవ్వవలసి ఉంటుంది.

2024 నాటికి దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రతి కుటుంబానికి కొళాయి ద్వారా మంచి నీరు సరఫరా చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న జల్ జీవన్ మిషన్ నుప్రధానమంత్రి 2019 ఆగస్టు 15వ తేదీన ప్రారంభించారు. రాష్ట్రాలతో కలసి జల్ జీవన్ మిషన్ తన కార్యక్రమాలను అమలు చేస్తోంది. జల్ జీవన్ మిషన్ ప్రారంభం అయ్యే నాటికి దేశంలో 3.23 కోట్ల గ్రామీణ కుటుంబాలు (17%) కొళాయి కనెక్షన్ కలిగి ఉన్నాయి. పథకం ప్రారంభం అయిన తరువాత కోవిడ్-19 సమస్య ఎదురైనప్పటికీ ఇంతవరకు జల్ జీవన్ మిషన్ కింద 4.17 కోట్ల కొళాయి కనెక్షన్లను అందిచడం జరిగింది. దీనితో ప్రస్తుతం దేశం 7.41 కోట్ల ( 38.6%)కుటుంబాలు రక్షిత మంచి నీటి సరఫరా సౌకర్యాన్ని కలిగి ఉన్నాయి. 

ప్రధానమంత్రి ఆశయం మేరకు 'సబ్కాసాత్, సబ్కా వికాస్' నినాదాన్ని ఆచరణ లోకి తీసుకొని రావడానికి 61 జిల్లాలు, 732 బ్లాకులు, 89,248 గ్రామాల్లో ప్రతి కుటుంబానికి రక్షిత మంచి నీరు అందించడానికి జల్ జీవన్ మిషన్ ను మరింత  పటిష్టంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం జల వనరుల రంగంలో అనుభవం, అర్హతలు కలిగిన స్వచ్చంధ సంస్థలు, ట్రస్టులు, యుఎన్ సంస్థల షహాయ సహకారాలను తీసుకోవాలని నిర్ణయించింది. తమతో కలసి పనిచేయాలని కోరుతూ మిషన్ ప్రకటన జారీచేసింది. దీనికి స్పందనగా  330 దరఖాస్తులు అందాయి. వీటిని పరిశీలించిన జల్ జీవన్ మిషన్ 175 సంస్థలను ఎంపిక చేసింది. భాగస్వామ్య సంస్థల సహాయ సహకారాలతో జల వనరుల నిర్వహణలో స్థానిక ప్రజలను భాగస్వాములను, కల్పించిన సౌకర్యాలను ఎక్కువ కాలం, సమర్ధంగా వినియోగించడం,నీటి నాణ్యత అంశాలలో భాగస్వామ్య సంస్థల సహకారంతో జల్ జీవన్ మిషన్ పనిచేస్తుంది. 

 Release Id :-1718662