తుపాను ప్రభావిత ప్రాంతాలు, ముఖ్యమైన వంతెనలను అనుక్షణం పర్యవేక్షిస్తున్న ఇంజినీర్ల విభాగాలు
సహాయక బృందాలు త్వరగా రంగంలోకి దిగడానికి వీలుగా అనువైన ప్రాంతాల్లో సహాయక సామగ్రి నిల్వ
రైల్వే కార్యకలాపాల్లో అంతరాయ సమయాన్ని తగ్గించేందుకు, భద్రత కారణాలతో తాత్కాలికంగా సేవల రద్దు జరిగినచోట్ల త్వరగా ప్రారంభమయ్యేలా చూసేందుకు ప్రయత్నాలు
టౌక్టే తుపానును ఎదుర్కొనేందుకు రైల్వే శాఖ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. అవి:
1. జోనల్, డివిజన్ నియంత్రణ విభాగాలు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. దక్షిణ రైల్వే, నైరుతి రైల్వే, కొంకణ్ రైల్వే, మధ్య రైల్వే, పశ్చిమ రైల్వే పరిధుల్లోని స్టేషన్లతో నిరంతరం మాట్లాడుతున్నాయి. అత్యవసర పరిస్థితి ఎదురైతే పర్యవేక్షించడానికి, ప్రణాళిక సిద్ధం చేయడానికి డివిజన్, జోన్ రైల్వే విభాగాలు రాష్ట్ర ప్రభుత్వాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నాయి.
2. అత్యవసర సమాయాల్లో తక్షణం రంగంలోకి దిగేందుకు ప్రమాద సహాయక రైళ్లు (ఏఆర్‌టీ), వైద్య సహాయక వాహనాలు (ఎంఆర్‌వీ), టవర్ వ్యాగన్ల వంటి అత్యవసర విభాగాలను అప్రమత్తం చేశారు.
3. రుతుపవన సమయాల తరహాలో ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.
4. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో గాలి వేగాన్ని పర్యవేక్షిస్తూ, నిబంధనల ప్రకారం రైళ్ల వేగాన్ని తగ్గించారు.
5. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రయాణీకుల రైళ్ల తాత్కాలిక రుద్దు లేదా ముందస్తు రద్దు నిర్ణయం తీసుకుంటారు.
6. ఈ నెల 14వ తేదీన సాయంత్రం 4 గం. నుంచి ఒక విపత్తుల నిర్వహణ విభాగం పని చేస్తోంది.
7. గోవా పోర్టు, వీఎస్‌జీ సహా ఇతర స్టేషన్లకు సేవలు అందించే రైల్వే మార్గాలకు తగిన హెచ్చరికలు పంపుతున్నారు. తుపాను తీవ్రత ఎక్కువగా ఉంటే రైళ్లను నిలిపేస్తారు. ప్రస్తుతం చాలా తక్కువ రైళ్లు నడుస్తున్నాయి.
8. నౌకాశ్రయాల వద్ద రైళ్లలోకి సరకులు ఎక్కించడం, దించడం వంటివి నిలిపేశారు. తుపాను పరిస్థితులను బట్టి ఆయా పనులను సర్దుబాటు చేసుకోవాలని సంబంధిత వర్గాలకు సూచించారు. ప్రాణ, ఆస్తి నష్టాలు లేకుండా చూసుకోవాలని చెప్పారు.
9. తుపాను ప్రభావిత ప్రాంతాలు, ముఖ్యమైన వంతెనలను ఇంజినీర్ల విభాగాలు అనుక్షణం పర్యవేక్షిస్తున్నాయి. సహాయక బృందాలు త్వరగా రంగంలోకి దిగడానికి వీలుగా అనువైన ప్రాంతాల్లో సహాయక సామగ్రిని నిల్వ చేశారు.
10. రాష్ట్రాల వాతావరణ విభాగాలతో రైల్వే శాఖ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ, తదనుగుణంగా చర్యలు తీసుకుంటోంది.
ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించేందుకు విపత్తు నిర్వహణ మార్గదర్శకాలను భద్రత విభాగం జారీ చేసింది. రైల్వే కార్యకలాపాల్లో అంతరాయ సమయాన్ని తగ్గించేందుకు, భద్రత కారణాలతో తాత్కాలికంగా సేవల రద్దు జరిగినచోట్ల త్వరగా ప్రారంభమయ్యేలా చూసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
No comments:
Post a Comment