టీకా తీసుకున్న తరువాత జరుగుతున్న ప్రతికూల సంఘటనలపై ఆరోగ్య మంత్రిత్వశాఖకు సమర్పించిన నివేదికలో పేర్కొన్న కమిటీ

Posted Date:- May 17, 2021

భారతదేశంలో టీకాలు తీసుకున్న వారిలో రక్తస్రావం జరగడం, రక్తం గడ్డ కట్టడంలాంటి సంఘటనలు ఊహించిన స్థాయిలోనే చోటు చేసుకొంటున్నాయని నిపుణుల కమిటీ పేర్కొంది. రక్తస్రావం, రక్తం గడ్డకట్టడంపై అధ్యయనం నిర్వహించడానికి ప్రభుత్వం  ఏఈఎఫ్ఐ ( టీకా తీసుకున్న తరువాత చోటు చేసుకొంటున్న ప్రతికూల ప్రభావాలు ) కమిటీని  చేసింది. అధ్యయన నివేదికను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖకు కమిటీ సమర్పించింది. 

టీకా, ముఖ్యంగా ముఖ్యంగా ఆస్ట్రాజెనెకా-ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ [భారతదేశంలో కోవిషీల్డ్] తీసుకున్న తరువాత రక్తనాళాల్లో రక్తం గడ్డలు పెరిగి రక్త ప్రసారానికి ఆటంకం కలుగుతుందంటూ 2021 మార్చ్ 11వ తేదీన కొన్ని దేశాలు హెచ్చరికలు జారీ చేశాయి. ప్రపంచవ్యాపితంగా నెలకొన్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని దీనిపై అధ్యయనం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో ప్రతికూల  ప్రభావాలపై ఏఈఎఫ్ఐ అధ్యయనం నిర్వహించింది. 

దేశంలో 2021 ఏప్రిల్ మూడవ తేదీనాటికి 75,435,381 (కోవిషీల్డ్ - 68,650,819; కోవాక్సిన్ - 6,784,562) డోసులను ఇవ్వడం జరిగింది. వీటిలో మొదటి డోసును 65,944,106 మంది రెండవ డోసును 9,491,275 మంది తీసుకున్నారని కమిటీ తన నివేదికలో పేర్కొంది. కోవిడ్-19 వాక్సిన్ కార్యక్రమం తరువాత దేశంలోని 753 జిల్లాలకు గాను 684 జిల్లాల్లో 23,000కి పైగా ప్రతికూల ప్రభావాలు కో -విన్ ప్లాట్‌ఫాంలో నమోదయ్యాయని నివేదికలో తెలిపారు. వీటిలో కేవలం 700 కేసుల తీవ్రత ఎక్కువగా ఉందని ( 10 లక్షల డోసులకు 9.3) కమిటీ తన నివేదికలో వెల్లడించింది. 

నమోదైన 498 తీవ్ర సంఘటనలపై కమిటీ లోతుగా సమీక్ష నిర్వహించింది. వీటిలో 26 కేసుల్లో రక్త నాళాల్లో గడ్డలు ఏర్పడి రక్తం గడ్డ కట్టడం దీని ప్రభావం వల్ల మరో నాళంలో రక్త ప్రసారం ఆగిపోయే అవకాశం ఉన్నట్టు అధ్యయనంలో తేలింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ పది లక్షల డోసుల్లో 0.61 కేసుల్లో ఈ పరిమాణం నెలకొంది. 

అయితే, కోవాగ్జిన్ తీసుకున్నవారిలో ఎటువంటి ప్రతికూల ప్రభావాలు కనిపించలేదని కమిటీ తన నివేదికలో పేర్కొంది. 

టీకా తీసుకున్న తరువాత రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడి రక్త ప్రసారానికి ఆటంకం కలిగే ప్రమాదం ఉన్నప్పటికీ ముప్పు వాటిల్లే అవకాశం లేదని కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది. మిలియన్ డోసుల్లో ప్రతికూల ప్రభావాలు చోటు చేసుకున్న సంఘటనలు 0.61 మాత్రమే ఉన్నాయని కమిటీ పరిశీలనలో వెల్లడయింది. యూకే లో ఈ సంఖ్య నాలుగు వరకు ఉండగా జర్మనీ లో 10 వరకు ఉన్నాయి. 

  రక్త నాళాల్లో గడ్డలు ఏర్పడి రక్తం గడ్డ కట్టడం సాధారణమేమని, యూరోప్ దేశాలతో పోల్చి చూస్తే దక్షిణ మరియు ఆగ్నేయ ఆసియా దేశాల్లో ఇది 70 శతం కంటే తక్కువగా ఉందని గతంలో జరిగిన శాస్త్రీయ పరిశోధనల్లో వెల్లడయ్యింది. 

కోవిడ్-10 వాక్సిన్ ముఖ్యంగా కోవిషీల్డ్ వాక్సిన్ తీసుకున్న 20 రోజులలోగా    రక్త నాళాల్లో గడ్డలు ఏర్పడి రక్తం గడ్డ కట్టే అవకాశం ఉందని, ఇది జరిగితే 

*ఊపిరి తీసుకోవడంలో సమస్యలు 

* ఛాతీలో నొప్పి

*ఒళ్ళు నొప్పులు, వాపులు రావడం 

* టీకా ఇచ్చిన ప్రాంతంలో కాకుండా ఇతర ప్రాంతాల్లో ఎర్ర మచ్చలు రావడం 

* వాంతుల లేకుండా లేదా వాంతులతో పాటు కడుపు నొప్పి రావడం 

* గతంలో మూర్ఛ లక్షణాలు లేనప్పటికీ   వాంతుల లేకుండా లేదా వాంతులతో పాటు మూర్ఛ రావడం 

*  వాంతుల లేకుండా లేదా వాంతులతో పాటు తీవ్ర తలనొప్పి రావడం 

* అలసట / శరీరంలో కొంత భాగం లేదా పూర్తి పక్షవాతం రావడం  (ముఖంతో సహా)

*స్పష్టమైన కారణం లేకుండా నిరంతర వాంతులు

*అస్పష్టమైన దృష్టి లేదా కళ్ళలో నొప్పి లేదా  వస్తువు రెండు వస్తువులుగా కనిపించడం 

*మానసిక స్థితిలో మార్పు లేదా గందరగోళం లేదా స్పృహ స్థాయితగ్గడం 

*టీకా తీసుకున్న వ్యక్తి లేదా కుటుంబానికి ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన కలగడం లాంటి పరిస్థితి ఏర్పడితే తీసుకోవలసిన జాగ్రత్తలపై ఆరోగ్యశాఖ మార్గదర్శకాలను జారీ చేస్తోంది. 

భారతదేశంతో సహా అన్ని దేశాల్లో కోవిడ్-19 నుంచి రక్షణ కల్పించే సామర్ధ్యం, మరణాలను తగ్గించే సామర్ధ్యం  కోవిషీల్డ్ కలిగి ఉంది. 2021 ఏప్రిల్ 27వ తేదీ నాటికి దేశంలో 13.4 కోవిషీల్డ్ టీకాలను ఇవ్వడం జరిగింది. కోవిడ్-19 వ్యాక్సిన్ల భద్రతవీటివల్ల చోటుచేసుకునే ప్రతికూల ప్రభావాలపై ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ నిరంతరం సమీక్షలను నిర్వహిస్తోంది. 

 

Release Id :-1719411