సులభమైన డెలివరీ కోసం వ్యాక్సిన్ కారిడార్

2021 మే 15 వరకు విదేశాల నుండి 402.39 మెట్రిక్ టన్నుల వైద్యపరికరాలు, ఔషధాలు వచ్చాయి

మెడికల్ ఆక్సిజన్ సిలిండర్లు మరియు ఇతర వైద్య అవసరాలను తీసుకెళ్లడానికి ఐఎఎఫ్‌కు మద్దతు

కోవిడ్ -19 టీకా శిబిరం నిర్వహించారు

Posted Date:- May 17, 2021

భారతదేశంలోని వివిధ విమానాశ్రయాలు మరియు వాటికి సంబంధించిన కరోనా యోధులు దేశవ్యాప్తంగా అవసరమైన వైద్య సామాగ్రిని తరలించడానికి మరియు పంపిణీ చేయడానికి రాత్రింబవళ్ళు కృషి చేస్తున్నారు. కోవిడ్ -19 మహమ్మారితో దేశం చేస్తున్న పోరాటానికి వైద్య సామాగ్రి రవాణా చేయడంలో చెన్నై విమానాశ్రయం దక్షిణ భారతదేశంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది.  2021 జనవరి 12 నుండి 15 మే 2021 వరకు చెన్నై విమానాశ్రయం దేశీయంగా 44.26 మెట్రిక్ టన్నుల ఇన్‌బౌండ్ వ్యాక్సిన్ మరియు సంబంధిత సరుకును నిర్వహించింది. అందుకున్న టీకాల్లో  ఎక్కువ భాగం పూణే / ముంబై విమానాశ్రయాల ద్వారా కోవిషీల్డ్ వ్యాక్సిన్ రవాణా మరియు హైదరాబాద్ విమానాశ్రయం ద్వారా కోవాక్సిన్ వ్యాక్సిన్ రవాణా ఉంది.

ఏఏఐసిఎల్‌ఎఎస్‌ (ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్) మరియు ఏఏఐ బృందం వ్యాక్సిన్‌లను సులువుగా సజావుగా పంపిణీ చేయడానికి ఒక ప్రత్యేకమైన వ్యాక్సిన్ కారిడార్‌ను  ఏర్పాటు చేసింది. తద్వారా ఈ టీకాలు సమీప రాష్ట్రాలు మరియు జిల్లాలకు మరింత అనుసంధానించబడతాయి. 2021 మే 1 నుండి మే 15 వరకు చెన్నై విమానాశ్రయానికి 9.53 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కాన్సట్రేటర్లు వచ్చాయి.

అంతర్జాతీయంగా చెన్నై విమానాశ్రయం 2021 మే 15 వరకు 402.39 మెట్రిక్ టన్నుల వైద్య అవసరాలను పొందింది. వీటిలో చాలా వరకూ ఆక్సిజన్ కాన్సట్రేటర్లు మరియు హాంకాంగ్, షెన్‌జెన్, సింగపూర్, దోహా, కున్మింగ్, ఇస్తాంబుల్, బ్యాంకాక్, కౌలాలంపూర్ మరియు ఫ్రాన్స్ వంటి విదేశాల నుండి పొందిన వైద్య పరికరాలు ఉన్నాయి.

మెడికల్ ఆక్సిజన్ సిలిండర్లు మరియు దేశవ్యాప్తంగా వేగంగా పంపిణీ చేయడానికి అవసరమైన వాటిని తీసుకువెళ్తున్న భారత వైమానిక దళం (ఐఎఎఫ్) విమాన కదలికలకు విమానాశ్రయం అన్ని విధాలా సహకరిస్తోంది. 1 మే, 2021 నుండి ఐఎఎఫ్‌ 900 ఆక్సిజన్ సిలిండర్లను మరియు సింగపూర్ నుండి 256 ఆక్సిజన్ సిలిండర్లను తీసుకువచ్చింది. ఆక్సిజన్ కాన్సట్రేటర్లు కూడా దేశానికి తీసుకురాబడ్డాయి. గత వారం కూడా చెన్నై విమానాశ్రయం నుండి ఐఎఎఫ్‌ విమానం  లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకర్‌ను ఎయిర్‌ లిఫ్ట్‌ చేసింది. ఇవి అన్నీ కూడా కోవిడ్ ప్రోటోకాల్‌లకు కట్టుబడి ఉన్నాయి.

చెన్నై విమానాశ్రయం ఏఏఐ మరియు ఇతర వాటాదారుల కోసం కోవిడ్ టీకా శిబిరాన్ని నిర్వహించింది మరియు సుమారు 2000 మంది ఫ్రంట్‌లైన్ కార్మికులకు టీకాలు వేశారు. మార్చి 2020 లో కోవిడ్ -19 మొదటి వేవ్ కారణంగా దేశవ్యాప్తంగా మొట్టమొదటి లాక్‌డౌన్ ప్రకటించినప్పుడు చెన్నై విమానాశ్రయంలో కార్గో ఉద్యమం కొనసాగింది. ఒక సంవత్సరం తరువాత మన దేశం మరొక ప్రమాదకరమైన దశ అయిన రెండవ వేవ్‌ కొనసాగుతున్న నేపథ్యంలో చెన్నై విమానాశ్రయం కొవిడ్ 19 కి వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వడానికి అడుగులు వేస్తోంది.

 

Release Id :-1719465