కోవిడ్-19తో ప్రభావితమైన పిల్లలకు బాలల హక్కుల పరిరక్షణ కోసం ఏర్పాటైన నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ( ఎన్‌సిపిసిఆర్) సంవేదన ( సెన్సిటైజింగ్ యాక్షన్ ఆన్ మెంటల్ హెల్త్త్ త్రూ వెల్నరబిలిటీ త్రూ ఎమోషనల్ డెవలప్మెంట్ అండ్ నేసీసరి ఆక్సిప్టెన్స్ ) ద్వారా టెలీ కౌన్సిలింగ్ నిర్వహిస్తూ వారిలో మానసిక ధైర్యాన్ని అందిస్తోంది. కోవిడ్-19 వల్ల పిల్లలు మానసిక సమస్యలకు గురికాకుండా చూడాలన్న లక్ష్యంతో ఎన్‌సిపిసిఆర్ ఈ సౌకర్యాన్ని ఉచితంగా అందుబాటులోకి తెచ్చింది. నిపుణులు/కౌన్సిలర్లు/మనస్తత్వవేత్తలు ఉచితంగా టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా పిల్లలకు ధైర్యాన్ని కలిగిస్తున్నారు. నిమ్హాన్స్ ( నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్) తమిళం, తెలుగు, కన్నడ, ఒరియా, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ వంటి వివిధ ప్రాంతీయ భాషలలో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. 2020 సెప్టెంబరులో ఈ సౌకర్యం ప్రారంభమయ్యింది. కోవిడ్ సమయంలో సమస్యలను ఎదుర్కొంటున్న పిల్లలకు అండగా నిలబడడానికి నిమ్హాన్స్ ఈ సేవలను ప్రారంభించింది. నిమ్హాన్స్ లోని పిల్లల మరియు కౌమార మనోరోగచికిత్స విభాగం ప్రొఫెసర్ డాక్టర్ శేఖర్ శేషాద్రి, ఆయన బృంద సభ్యులు వివిధ టెలీ కౌన్సిలింగ్ విధానాల ద్వారా కోవిడ్-19కి సంబంధించిన వివిధ అంశాలపై పిల్లలకు అవగాహన కల్పిస్తూ వారికి మానసికస్థైర్యాన్ని కలిగిస్తోంది. కోవిడ్-19 వల్ల తమకు ఎదురవుతున్న ఒత్తిడి, ఆందోళన, భయం మరియు ఇతర సమస్యలను టోల్ ఫ్రీ నెంబర్ 1800-121-2830 ద్వారా పిల్లలు తమ మాతృ భాషలో సంవేదన కు వివరించి నిపుణుల సలహాలు సూచనలను పొందవచ్చును. ఈ సౌకర్యం సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు అందుబాటులో ఉంటుంది. సమస్యను వివరించి కౌన్సిలింగ్ ద్వారా పరిష్కారం పొందాలనుకునే పిల్లలకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. మూడు తరగతుల్లో కౌన్సిలింగ్ సేవలు పిల్లలకు అందిస్తున్నారు.
1. క్వారంటైన్ / ఐసోలేషన్ / కోవిడ్ కేర్ సెంటర్లలో ఉన్న పిల్లలు.
2. కోవిడ్ పాజిటివ్ కలిగిన తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యులు మరియు సమీప బంధువులను కలిగి ఉన్న పిల్లలు.
3. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు.
చట్టం ద్వారా బాలల హక్కుల పరిరక్షణ కోసం ఏర్పాటైన నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ( ఎన్‌సిపిసిఆర్) కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నేతృత్వంలో పనిచేస్తోంది.
Release Id :-1719471
No comments:
Post a Comment