ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను, కోవిడ్ 2.0 సమస్యలను అధిగమించడానికి స్టార్టప్ ఆధారిత పరిష్కారాలకు మద్దతు ఇవ్వడానికి.. ప్రస్తుత సంక్షోభంతో దేశం పోరాడడానికి భారతీయ స్టార్టప్ కంపెనీల నుంచి నూతన సాంకేతిక పరిజ్ఞానాలు, వినూత్న ఉత్పత్తుల అభివృద్ధి చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
కోవిడ్ 19 విసురుతున్న సవాళ్ల కారణంగా దేశం, సమాజం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిష్కరించడం లేదా తగ్గించడం కోసం ఆక్సిజన్ ఉత్పత్తి ఉపకరణాలు, పోర్టబుల్ సొల్యూషన్స్, సంబంధిత వైద్య పరికరాలు, డయాగ్నొస్టిక్, ఇన్ఫర్మేటిక్ వంటివాటితోపాటు మరేదైనా పరిష్కారం చూపేలా దేశంలో రిజిస్టర్ చేయబడిన అర్హత కలిగిన స్టార్టప్లకు నిధులు సమకూర్చుకునేలా దరఖాస్తు చేసుకునేందుకు NIDHI4COVID2.0 అవకాశం కల్పిస్తోంది.
దేశం ప్రస్తుతం ఉన్న సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి స్వదేశీ పరిష్కారాలు మరియు వినూత్న ఉత్పత్తులకు మద్దతు ఇవ్వడానికి నేషనల్ సైన్స్ & టెక్నాలజీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ బోర్డ్ (ఎన్‌ఎస్‌టిఇడిబి), సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం (డిఎస్‌టి), భారత ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ డ్రైవ్ చేపడుతున్నాయి.
ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ వంటివి ప్రస్తుతం దేశం దిగుమతి చేసుకుంటోంది. ఈ దిగుమతులకు ప్రత్యామ్నాయాలను అభివృద్ధి చేయడం, ఉత్పత్తి చేయడం కోసం చొరవ చూపే సంస్థలను డీఎస్టీ మద్దతుతో టీబీఐ అన్నిరకాల సహాయసహకారాలిచ్చే సంస్థలుగా పరిగణిస్తుంది. ఉత్పత్తితోపాటు సాంకేతికస్థాయిలను పెంచుకోవడానికి, ఈ ప్రక్రియలను వేగవంతం చేసుకోవడానికి సదరు కంపెనీలకు అవసరమైన ఆర్థిక, మార్గదర్శక మద్దతు అందిస్తుంది. ఇది
వీలైనంత త్వరగా ఉత్పత్తి.. విస్తరణ దశకు చేరుకోవడానికి వారికి సహాయపడుతుంది.
సెంటర్ ఫర్ ఆగ్మెంటింగ్ WAR ను అమలు చేసిన NSTEDB గత అనుభవాల ఆధారంగా కోవిడ్ 19 సంక్షోభాన్నిఎదుర్కొనేందుకు ఈ మేరకు చొరవ తీసుకుంటున్నారు. అంతేకాకుండా నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ డెవలపింగ్ అండ్ హార్నెస్సింగ్ ఇన్నోవేషన్స్(NIDHI - SSS) - సీడ్ సపోర్ట్ సిస్టమ్ పిలుపు మేరకు టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్స్(TBI) ద్వారా స్టార్టప్లకు మద్దతు ఇస్తున్నారు.
"ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ వంటి పరికరాల అభివృద్ధికి తోడ్పడటం, ప్రత్యేక వాల్వ్లు, జియోలైట్ పదార్థాలు, ఇంధన రహిత, శబ్ధం లేని మినియేచర్ కంప్రెషర్లు, గ్యాస్ సెన్సార్లు తదితర అనేక ముఖ్యమైన విడిభాగాలను అభివృద్ధి చేయడం, ఉత్పత్తి చేయడం వంటి వాటికి భారీ అవకాశాలున్నాయి. వివిధ రంగాల్లో కూడా వీటికి విస్తృత అవకాశాలున్నాయి’ అని డీఎస్టీ కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ అన్నారు.
ప్రస్తుత పరిస్థితిలో, కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను మరియు ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురావడంలో స్టార్టప్‌లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. తద్వారా COVID పై కొనసాగుతున్న యుద్ధానికి వ్యతిరేకంగా వివిధ రంగాల్లో మన దేశం బలోపేతం అవుతుంది. కొన్ని స్టార్టప్‌లలో ఇప్పటికే మంచి టెక్నాలజీలున్నాయి. కానీ సదరు కంపెనీలు తదుపరి స్థాయికి వెళ్లడానికి వాటికి ఆర్థిక మద్దతు అవసరం. అలాగే మార్గదర్శకత్వం, మార్కెటింగ్ మద్దతు కూడా అవసరం. అందువల్ల డీఎస్టీ చేస్తున్న ఈ ప్రయత్నం అర్హత కలిగిన స్టార్టప్లకు.. వాటి సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. వాటి ఉత్పత్తి విస్తరణ దశకు చేరుకోవడానికి ఈ మద్దతు ఎంతగానో సహాకపడుతుంది.
ప్రస్తుత సవాళ్లకు ఉత్తమమైన పరిష్కారాలు చూపగల ఆసక్తి కలిగిన స్టార్టప్లు, కంపెనీలు
కేంద్రీకృత పోర్టల్ https://dstnidhi4covid.in ఈ నెల 31వ తేదీ, రాత్రి 12 గంటల లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
మరిన్ని వివరాలు, అర్హతల సమాచారం కోసం https://dstnidhi4covid.in/ ని సందర్శించవచ్చు.
THE COMPLETE BLOG FOR PEOPLE // NEWS, DEVOTIONAL, TECHNOLOGY, LIFE STYLE, SPORTS, ENTERTAINMENT, SCIENCE, ONLINE EARNING, RIDDLES, SILLY QUESTIONS, IMPORTANT DAYS, BEAUTY TIPS, HEALTH
Adsense
Saturday, May 22, 2021
కోవిడ్ సెకండ్ వేవ్‌ను ఎదుర్కోవడానికి నూతన సాంకేతిక పరిజ్ఞానం, వినూత్న ఉత్పత్తులను అభివృద్ధి చేసేందుకు డీఎస్టీ స్టార్టప్ కంపెనీల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
కోవిడ్ సెకండ్ వేవ్‌ను ఎదుర్కోవడానికి నూతన సాంకేతిక పరిజ్ఞానం, వినూత్న ఉత్పత్తులను అభివృద్ధి చేసేందుకు డీఎస్టీ స్టార్టప్ కంపెనీల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
Posted Date:- May 21, 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment