ప్రొఫెసర్ శ్రీ ఎం.ఎస్.నరసింహన్ కన్నుమూతపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా సందేశమిస్తూ- ‘‘ప్రపంచాన్ని విస్తృతంగా ప్రభావితం చేసిన అసాధారణ, అపార ప్రతిభగల గణితశాస్త్ర నిపుణుడుగా ప్రొఫెసర్ ఎం.ఎస్.నరసింహన్ చిరకాలం గుర్తుండిపోతారు. గణితంలోనే కాకుండా ఇతరత్రా సేవలతోనూ ఆయన సమాజంపై తనదైన ముద్ర వేశారు. ఆయన మృతి వార్త నాలో అంతులేని విచార నింపింది. ఈ సంక్లిష్ట సమయంలో ఆయన కుటుంబానికి, బంధుమిత్రులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను... ఓం శాంతి’’ అని ప్రధాని పేర్కొన్నారు.
Professor M. S. Narasimhan will be remembered as an exemplary mathematician, who made a phenomenal impact worldwide. He also made a mark for his work beyond mathematics. Saddened by his demise. Condolences to his family and friends. Om Shanti.
— Narendra Modi (@narendramodi) May 16, 2021
No comments:
Post a Comment