Adsense

Saturday, June 19, 2021

🎻🌹🙏 తిరుమలలో శ్రీవారి ఏకాంత సేవ అంటే ఏమిటి...?

🎻🌹🙏  తిరుమలలో శ్రీవారి ఏకాంత సేవ అంటే ఏమిటి...? 
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

  శ్రీవారి ఏకాంతసేవకే " పర్యంక ఆసనము" , " పాన్పుసేవ "' అని , "పవ్వళింపు సేవ " అని కూడ అంటారు . తిరుమల శ్రీస్వామివారి ఆలయ రోజువారీ కార్యక్రమాల్లో ప్రధానమైన చివరి ఘట్టం ఏకాంతసేవ . ఏకాంతసేవ పూర్తి అయిన వెంటనే ఆలయాన్ని మూసి వేస్తారు . ఇది తిరుమలలో శ్రీవారికి జరుగుతున్న ప్రాచీనమైన సేవగా చెప్పబడుతున్నది . ఇంతటి ప్రాచీనతను సంతరించుకున్న ఏకాంత సేవను ఎక్కడ నిర్వహిస్తారో , ఎలా నిర్వహిస్తారో , ఎవరికి నిర్వహిస్తారో కాస్త పరిశీలించి తెలుసుకుందాం.

  వైఖానసాగమం ప్రకారం భోగ శ్రీనివాసమూర్తిని " కౌతుకమూర్తి , పురుష బేరము " అని అంటారు . ఈ మూర్తినే “ మనవాళ ప్పెరుమాళ్ అని అంటారు . మనవాళన్ అనగా పెండ్లికొడుకు . ఎలాంటి పెండ్లి కొడుకు అంటే నిత్య పెళ్లికొడుకు ! అందుకే ప్రతిరోజు రాత్రి ఏకాంత సేవా సమయంలో పట్టుపాన్పుపై శయనించే నిత్య శోభనమూర్తిగా యోగనిద్రకుపక్రమిస్తూ దర్శనమిస్తూవున్న దివ్యమూర్తి భవ్యమూర్తి ఈ భోగశ్రీనివాసుడు .  ఏకాంతసేవలో పాల్గొంటున్న శయనమూర్తి .!!

ప్రతిరాత్రి ఏకాంతసేవకు వేళకాగానే సర్వదర్శనం నిలిపివేయబడుతుంది . ఏకాంతసేవకు వేళకాగానే సర్వ దర్శనం నిలిపివేయబడుతుంది . ,ఆ వెంటనే శ్రీవారి గర్భాలయంలోను , శయన మండపంలోను శుద్ధి జరుగుతుంది . కులశేఖరపడి
గడపదగ్గర తెరలువేసి లోపల అర్చకులు శ్రీస్వామివారికి నమస్కారం చేసికొని శ్రీస్వామివారి మీద వున్న నిర్మాల్యాన్ని పూర్తిగా తొలగిస్తారు . అనగా శ్రీ స్వామివారి మూలవిరాణ్మూర్తికి అలంకరింప బడివున్న పూలమాలలు అన్నీ తొలగిస్తా రన్నమాట . దీన్నే " నిర్మాల్య శోధన " అంటారు . 


 శ్రీవారి ఆరాధనలో ఇదే చివరి సేవ.ఇది శ్రీవారి గర్బాలయానికి ముందు భాగంలో జరుగుతుంది. వెండి గొలుసులుఉన్న బంగారు మంచం,అందులో పట్టు పరుపులు,పట్టుదిండ్లు మొదలయిన శయన పరికరాలను సిద్దం చేస్తారు. భోగ శ్రినివసముర్తిని శయనాసనంలో వెంచెపు చేయిస్తారు
 
 ఈ శయన మండంపం లోని తూగుటుయ్యాలలోని మెత్తని పట్టుపరుపుపై భోగశ్రీనివాసమూర్తిని శయనింపజేసే సమయంలో సన్నిధి గొల్ల తన చేతిలోని " పొంజు "అనబడే దివిటీతో శ్రీవారు పవ్వళించే మంచానికి ముందు భాగంలో ఇరువైపులా రెండు దీపపు సమ్మెలను వెలిగించి బయటికి వస్తాడు. ఇలా ప్రతిరోజు రాత్రి ఏకాంతసేవ సమయంలో శయనమండపంలోని మంచానికి ముందు రెండు దీపపు సమ్మెల్ని నిత్యమూ వెలిగిస్తూ ఉన్న ఈ సన్నిధి గొల్ల ఎంతటి ధన్యుడో.. 

 శ్రీ తాళ్ళపాక అన్నమయ్య వంశస్థులుచే లాలిపాట " జో అచ్యుతానంద జోజో ముకుందా"  సంకిర్తన,...
శ్రీ తరిగొండ వెంగమాంబ వారి వంశస్తులచే "ముత్యాల హారతి"  నిర్వహిస్తారు.
శ్రీవారి పట్టు పరుపు దగ్గర గోరు వెచ్చని పాలు, వేయించిన జీడిపప్పు, బాదంపప్పు, పండ్ల ముక్కలు ఉంచుతారు.

బ్రహ్మదేవుడు రాత్రివేళ శ్రీవారిని అర్చించడానికి వీలుగా జలపాత్రను,పూజా సామగ్రిని సిద్దం చేస్తారు.

ఏకాంత సేవ నుండి తిరిగి సుప్రభాతం వరకు ,తిరుమల గిరుల్లో, మాడ వీధుల్లో, ఆనందనిలయం లో "దేవతా సంచారం"  మొదలవుతుంది .
ఆ సమయంలో బ్రహ్మ దేవుడుచే శ్రీవారిని అర్చిoచడానికి పెట్టిన  అభిషేక జలాన్ని బ్రహ్మ తీర్థం అని అంటారు.
ఈ బ్రహ్మ తీర్ధాన్ని మరుసటి రోజు సుప్రభాతం అనంతరం భక్తులకు బ్రహ్మ తీర్థం పంచి పెట్టడం జరుగుతుంది..

 ధనుర్మాసంలో మాత్రం భోగశ్రీనివాసుని ఏకాంత సేవలేదు. అప్పుడు శ్రీకృష్ణ స్వామికి ఏకాంతః సేవ ఉంటుంది...(సేకరణ )..💐😊🙏🌹🎻

    🙏 ఓం నమో వెంకటేశాయ 🙏

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

No comments: