Adsense

Sunday, June 20, 2021

🎻🌹🙏 హరిద్వార్...గంగా అవిర్భవము...

🎻🌹🙏 హరిద్వార్...గంగా అవిర్భవము...
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

హరిద్వార్ అంటే హరి కి చేరుకునే ద్వారము. 

ఈ ద్వారం గుండా నే గంగానది హిమాలయాలు వదిలి భారత పీఠభూమి లోకి అడుగు పెడుతుంది. 

దీనినే హరద్వార్ అని కూడా అంటారు.

అంటే శంకరుని చేరు కొనుటకు కూడా ఇదే ద్వారము. 

ఎలా పిలిచినా జీవుడు భగవంతుని చేరుటకు మార్గము. 

కనుక ఈ క్షేత్రానికి భారత దేశపు ఏడు మోక్ష పురముల లో ఒకటి గా పెద్దలు చెప్పారు.

అయోధ్య మధుర మాయా కాశీ కాంచి అవంతిక
పురీ ద్వారవతీ చైవ సప్తైతా మోక్షదాయికా 

ఈ శ్లోకంలో మాయా అని పిలవబడిన క్షేత్రం హరిద్వార్. 

జీవులకు భగవంతుని తెలిసి కొనుటకు అడ్డు పడేదే మాయ. 

మాయ వల్ల సత్యం తెలియక జీవుడు భ్రమ లో పడి పోతాడు. 

ఆ మాయను తీసి వేసి భగవంతుని వైపు వెళ్ళడానికి ద్వారం తెరిచే క్షేత్రం కనుక హరిద్వార్ కు "మాయాపురి" అన్న పేరు వచ్చింది. 

ఒకానొక కాలంలో దక్ష ప్రజాపతి పరిపాలించిన కారణం గా "దక్షేశ్వరము" అని కూడా పిలుస్తారు. 

హరిద్వార్ లో ముఖ్యం గా దర్శించవలసిన ప్రదేశాలు - హరికి పౌరి, మనసా దేవి ఆలయం, చండీదేవి ఆలయం, మాయాదేవి ఆలయం మరియు శ్రీదక్షేశ్వర మహాదేవుని ఆలయం.

హరి కి పౌరి అంటే హరి యొక్క పాదములు అని అర్ధం. 

హరి కి పౌరి గంగానది పై ఉన్న ఘట్టము (ghat). 

ఒకటవ శతాబ్దంలో విక్రమార్క చక్రవర్తి తన సోదరుడైన భర్తృహరి కోసం కట్టించెనని ప్రతీతి. 

ఇక్కడే గంగానది హిమాలయా పర్వత ప్రాంతము దాటి భారతదేశ మైదానం లోకి అడుగుపెడుతుంది. 

ఈ ఘాట్ లో గంగానది ప్రవాహం చుడటానికి రెండు కళ్ళు సరిపోవు. 

నదికి వరదలు వచ్చిన సమయం లో ఇక్కడ గంగమ్మకు ఉండే వేగం అద్వితీయం. 

చేయి నీటి లో పెడితే కోసుకు పోతుందేమో అన్నంత వేగం గా ఉంటుంది ప్రవాహం. 

ఈ ఘాట్లోనే గంగాదేవి, మాయదేవి ఆలయాలు ఉన్నాయి. 

ఈ ఘాట్ బయటే ఉండటానికి, భోజనానికి మంచి హోటళ్లు కూడా ఉన్నాయి.

మోక్ష పురమైన హరిద్వార్ హరి పాదాల ఘాట్ లో గంగాస్నానం ఖచ్చితంగా చేయాలి.

🌹ఈ రోజు
జ్యేష్ఠశుద్ధ దశమి (20/06/2021)

దశపాపహరదశమి, గంగావిర్భావదినం.🌹

ఈరోజు సమీప నదిలో గంగాస్మరణతో స్నానం చేయాలి. నది లభ్యం కానప్పుడు వాపీకూప తటాకాదులు వేటిలోనైనా, లేదా ఇంట్లో స్నానం చేసేటప్పుడైనా గంగా నామస్మరణ చేయాలి.

నందినీ నళినీ సీతా మాలినీ చ మహాపగా!
విష్ణు పాదాబ్జ సంభూతా గంగా త్రిపథ గామినీ!!
భాగీరథీ భోగవతీ జాహ్నవీ త్రిదశేశ్వరీ
ద్వాదశైతాని నామాని యత్ర యత్ర జలాశయే!
స్నానకాలే పఠేన్నిత్యం మహాపాత నాశనమ్!!

ఈ పన్నెండు నామాలతో గంగను స్మరించితే పాప హరణం.

గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానామ్ శతైరపి
ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం స గచ్ఛతి!!
అంబ త్వద్దర్శనాన్ముక్తిః న జానే స్నానజం ఫలం!
స్వర్గారోహణ సోపానే మహాపుణ్య తరంగిణి!!
విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణించ భైరవమ్
వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికామ్!!
అతి తీక్ష్ణ మహాకాయ కల్పాంత దహనోపమ
భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతుమర్హసి!!
త్వం రాజా సర్వ తీర్థానాం త్వమేవ జగతః పితా
యాచితో దేహి మే తీర్థం సర్వ పాపాపనుత్తయే!!
యోsసౌ సర్వగతో విష్ణుః చిత్స్వరూపీ జనార్దనః
స ఏవ ద్రవరూపేణ గంగాంభో నాత్ర సంశయః!!

పది పాపాలను హరించే శక్తి గల దశమిది. ఈరోజున గంగాదేవిని దర్శించి, పూజించి, స్నానం చేస్తే పాపహరమవుతుంది. గంగాస్నానం చేయలేకపోయినా ఏ నదిలోనైనా పదిమారులు మునిగి స్నానం చేయాలి. నల్ల నువ్వులు, నెయ్యి, పేలపిండి ముద్దలను,బెల్లపు ముద్దలను పది సంఖ్యలో గంగలో పడవేయాలి. గంగాదేవిని పూజించి, నారాయణుని, మహేశుని, బ్రహ్మను, సూర్యుని, భగీరథుని, హిమవంతుని, గంధ పుష్పాలతో పూజించాలి.

నమః శివాయై నారాయణ్యై దశహరాయై నమోనమః!! - 

ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించి, పూలతో గంగను పూజించాలి. జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి నుండి దశమి వరకు నిత్యం గంగాస్తోత్రం చదవాలని కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి.
ఇది పఠనీయమైన గంగాస్తుతి. దీనికి 'దశపాపహర గంగాస్తుతి' అని పేరు. దీనిని జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి నుండి దశమి వరకు పారాయణ చేయాలి. దశమినాడు పది మారులు చదవడం మంచిది. ఈ తిథియందే రాముడు రామేశ్వరాన (సేతుబంధ క్షేత్రం) శివలింగాన్ని స్థాపించినట్లు స్కాంద పురాణం 'సేతు మహాత్మ్యం' లో చెప్పబడింది.

ఇటువంటి పరమపవిత్రమెన రోజున ఆ ఈశ్వర సంకల్పం తో మాకు కలిగిన ద్రవ్యాన్ని అన్నదానం కొఱకు వినిమయం చేసే అదృష్టం కలగడం శివసంకల్పం తప్ప మరొకటేదీ కాదు...

ఓం నమశ్శివాయ 🙏🌹🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

No comments: