Adsense

Thursday, June 24, 2021

🎻🌹🙏పూరి జగన్నాధ స్వామి వారి పున్నమి స్నానం*


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

పూరిజగన్నాథుడి ఆలయంలో మూలవిరాట్టుకు నిత్యం అభిషేకాలు ఉండవు. 

అయితే ప్రతి రోజు దర్పణస్నానం నిర్వహిస్తారు.
 అంటే మూల విరాట్టుకు ఎదురుగా ఒక పెద్ద అద్దాన్ని ఉంచి అందులో కనిపించే ప్రతిబింబానికి అభిషేకం నిర్వహిస్తారు. 

 జేష్ట శుద్ధ పౌర్ణమి రోజునఅయితే ఏడాదికి ఒకసారి మాత్రం మూలవిరాట్టుతో పాటు బలభద్రుడు, సుభద్రలకు కూడా అభిషేకం చేస్తారు. 

అభిషేకం పూర్తి అయిన తర్వాత ముగ్గురు దేవతామూర్తులను ఆలయ ప్రాంగణంలోని చీకటి మందిరంలో ఉంచుతారు.  

జలుబు చేస్తుందని నీటిలో తడిసిన దేవతలకు జలుబు చేస్తుందని, జ్వరం వస్తుందని అక్కడి వారి నమ్మకం. అందుకే దేవతా మూర్తులను సరిగ్గా పదిహేను రోజుల పాటు చీకటి మందిరంలో ఉంచి ప్రత్యేక సేవలు చేస్తారు.  
ఆయుర్వేద మూలికలు అంటే స్వామివారికి ఈ పదిహేను రోజుల పాటు సమర్పించే నైవేద్యాల్లో ఆయుర్వేద మూలికలు వాడుతారు.
 ఈ మూలికలు జలుబు, జ్వరం రాకుండా అరికట్టేవి కావడం గమనార్హం. 

ఇక పదిహేను రోజుల పాటు జగన్నాథుడితో పాటు బలభద్రుడు, సుభద్రల దర్శనం ప్రజలకు లభించదు...🌞🙏🌹🎻

🌸 *జై జగన్నాథ్..🌸*

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
🎻🌹🙏అమృత స్నానం..

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌹అమృత_స్నానం పూరీ_జగన్నాథ స్నానోత్సవం సందర్భంగా...🌹

పూరీ జగన్నాథుని ఆలయం సంస్కృతి, ఆచార వ్యవహారాలు చిత్రంగా ఉంటాయి. జ్యేష్ఠ పూర్ణిమ సందర్భముగా పూరీ జగన్నాథుడు రత్నవేదికపైకి చేరి భారీ స్నానం చేస్తాడు. జలాభిషేకంతో తడిసి ముద్దవుతాడు. గజానన అలంకారంతో ముస్తాబై బహిరంగ వేదికపై దర్శనం ఇవ్వడం స్నానోత్సవ విశిష్టత. ఇలా భారీ స్నానం ఆచరించడంతో ఆయన శారీరిక పరిస్థితి అదుపు తప్పుతుంది. చీకటి మండపానికి తరలి వెళ్లి తెరచాటున గోప్య సేవల్ని అందుకుంటాడు. పక్షం రోజుల తర్వాత నిత్య యవ్వన రూపంతో ప్రత్యక్షమవుతాడు. ఏటా నిర్వహించే స్నానోత్సవ సంక్షిప్త సారాంశం ఇది. మొత్తం మీద ఈ పౌర్ణమి నుంచి ఆషాడమాసం వరకూ పక్షం రోజులపాటు దర్శనమివ్వడు.

స్వామి స్నానోత్సవం తర్వాత వానాకాలం పుంజుకుంటుంది. ఈ వానల్లో తడిస్తే సామాన్య మానవుని పీడించే జలుబు, జ్వరము, ఒళ్ళు నొప్పులు వంటి పరిస్థితుల్లో తీసుకోవలసిన జాగ్రత్తల్ని జగన్నాథుని గోప్య సేవలు, ప్రత్యేక నైవేద్యాలు సూచిస్తాయి. 

జ్వరంతో నలిగిన శరీరానికి పత్యపు ఆహార సేవను కొత్త యవ్వనం ప్రదానం చేస్తుందనే స్పృహను జగన్నాధుని స్నానోత్సవ ఘట్టం స్పష్టం చేస్తుంది. విశ్వవ్యాప్త భక్తజనం కంటిలో పడకుండా జగన్నాథుడు కూడా కట్టుదిట్టంగా ఆరోగ్య నియమాల్ని పాటించి, నవ యవ్వనుడుగా ప్రత్యక్షమవుతాడు. ఈ ప్రత్యక్ష దర్శనమే నేత్రోత్సవం, నవ యవ్వన ఉత్సవం అని పిలుస్తారు. రథయాత్ర ముందు రోజు ఈ వేడుక నిర్వహిస్తారు.

ఆరోగ్యమే మహా భాగ్యం సందేశాన్ని జగన్నాథుని స్నానోత్సవం ప్రచారం చేస్తుంది. అయితే జగన్నాథుని మూలమూర్తులు దారు అంటే చెక్కతో తయారుచేసినవి. అభిషేకం ప్రభావంతో మసకతో బాటు దారు విగ్రహాల వన్నె కోల్పోతాయి.ఆ కళల్ని తిరిగి అద్దడం బృహత్తర ప్రక్రియ. దీనిని గోప్యంగా నిర్వహిస్తారు. ఈ వ్యవధిలో సాధారణ ధూపదీపాదులు, నైవేద్యాల నివేదన సాధ్యం కాదు. ఈ ప్రక్రియను నియంత్రించి మూల విరాట్లను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం ప్రధాన వ్యవహారం. కొత్త వస్త్రాలు, రంగులు అద్దుకొని స్వామి ప్రత్యక్షం కావడం నూతన కళాకాంతుల్ని విరజిమ్ముతూ కన్నులకు ఉత్సవ శోభను ప్రదర్శిస్తోంది...🙏🌹🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

No comments: