Adsense

Tuesday, June 22, 2021

🎻🌹🎻 నేడు రామలక్ష్మణ ద్వాదశి



🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

*జ్యేష్ఠశుద్ధ ద్వాదశి రామలక్ష్మణ ద్వాదశి , చంపక ద్వాదశి , ఆదిశంకర కైలాస గమనం*


*ఏకాదశ్యాం సౌవర్ణరామలక్ష్మణౌ సంపూజ్య ద్వాదశమ్యాం బ్రాహ్మణాయ దద్యాత్|* *తథా చోక్తం వరాహపురాణే -*

*జ్యైష్ఠమాసేఽప్యేవమేవ సంకల్ప్య విధినా నరః|*
*అర్చయేత్ పరమం దేవం పుష్పైర్నానావిధైశ్శుభైః॥*
*స్రగ్వస్త్రయుగసంచ్ఛన్నౌ సౌవర్ణౌ రామలక్ష్మణౌ|*
*అర్చయిత్వా విధానేన ప్రభాతే బ్రాహ్మణాయ తౌ॥*
*దాతవ్యౌ మనసా కామమీహతాం పురుషేణ తు॥ ఇతి|*
*తస్మాత్ ఏవ ద్వాదశ్యా రామలక్ష్మణద్వాదశీతి సంజ్ఞా స్యాత్|*


జ్యేష్ఠశుద్ధ ఏకాదశినాడు బంగారముతో రామలక్ష్మణ విగ్రహములను తయారుచేయించి , పూజించి మరునాడు అనగా ద్వాదశి నాడు బ్రాహ్మణులకు దానముచేయవలెనని వరాహపురాణము చెప్పుచున్నది. కనుకనే ఆ ద్వాదశికి రామలక్ష్మణ ద్వాదశి అని పేరుగల్గినది.

ఈ రోజున రామలక్ష్మణులను పూజిస్తే రామానుగ్రహం కలుగుతుంది.  ఉత్కళ రాష్ట్రము మొదలైన కొన్ని ప్రాంతాలలో ప్రత్యేకంగా చంపక ద్వాదశి అను పేరిట , జగన్నాథునకు సంపెంగలు మొదలైన అనేక పువ్వులతో విశేష అర్చనాదులు చేస్తారు. కనుక ఏ ప్రాంతంలోని వారైనా సంపెంగలు మొదలైన పూలతో విష్ణువును ఆరాధించాలి.

షణ్మతస్థాపనాచార్యులైన జగద్గురువులు శ్రీ ఆదిశంకరులు కైలాసగమనం చేసిన రోజు కూడా ఇదే కావడం వలన వారి స్మరణ , పూజాదులు గుర్వనుగ్రహాన్ని కలుగజేస్తాయి....🌞🙏🌹🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

No comments: