20 లక్షల మందికి ఇళ్లలోనే కోవిడ్ సంరక్షణ
కోవిడ్-19 స్వల్ప లక్షణాలు కలిగిన వారికి వారి ఇళ్లలోనే రక్షణ కల్పించడానికి ఉద్దేశించిన " మేము మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతాం ' కార్యక్రమాన్ని పిరమల్ ఫౌండేషన్ తో కలసి నీతీ ఆయోగ్ ప్రారంభించింది. కోవిడ్-19 స్వల్ప లక్షణాలు కలిగినవారికి 112 జిల్లాల్లో అమలు జరుగుతున్న కార్యక్రమంలో జిల్లాల అధికారులకు ఈ కార్యక్రమం కింద నీతీ ఆయోగ్,, పిరమల్ ఫౌండేషన్ తమ సహకారాన్ని అందిస్తాయి.
ఎంపిక చేసిన 112 జిల్లాల్లో స్థానిక నాయకులూ, ప్రజా సంఘాలు, స్వచ్చంధ కార్యకర్తల సహకారంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తారు. కొత్తగా ఎదురవుతున్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించడానికి కార్యక్రమంలో చర్యలను చేపడతారు.
జిల్లా మేజిస్ట్రేట్ అధ్యక్షునిగా వ్యవహరించే కార్యక్రమంలో స్వచ్చంధ సేవా సంస్థలను భాగస్వాములుగా చేస్తారు. దీనికోసం స్థానికంగా పనిచేస్తున్న 1000కి పైగా స్వచ్చంధ సేవా సంస్థలను ఎంపిక చేసి లక్ష మంది స్వచ్చంధ కార్యకర్తలకు శిక్షణ ఇస్తారు. ఇలా శిక్షణ పొందినవారు రోగుల క్షేమ సమాచారాలను తెలుసుకుంటారు. స్వచ్చంధ సేవా సంస్థలు, కార్యకర్తలకు అవసరమైన శిక్షణను పిరమల్ ఫౌండేషన్ అందిస్తుంది.
నీతీ ఆయోగ్ సిఇఓ అమితాబ్ కాంత్ " మేము మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతాము' కార్యక్రమాన్ని ప్రారంభించారు, ఈ సందర్భంగా మాట్లాడిన అమితాబ్ కాంత్ కోవిడ్-19 వల్ల ఏర్పడిన పరిస్థితిని ఎదుర్కోవడానికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారు. కోవిడ్ వల్ల సమస్యలను ఎదుర్కొంటున్న బలహీనవర్గాలకు చెందిన ప్రజలకు జిల్లా యంత్రాంగాల సహకారంతో ఈ కార్యక్రమం ద్వారా అండగా నిలుస్తామని ఆయన చెప్పారు.
కోవిడ్ బారినపడి స్వల్ప లక్షణాలు కలిగినవారిలో 70%మందికి ఇళ్లలోనే సంరక్షణ అందించడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుంది. దీనివల్ల ఆరోగ్య వ్యవస్థపై ఒత్తిడి తగ్గడమే కాకుండా ప్రజలకు ధైర్యం కలిగించడానికి అవకాశం కలుగుతుంది. జిల్లాలకు సరఫరా అయిన ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నాలకు ఈ కార్యక్రమం దోహదపడుతుంది.
ఈ కార్యక్రమం కింద ఎంపిక చేసిన స్వచ్చంధ సేవా సంస్థలు స్వచ్చంధ కార్యకర్తలను గుర్తించి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మార్గదర్శకాల ప్రకారం కోవిడ్ బారిన పడినవారికి వారి ఇళ్లలోనే సంరక్షణ కల్పించడానికి అవసరమైన శిక్షణను ఇస్తాయి. కోవిడ్ నిబంధనలను పాటించే అంశంతో పాటు ప్రతి కార్యకర్త 20 కుటుంబాలకు మానసిక సామాజిక సంరక్షణ కల్పించేవిధంగా శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తారు.
సేవకు తమ సంస్థ ప్రాధాన్యత ఇస్తున్నాదని పిరమల్ ఫౌండేషన్ అధ్యక్షుడు అజయ్ పిరమల్ తెలిపారు. దీనిలోభాగంగానే ఈ కార్యక్రమాన్ని ఎంపిక చేసిన 112 జిల్లాల్లో అమలు చేయాలని నిర్ణయించామని తెలిపారు. ప్రభుత్వం, స్వచ్చంధ సేవా సంస్థలు, సామజిక సంస్థల సహకారంతో ఎంపిక చేసిన జిల్లాల్లో అమలు చేస్తామని తెలిపారు.
***
No comments:
Post a Comment