Posted Date:- Jun 08, 2021

అంగవైకల్యం కలిగిన విద్యార్థులకు ఈ-కంటెంట్ ద్వారా సమగ్ర విద్యను అందించడానికి రూపొందించిన మార్గదర్శకాలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ 'నిశాంక్' ఈ రోజు ఆమోద ముద్ర వేశారు. 

డిజిటల్, ఆన్ లైన్, దూరవిద్య విధానాల ద్వారా అందిస్తున్న విద్యా కార్యక్రమాలకు ఒక  సమగ్ర రూపు ఇవ్వాలన్న లక్ష్యంతో ప్రభుత్వం 2020 మే 17వ తేదీన ఈ-విద్య కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని లక్ష్యాల మేరకు సమర్ధంగా అమలు చేయడానికి కార్యాచరణ ప్రణాళికకు రూపకల్పన చేసి మార్గదర్శకాలను సూచించడానికి విద్యామంత్రిత్వశాఖకి చెందిన పాఠశాల విద్య, అక్షరాస్యతా విభాగం నిపుణుల బృందాన్ని నియమించింది. దీనిలో దివ్యంగ ( వికలాంగ) విద్యార్థులకు ప్రత్యేకంగా ఈ-కంటెంట్ ను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. 

ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఈ-కంటెంట్ ను అమలు చేసి విద్యకు సంపూర్ణ రూపాన్ని ఇవ్వడానికి తొలిసారిగా జరిగిన ప్రయత్నాలకు తుదిరూపు ఇచ్చిన నిపుణుల బృందం వీటిని అమలు చేయడానికి మార్గదర్శకాలను కూడా రూపొందించి తన నివేదికను అందించింది. ' వికలాంగ విద్యార్థులకు ఈ-కంటెంట్ ను అభివృద్ధి చేయడానికి అనుసరించవలసిన మార్గదర్శకాలుపేరిట అందించిన ఈ నివేదికలో 11 విభాగాలు రెండు అనుబంధాలను పొందుపరిచారు. ఈ నివేదికను కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ ఆమోదించింది. 

దివ్యంగ విద్యార్థుల ఈ-కంటెంట్ రూపకల్పన కోసం అమలు చేయవలసి మార్గదర్శకాలు:

*ఈ-కంటెంట్ నాలుగు ప్రధాన అంశాలను దృష్టిలో ఉంచుకుని రూపొందాలి. ఈ-కంటెంట్ అర్ధమయ్యే విధంగా, అమలుచేసే విధంగా, దృఢంగా,గ్రహించే విధంగా ఉండాలి 

*ఈ-కంటెంట్ లో  పట్టికలు, చిత్రాలు, ఆడియోలు, వీడియోల తదితర అంశాలు జాతీయ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి 

* ఈ-కంటెంట్ అందుబాటులో ఉండే వేదికలు ( ఉదాహరణ దీక్ష), / పరికరాలు ( ఈ-పాఠశాల) సాంకేతిక ప్రమాణాలను కలిగి ఉండాలి 

*విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అంశాలను రూపొందించాలి. 

** నివేదికలోని నాల్గవ అధ్యాయంలో సాంకేతిక ప్రమాణాలకు సంబంధించి రూపొందిన మార్గదర్శకాలు 

దశలవారీగా పాఠ్యపుస్తకాలను డిజిటల్ పాఠ్యపుస్తకాలుగా మార్చాలని కమిటీ సిఫార్సు చేసింది.  డిజిటల్ పాఠ్యపుస్తకాలలోని అంశాలు వివిధ రీతుల్లో ( రాతప్రతులు, ఆడియో, వీడియో, సంకేత భాష మొదలైనవి) అందుబాటులో ఉండాలి. ఇవి వినడానికి ఆపివేయడానికి సౌకర్యాలను కలిగి ఉండాలి. వీటిని ఉపయోగిస్తున్న విద్యార్థులు తమ స్పందనను తెలియచేయడానికి వీలుగా రూపొందించాలి. ఎన్‌సిఇఆర్‌టి నివేదికలు జాతీయ అంతర్జాతీయ ప్రమాణాల ఆధారంగా మార్గదర్శకాలకు రూపకల్పన జరిగింది.  అందరికీ అందుబాటులో పాఠ్య పుస్తకాలను  (ముద్రించిన  మరియు డిజిటల్ రూపాల్లో) సిద్ధం చేయాలని, డిజిటల్ పాఠ్యపుస్తకాలు ప్రతి ఒక్కరూ  (అంగవైకల్యం కలిగినవారు, అంగవైకల్యం లేనివారు) ఉపయోగించడానికి అనువుగా ఉండాలన్న   యునిసెఫ్ సూచనను  సెక్షన్ 5 లో పొందుపరిచారు.

* ఆడియో డిజిటల్ పాఠ్యపుస్తకాలను ఏవిధంగా సిద్ధం చేయాలన్న అంశంతోపాటు దివ్యంగుల హక్కుల రక్షణ చట్టం 2016లో పేర్కొన్న 21 రకాల అంగవైకల్యం కలిగిన విద్యార్థుల కోసం విడిగా ఈ-కంటెంట్ సిద్ధం చేయాలని నిపుణుల బృందం తన నివేదికలోని సెక్షన్ 6-9లలో సూచించింది. 

·         కంటెంట్ రూపకర్తలు , కంటెంట్ డిజైనర్లు, అభివృద్ధి చేసేవారు , ప్రచురణకర్తలకు సంబంధించి ప్రత్యేక మార్గదర్శకాలను సెక్షన్ 10 లో పొందుపరిచారు. 

·          మార్గదర్శకాలకు అమలుచేయడానికి అనుసరించవలసిన కార్యాచరణ ప్రణాళికను  నివేదికలోని సెక్షన్ 11 లో చేర్చారు. 

* సంకేత భాషాలో  వీడియోల రూపకల్పనలో అనుసరించవలసిన సమగ్ర మార్గదర్శకాలు మరియు సాంకేతిక ప్రమాణాల వివరాలను   అనుబంధం -1 గా అందించారు. 

·         కంటెంట్ అభివృద్ధి మరియు బోధనా వసతుల కోసం అనుసరించవలసిన అంతర్జాతీయ మార్గదర్శకాలు  నివేదికకు  అనుబంధం 2 గా అందించారు. 

ప్రత్యేక అవసరాలు కలిగినా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్న లక్ష్యాన్ని సాధించడానికి ఈ  మార్గదర్శకాలు ఉపకరిస్తాయి.  అనుభవం మరియు మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం  ఆధారంగా రూపొందిన ఈ మార్గదర్శకాలు ఆచరణ సాధ్యంగా రూపొందాయి. 

 click here for accessing the guidelines

 

Release Id :-1725336