Adsense

Sunday, June 27, 2021

🎻🌹🙏*శ్రీ సత్యనారాయణ వ్రతం చేసుకున్నా, చూసినా, హారతి దర్శించినా, ప్రసాదము స్వీకరించినా అత్యంత ఫలప్రదం*..


🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿

*🌸ఏ రోజున అయినా వ్రతం చేసుకోవడం వలన, ఎన్నో శుభాలను అనుగ్రహిస్తారు స్వామివారు మరీ ముఖ్యంగా పౌర్ణమి రోజున శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం అత్యంత ఫలప్రదం శ్రీ సత్యన్నారాయణ స్వామి వ్రత కథల అంతరర్త్ధం🌸*


పౌర్ణమి నాడు సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకుంటే చాలా మంచిది, వీలుంటే ఇంట్లో గానీ, దగ్గర్లోని ఆలయంలో చేసే సామూహిక సత్యనారాయణ వ్రతంలో గానీ పాల్గొనండి. కనీసం వ్రత కథలు చదువుకుని, స్వామి వారికి నైవేద్యం సమర్పించి, అక్షతలు శిరస్సున ధరించి, ప్రసాదం స్వీకరించినా శ్రీ సత్యనారాయణ స్వామివారి అనుగ్రహం కలుగుతుంది.

సత్యన్నారాయణ స్వామి వ్రత కథల అంతరార్థం

సత్యనిష్ఠులైన వారిలో అరిషడ్వర్గాలకు, ఈర్ష్యాసూయ లకు, అహంకార మమకారాలకు తావుండదు.

ఇలా సత్యనారాయణ స్వామి వ్రత కథలలో మొదటి కథను సాక్షాత్తు నారాయణుడే నారదునికి చెప్పడం విశేషం. ఇది ప్రతి ఒక్కరికి ప్రేరణ కలిగిస్తుంది, సత్యనిష్ఠకు పునాది వేస్తుంది.

నారాయణుడు ఉదాహరణ పూర్వకంగా మరో నాలుగు కథలు వినిపించాడు. వాటిలో తాను గీతలో పేర్కొన్న నాలుగు వర్ణాలను ప్రస్తావించేడు. సదానందుడనే బ్రాహ్మ ణుడు, కట్ట్టెలమ్ముకునే శ్రామికుడు, రాజు వల్ల స్ఫూర్తి పొందిన వైశ్యుని భార్య, లీలావతి, కూతురు కళావతి, చంద్ర కేతువు, తుంగధ్వజుడనే రాజు, గొల్ల్లపిల్లల పాత్రలు ఆ కథల్లో కనిపిస్తారు. సత్యనిష్ఠ వారిలో ఏ విధంగా కలిగింది సూచించబడింది. సత్య ప్రకృతి ఉన్న వారు లౌకిక, పార లౌకిక జీవితాలలో సుఖ సంతోషాలు పొందగలరని ఆశ్వాసన ఇవ్వడం జరిగింది.
బ్రాహ్మణుడు తాను జ్ఞానార్జన చేయడమే కాక సమా జాన్ని నడిపించడానికి తన కర్తవ్యాన్ని ఎలా నిర్వహించాలో ఉపదేశించడం జరిగింది.

ఒక రాజు సత్యవ్రత నిష్ఠుడై లీలావతికి ప్రేరణ కలిగి స్తాడు. భార్య వల్ల స్ఫూర్తిని పొందిన వైశ్యుడు సత్యనారా యణ అనుగ్రహంతో ఐశ్వర్యాన్ని, సంతానాన్ని పొంది అహంకారంతో భగవం తుణ్నమోసం చేయాలనుకుంటాడు. వివేకం నశించి, సత్యనిష్ఠ సడలింది.

పర్యవసానం పశ్చాత్తాపం. పశ్చాత్తప్తులకు భగవంతుడు జ్ఞాన బోధ చేసి సక్రమ మార్గంలోకి తెస్తాడు. క్షత్రియుడు లేదా రాజు సమాజానికి రక్షకుడే కాక అన్ని వర్గాలను సమభావంతో చూడాలి. వర్ణ వివక్షను చూపకూడదు. సత్య ధర్మాల విషయంలో ఉపేక్ష పనికిరాదు. ఉపేక్ష పతనానికి దారితీస్తుంది. తుంగధ్వజుని జీవితం చెప్పే నీతి ఇదే.
కట్టెలమ్మే వాని వద్ద శ్రమ శక్తి ఉంది. గొల్లపిల్లలు సత్యధర్మాలు తెలిసినవారు. వీరంతా సమాజ సేవకులే. వీరందరి అవసరం మిగతా వారికుందని వేరే చెప్పనక్క ర్లేదు. శరీరంలోని వివిధ అంగాల మాదిరే సమాజంలో ప్రతి ఒక్క వర్గానికి ప్రాముఖ్యం ఉంది.

శరీరం ఒక యంత్రం వంటిది. అందులో ఏ ఒక్కచక్రం పనిచేయకపోయినా మొత్తం యంత్రం నిష్ఫలమై పోతుంది. అదే విధంగా శరీరంలో ప్రతి అంగం పనిచేస్తేనే శరీరం నిలబడేది. సమాజమూ అంతే. ప్రతి వర్ణం తమ బాధ్యత తెలుసుకుని కర్తవ్యాన్ని నిర్వహిస్తే సమాజం ముందుకు సాగుతుంది. సత్యనారాయణ వ్రత కథలోని ఈ అంతరార్థాన్ని గ్రహించి తదనుగుణంగా ప్రవర్తిస్తే ప్రత్యేకంగా భగవంతుని అర్చించవలసిన అవ సరం లేదు.

అతడు సర్వాంతర్యామి అందరి హృదయాలలో సాక్షీభూతంగా ఉన్నాడు. ఎవరికేది, ఎప్పుడు, ఎంతెంత కావాలో, ఎప్పుడీయాలో అతనికి తెలుసు. వాటన్నిటినీ ప్రసాదించే భారం తన మీదే ఉంచుకుని శుభం శాంతి ఆనందం అనుగ్రహిస్తాడు.

సందేహించవలసిన అవసరం అంతకన్నా లేదు. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ వ్యష్టిగానో, సమిష్టిగానో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని శ్రద్ధతో ఆచరిస్తే నారాయణుడు నారదునికి చెప్పిన విధంగా 
య: కురుతే సత్యవ్రతం పరమ దుర్లభం
దరిద్రో లభతే విత్తం బద్ధ ముచ్యేత బంధనాత్‌ (వ్రత కథ).

భగవంతుని కృపకు పాత్రులై ఇహ పర లోకాలలో సమస్త ఇష్ట కామ్యాలను అనుభవించి ముక్తులవుతారూ....సేకరణ..🌞🙏🌹🎻

🙏*ఓం శ్రీ రమా సత్యనారాయణ స్వామినే నమః*🙏

🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿

No comments: