Adsense

Saturday, June 26, 2021

తిరుమల.. 20 ప్రశ్నలు

తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుమల.
1.తిరుమల  పూర్వ నామధేయమేమిటి?                Ans.: వరహాపర్వతం.
2.   శ్రీవారిఆలయంలో సరుకులు నిల్వ చేసే గిడ్డంగిని ఏమంటారు? 
Ans. : *ఉగ్రాణం.* 
3.    వెండివాకిలి కి ఇంకో పేరేమిటి?
Ans. : *నడిమిపడికావాలి.*
4.     స్వామివారికి అవసరమయ్యే పూలమాలలు తయారయ్యే ప్రదేశాన్ని ఏమంటారు? 
Ans.:  *పరిమళపు అర.* 
5.    సంపంగి ప్రదక్షిణ లో ప్రసాదాలు నిల్వ ఉంచి విక్రయించే ప్రదేశాన్ని ఏమంటారు?
Ans.: *పోటు.* 
6.   వెండి వాకిలి ఉన్న ప్రాకారం ఎత్తు ఎంత?
Ans. : *30 అడుగులు.* 
7.     విమాన ప్రదక్షిణ మార్గానికి ఇంకో పేరు ఏంటి?
Ans.: *అంగప్రదక్షణ.* 
8.    బంగారు వాకిలి ముందున్న మండపాన్ని ఏమంటారు?
Ans.: *మహామణిమండపం.* 
9.      బంగారు వాకిలి దాటాక వచ్చేమండపాన్ని ఏమంటారు?
Ans.:  *కొలువు మండపం.*
10.     రాములవారి మేడ దాటాక వచ్చే మండపం ఏమిటి?
Ans. : *శయన మండపం.* 
11.         శ్రీవారి డోలోత్సవం ఎక్కడ జరుగుతుంది?
Ans.: *అద్దాల మండపం.* 
12.         అద్దాల మండపానికి ఇంకో పేరేమిటి? 
Ans.: *డోలా మండపం.*
13.          అద్దాల మండపానికి ఎదురుగా ఉన్న మండపం ఏమిటి?
Ans. : *రంగనాయకుల మండపం.*
14.   తిరుమల రాయ మండపంలో ఉన్న విగ్రహం ఎవరిది?
Ans.: *రాజా తొదరమల్లు.* 
15.    ధ్వజ స్థంబాన్ని అనుకుని ఉన్న పీఠాన్ని ఏమంటారు?
Ans.: *బలి పీఠం.*
16.     శ్రీవారి ఆలయాన్ని శుద్ధిచేసే కార్యక్రమాన్ని ఏమంటారు?
Ans. : *కోయిల్ తిరుమంజనం.*
17.       చక్రస్నానం ఏడాదికి ఎన్నిసార్లు చేయిస్తారు?
Ans. : *4 సార్లు.*
18.      విష్ణు సహస్రనామాల్లో ''శ్రీనివాస'' అని ఎన్ని సార్లు వస్తుంది?
Ans.: *2 సార్లు* 
19.    సుప్రభాతం లో ఎన్ని శ్లోకాలున్నాయి?
Ans. : *29*
20.       ఏడాదిలో ఆలయాన్ని ఎన్నిసార్లు తిరుమంజనం చేస్తారు?
Ans. : *4 సార్లు...*
(సేకరణ)

No comments: