Adsense

Friday, July 23, 2021

🎻🌹🙏12 రాశుల్లో జన్మించిన జాతకులు ఏ దేవుళ్లకు.. ఎలాంటి తాంబూలం సమర్పించి ప్రార్థించాలో తెలుసా.

🎻🌹🙏12 రాశుల్లో జన్మించిన జాతకులు ఏ దేవుళ్లకు.. ఎలాంటి తాంబూలం సమర్పించి ప్రార్థించాలో తెలుసా..

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

🌹ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.🌹

12 రాశుల్లో పుట్టిన జాతకులు రాశి ప్రకారం 
ఏ దేవునికి ఏ తాంబూలం సమర్పించి వేడుకుంటే.. ఈతిబాధలు తొలగిపోతాయనేది తెలుసుకుందాం.. 

1. మేషం -
తాంబూలంలో మామిడి పండును ఉంచి మంగళవారంలో కుమారస్వామిని ప్రార్థిస్తే ఈతిబాధలుండవు.

2. వృషభం -
తమలపాకులో మిరియాలు ఉంచి 
మంగళవారం పూట రాహువును స్తుతిస్తే.. కష్టాలుండవు. 
సుఖసంతోషాలు చేకూరుతాయి. 

3. మిథునం -
తమలపాకులో అరటిపండును ఉంచి 
బుధవారం ఇష్టదేవతా పూజ చేస్తే.. 
అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి.

4. కర్కాటకం-
తమలపాకులో దానిమ్మను ఉంచి 
శుక్రవారం పూట కాళిమాతను ప్రార్థిస్తే 
కష్టాలు తీరిపోతాయి.

5. సింహం -
తమలపాకులో అరటిపండును ఉంచి 
గురువారం ఇష్టదేవతా పూజను చేయాలి. 

6. కన్యారాశి -
తమలపాకులో మిరియాలు ఉంచి 
గురువారం ఇష్టదేవతా పూజ చేస్తే.. 
దుఃఖం దూరమవుతుంది. 

7. తులారాశి-
తమలపాకులో లవంగంను ఉంచి 
శుక్రవారం పూట ఇష్టదేవతను స్తుతిస్తే.. 
అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి. 

8. వృశ్చికం-
తమలపాకులో ఖర్జూర పండును ఉంచి మంగళవారం పూట ఇష్టదేవతను పూజిస్తే ఈతిబాధలు తొలగిపోతాయి. 

9. ధనుస్సు -
తమలపాకులో కలకండను ఉంచి 
గురువారం పూట ఇష్టదేవతను పూజించినట్లైతే సుఖసంతోషాలు చేకూరుతాయి.

10. మకరం -
తమలపాకులో బెల్లంను ఉంచి 
శనివారాల్లో కాళిమాతను పూజిస్తే.. 
కష్టాలు తీరిపోతాయి. 

11. కుంభం -
తమలపాకులో నెయ్యిని ఉంచి 
శనివారం పూట కాళిమాతను పూజించినట్లైతే.. దుఃఖాలు తొలగిపోతాయి. 

12. మీనం -
తమలపాకులో పంచదారను ఉంచి 
ఆదివారం ఇష్టదేవతను పూజించినట్లైతే సుఖసంతోషాలు చేకూరుతాయి.

అలాగే..ఈ తాంబూలాన్ని..ఒక ముత్తైదువను పిలిచి ఆమెకు..బొట్టుపెట్టి ఇవ్వవలెను...సేకరణ..🌞🙏🌹🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

No comments: