Adsense

Wednesday, July 14, 2021

🎻🌹🙏నంది నోటి నుండి వచ్చే ఈ తీర్థం ఎలాంటి రోగాలనైనా నయం చేస్తుంది..!

🎻🌹🙏నంది నోటి నుండి వచ్చే ఈ తీర్థం ఎలాంటి రోగాలనైనా నయం చేస్తుంది..!
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

బెంగళూరు అనగానే పచ్చదనం కళ్లముందు కదులుతుంది. చల్లటి వాతావరణం స్నేహంగా పలకరిస్తుంది. అందుకే ఆ ప్రదేశం అందమైన పర్యాటక కేంద్రమైంది. ఈ మహానగరం మాత్రమే కాదు..ఆధ్యాత్మిక పరంగా కూడా ప్రసిద్ది చెందినది.

శివుడి యొక్క వాహనం నందీశ్వరుడు. ప్రతి శివాలయంలో అడుగు పెట్టగానే మనం ముందుగా దర్శనం చేసుకునేది నంది విగ్రహాన్ని. కొందరు నంది కొమ్ముల మద్య నుండి శివుడిని దర్శనం చేసుకుంటే మరికొందరు నంది చెవిలో వారి వారి కోరికలను విన్నవించుకుంటారు. అయితే ఈ ఆలయంలో అద్భుతం ఏంటంటే ప్రతి నిత్యం నంది నోటి నుండి నీరు అనేది శివలింగంపై పడుతుంటుంది. మరి ఈ అద్భుత ఆలయం ఎక్కడ ఉంది. ఈ ఆలయ విశేషాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..


బెంగళూరు మల్లేశ్వరంలో 600ఏళ్ళ నాటి ఆధ్యాత్మిక ఆలయం

బెంగళూరు మల్లేశ్వరంలో 600ఏళ్ళ నాటి ఆధ్యాత్మిక శోభతో వెలసిల్లుతున్న ఆలయం ఒకటి కాడు మల్లేశ్వర స్వామి ఆలయం.

🌹కాడు మల్లేశ్వరాలయం🌹

కాడు మల్లేశ్వరాలయం, ఈ ఆలయం మల్లేశ్వరంలో వుండటం వల్ల దీనికి కాడు మల్లేశ్వర ఆలయం అని కూడా పిలుస్తుంటారు. పరమశివుడికి అంకితమైన 17 వ శతాబ్దం నాటి ఆలయం. 1997లో మల్లేశ్వరంలోని కాడు మల్లేశ్వర దేవాలయం ఎదురుగా ఉన్న వీధిని వెడల్పు చేసే సమయంలో ఓ నంది విగ్రహం బయట పడింది. ఈ విషయం తెలుసుకొన్న పురావస్తుశాఖ అధికారులు ఇక్కడికి వచ్చి పూర్తిగా తవ్వకాలు జరిపిన తర్వాత ఓ దేవాలయమే బయటపడింది


🌹దక్షిణ ముఖ నంది తీర్థం..🌹

నందీశ్వర తీర్థం ఈ ఆలయంకు మరో ప్రధాన ఆకర్షణ. ఇక్కడ నీరు నిరంతరం నంది విగ్రహం నోటి నుండి ప్రవహిస్తూ శివలింగం మీద పడుతుంది. ఈ నీరు వృషభవతి నది మూలం అని చెప్తారు. అటు పై శివలింగం కింద ఉన్న కళ్యాణి లో ఆ నీరు చేరుతుంది. అయితే ఆ నంది నోటి నుంచి వచ్చే నీరు ఎక్కడ నుంచి వస్తుందన్న విషయం ఇప్పటికీ నిఘూడ రహస్యం. నిరంతర శివుడిని అభిషేకించే ఆ నంది నోటి నుండి ప్రవహించే ఆ నీరు ఎక్కండి నుండి వస్తుందనేది ఇప్పటి వరకు ఎవరు కూడా రుజువు చేయకపోవడం విశేషం.


🌹కళ్ళు మిరుమిట్లు గొలిపేలా స్వామి ఆలయం🌹

కళ్ళు మిరుమిట్లు గొలిపేలా స్వామి ఆలయం అంతర్భాగం బంగారు రంగుతో దగ దగ మెరసిపోతూ కనబడుతుంది. అభిషేకంకి అంత సేపు కూర్చోలేని ఆరోగ్య సమస్యలు ఉన్నవారికే అన్నట్టు స్వామి, మెట్లమీద వెనక్కి కూర్చుని చక్కగా కోనేరు నీటిలో స్వామి ప్రతిబింబాన్ని, జలచరాలు తాబేళ్లు, వింత చేపలు కలియ తిరుగుతుంటే, చల్లని సాయత్రం, ప్రకృతి వడిలో చూడటం చక్కని అనుభూతి.

🌹ఆలయ వాతావరణం చాలా ఆహ్లాదంగా🌹

ఆలయ వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉత్తరాదివారి ఆలయంకి వచ్చినట్టు అనిపింస్తుంది. నంది నోటి నుంచి పడుతున్న శుద్ధ జలం మనం ఫిల్టర్ చేసే నీరు కన్నా కూడా శుద్ధంగా వుంది.


🌹కొందరి పరిశోధనల ప్రకారం ఈ ఆలయం 400 సంవత్సరాల నాటిది🌹

కొందరి పరిశోధనల ప్రకారం ఈ ఆలయం 400 సంవత్సరాల నాటిదిగా చెబితే మరికొందరు మాత్రం ఈ ఆలయం ఆరు వేల సంవత్సరాలకు పూర్వం నాటిదిగా చెబుతున్నారు. ఈ ఆలయం 1997 తర్వాత వెలుగులోకి వచ్చినట్టు స్థానికులు చెబుతున్నారు.


🌹ఇక ఈ ఆలయంలో ఉన్న నంది ముఖం దక్షిణం వైపుకి ఉండగా🌹

ఇక ఈ ఆలయంలో ఉన్న నంది ముఖం దక్షిణం వైపుకి ఉండగా, ఆ నంది నుండి వచ్చే నీటిని పవిత్ర జలంలాగ భావిస్తూ ఆ నీటినే తీర్థం అని పిలుస్తుంటారు. ఇక నంది నుండి శివలింగంపై పడిన నీరు పక్కనే ఉండే కొలనులోకి వెలుతాయి. ఈ కొలనుని కళ్యాణి అని పిలుస్తారు. అందుకే ఈ దేవాలయానికి శ్రీ దక్షిణముఖ నంది తీర్థ కళ్యాణి క్షేత్రం అనే పేరు వచ్చిందని చెబుతుంటారు.

ఇలా ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ

ఇలా ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ పైనుండే నంది నుండి శివలింగంపైన నీరు పడటానికి పూర్వం ఎలాంటి టెక్నాలజీ వాడరనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉండగా భక్తులు మాత్రం ఇదంతా ఆ పరమేశ్వరుడి లీలే అంటూ అధిక సంఖ్యలో వస్తూ శివలింగాన్ని దర్శించుకుంటుంటారు...స్వస్తి..🌞🙏🌹🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

No comments: