Adsense

Friday, July 23, 2021

కుంతి మాధవ ఆలయం -పిఠాపురం

🎻🌹🙏కుంతి మాధవ ఆలయం -పిఠాపురం

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
మన దేశంలో కృష్ణుడి ఆలయాలకు కొదవే లేదు. వెన్నదొంగకి ఊరూరా ఆలయాలే. 

అయితే పిఠాపురంలో ఉన్న కుంతీ మాధవ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. 

కొందరు ఈ ఆలయం ఇంద్రుడు ప్రతిష్టించాడని అంటారు, మరికొందరు కుంతీ దేవి ప్రతిష్టించిందని అంటారు.

ఒకానొకప్పుడు ఇంద్రుడు వృత్తాసురుడనే రాక్షసుడిని సంహరిస్తాడు. వృత్తాసురుడు అసురుడైనా పుట్టుకతో బ్రాహ్మణుడు అందువల్ల బ్రహ్మహత్యా పాతకం నుండి తప్పించుకోవడానికి ఇంద్రుడు ఈ భూమి పైన ఐదు వైష్ణవాలయాలను నిర్మించాడు... అవే "పంచ మాధవ క్షేత్రాలు"గా ప్రసిద్ధి చెందాయి. 

అవే బిందు మాధవ ఆలయం - వారణాసి, 
వేణీ మాధవ ఆలయం - ప్రయాగ, 
కుంతీ మాధవ ఆలయం - పిఠాపురం, 
సేతు మాధవ ఆలయం - రామేశ్వరం,
 సుందర మాధవ ఆలయం - తిరువనంతపురం.

కాకినాడకు దగ్గరలో ఉన్న పిఠాపురంలో ఉన్న ఈ ఆలయం చరిత్ర చూసినట్లయితే వేదవ్యాస మహార్షి పిఠాపురం లోని కుక్కుటేశ్వర స్వామిని దర్సిన్చుకోవటానికి ఇక్కడికి వచ్చి దర్శనం పూర్తీ చేసుకుని తిరిగి వెళుతూ ఈ కుంతీ మాధవ ఆలయానికి వస్తాడట. తన దివ్య దృష్తితో ఈ ఆలయం ఇంద్రుడు నిర్మించాడని, పాండవ వనవాస సమయంలో పాండవులు ఇక్కడకి వచ్చి ఉన్నారని, ఆ సమయంలో కుంతీదేవి ఈ మాధవునికి విశేష పూజలు చేసిందని చెప్పారట. కుంతీదేవి వనవాస కాలంలో నిరంతరం ఈ స్వామిని పూజించటం వలన ఈ ఆలయానికి కుంతీ మాధవ ఆలయంగా పేరు వచ్చిందని చెపుతుంటారు.

కుంతీ మాధవుడి పట్టపురాణిని రాజ్యలక్ష్మి అమ్మవారట. ఈవిడకి ప్రతి శుక్రవారం విశేష పూజలు చేస్తారట. ఈ ఆలయంలోని స్వామివారి లీలలు ఎంతో మంది ప్రత్యక్షంగా చూసారని చెపుతుంటారు. ఈ ప్రాంతాన్ని పాలించిన రాజా రావు గంగాధర రామారావుగారికి స్వామివారు కలలో కనిపించేవారని ప్రతీతి.ఏ రోజైనా ఆలయంలో ప్రసాదం రుచిగా లేకపోతే కృష్ణుడు ఈయన కలలో కనిపించి ప్రసాదం ఏమి బాలేదని చెప్పేవారట. రాజా వారు మరునాడు ఆలయానికి వెళ్లి ప్రసాదం ఎంతో రుచిగా వచ్చేటట్టు జాగ్రత్తలు తీసుకునేవారట.

ఇక ఈ ఆలయం లో  జరిగే ఉత్సవాల విషయానికొస్తే మాధవస్వామికి మాఘశుద్ధ ఏకాదశి నాడు కళ్యాణోత్సవం జరుపుతారట. చతుర్దశి నాడు రథోత్సవము కూడా అత్యంత వైభవంగా జరుగుతుందిట. మార్గశిర మాసంలో వచ్చే ధనుర్మాసం నెలరోజులు భక్తులు తిరుప్పావై విన్నవిన్చుకుంటారని ఆలయ వర్గాలు చెప్పాయి. 

ఈ ఆలయ ప్రాంగణంలోనే శ్రీ గోదామ్మవారు, లక్ష్మీ అమృతవల్లి తాయారు, ఆళ్వారుల సన్నిధి ఉన్నాయట.

ఆ మాధవుడి కరుణా కటాక్షాలు మీ మీద కూడా పడాలంటే సామర్లకోట, కాకినాడ పరిసర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు తప్పకుండా కుంతీ మాధవుడిని దర్శించి తరించండి...🚩🌞🙏🌹🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

No comments: