Adsense

Thursday, July 29, 2021

🕉 శివలింగానికి ఎదురుగా నంది లేని ఆలయం ఎక్కడ ఉందో తెలుసా ? 🕉



👉మన దేశంలో ప్రసిద్ధి చెందిన దేవాలయాలకు నిలయం. 
ముఖ్యంగా మన దేశంలో ఏ ప్రాంతానికి వెళ్లిన ఆ శివయ్య ఆలయాలు మనకు దర్శనమిస్తాయి. శివాలయం అనగానే మనకు గర్భగుడిలో శివలింగం శివలింగానికి ఎదురుగా ఆలయంలోనే నందీశ్వరుడు మనకు దర్శనమిస్తాడు. 

👉శివాలయం అంటేనే ఇలాంటి అదృష్టం మన కళ్ల ముందు కదులుతోంది. అయితే మన దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ శివాలయంలో శివునికి ఎదురుగా నంది దర్శనం ఇవ్వదు. మరి ఇలాంటి ఆలయం ఎక్కడ ఉంది?
 ఈ ఆలయ విశిష్టత ఏమిటి అనే విషయాలను  తెలుసుకుందాం...

👉తమిళనాడు రాష్ట్రం, తంజావూరు జిల్లా, ధారసూరం అనే గ్రామంలో శ్రీ ఐరావతేశ్వర స్వామి దేవాలయం ఉంది. ఇక్కడ మనకు రెండు ఆలయాలు దర్శనమిస్తాయి. ఒక ఆలయంలో స్వామివారి దర్శనం ఇవ్వగా మరొక ఆలయంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఈ ఆలయంలో కొలువై ఉన్న స్వామివారిని రాజరాజేశ్వరుడిగా, అమ్మవారిని రాజరాజేశ్వరీ దేవిగా భక్తులు పూజిస్తారు. అయితే ఈ ఆలయాన్ని నిర్మించిన రాజు తన పేరు వచ్చే విధంగా ఈ ఆలయానికి ఐరావతేశ్వర స్వామిగా పిలువబడుతూ భక్తులకు దర్శనమిస్తోంది.

👉 ఇక ఆలయం విషయానికి వస్తే ఆలయం లోపలికి వెళ్లడానికి, బయట వైపు గోపుర ద్వారానికి ఎదురుగా రెండు చిన్న మండపాలు ఉంటాయి. ఈ మండపం ఒక దానిలో మనకు నందీశ్వరుడు దర్శనమిస్తాడు. ఈ ఆలయం ఈ విధంగా స్వామివారి విగ్రహానికి ఎదురుగా కొండా బయటవైపు నందీశ్వరుడు దర్శనమివ్వడం ఈ ఆలయ ప్రత్యేకత అని చెప్పవచ్చు. ఈ ఆలయ గోడలపై ఏక్కడ కూడా ఏ మాత్రం ఖాళీ స్థలం లేకుండా అద్భుతమైన శిల్పాలు చెక్కబడి వున్నాయి. ఈ విధంగా మన దేశంలో ఎక్కడా లేని విధంగా శివలింగం, నందీశ్వరుడు వేరు వేరుగా ఉండి భక్తులకు దర్శనం కల్పిస్తూ ఉండడం ఈ ఆలయంలో చూడవచ్చు.

🙏ఓం నామ శివాయ 🙏

No comments: