Adsense

Thursday, July 29, 2021

సంకటహర చతుర్థి ( అంగారక చతుర్థి )

సంకటహర చతుర్థి ( అంగారక చతుర్థి )


🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️


ఆషాడ మాసం లో వచ్చే *" సంకటహర చతుర్థి " ని  " గజానన "* చతుర్థి అంటారు. అలాగే ఈ చతుర్థి ప్రత్యేకత మంగళవారం కలిసి వస్తుంది. దీన్నే *' అంగారక చతుర్థి '* అంటారు. 
కాబట్టి ఈ నెలలో వచ్చే ఈ పర్వదినానికి ప్రత్యేకత ఉన్నది. మంగళవారం తో కలసి రావడం వలన జాతకం లో కుజదోషము , భూవివాదాలు , కోర్టు సమస్యల్లో అలాగే డబ్బు విషయం లో జరుగుతున్న లావాదేవీల ఇబ్బందులు ఉన్నవారు ఈ చతుర్థిని తప్పకుండా వినియోగించుకొని శ్రీ గజానుణ్ణి పూజించబడి. 
ప్రత్యేకంగా వ్రతం ఆచరిస్తున్నవారితో పాటుగా పైన తెలిపిన  ఇబ్బందులు పడుతున్నవారు ఈ అంగారక చతుర్థి రోజు పూజ చేయండి తప్పకుండా మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది .  ఎర్రని పుష్పలు , గరిక , మోదకాలు సమర్పించి పూజించండి.  గణేశుడి ప్రసన్నతకోసం  5 , 11 , 21 చొప్పున కొబ్బరికాయలు కొట్టండి. మాములుగా దేవతలకు కొబ్బరికాయలు కొట్టినట్టు కాకుండా గణేశుడికి స్వామి ముందు నిలబడి నమస్కరించి కొబ్నరికాయను నేలకు విసిరినట్టు కొట్టాలి . కొబ్బరికాయ ముక్కలు ముక్కలుగా పగిలిపోయే విదంగా ( దిష్టి కొబ్బరికాయ వాహన పూజల్లో కొట్టినట్టు ) 
సంకటనాశక గణేశా స్తోత్రం , గణేశపంచరత్న స్తోత్రం చదివి తప్పకుండా గుంజీలు తీసి నమస్కరించండి.

No comments: