Adsense

Monday, July 5, 2021

🎻🌹🙏 మ‌నుషులు ఈ జ‌న్మ‌లో చేసే పాపాల‌కు మ‌రుస‌టి జ‌న్మ‌లో ఏ జీవులుగా పుడ‌తారో తెలుసా

🎻🌹🙏 మ‌నుషులు ఈ జ‌న్మ‌లో చేసే పాపాల‌కు మ‌రుస‌టి జ‌న్మ‌లో ఏ జీవులుగా పుడ‌తారో తెలుసా ?
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

పున‌ర్జ‌న్మ‌ల‌పై న‌మ్మ‌కం చాలా చాలా త‌క్కువ మందే నమ్ముతారు, కొందరు పున‌ర్జ‌న్మ‌ల గురించి న‌మ్మ‌రు. నమ్మటం, నమ్మక పోవటం మన ఇష్టం. ఇక్కడ ఈ జన్మలో చేసిన పాపాలను బట్టి వచ్చే జన్మలో ఎలా పుడతారు అనేది పురాణాల ప్రకారం ఇవ్వటం జరిగింది. 

పురాణాలలో చెప్పిన వాటిని విశ్లేషించి ఇక్కడ ఏ ఏ పాపాలకు ఎలాంటి జన్మలు ఉంటాయో క్రింద ఇవ్వబడింది.

⭐ శాస్త్రాల‌ను అవ‌హేళిన చేసిన వారు మళ్లీ వ‌చ్చే జ‌న్మ‌లో పాండు రోగంతో పుడ‌తార‌ని పురాణాలు చెబుతున్నాయి.

⭐ స్త్రీల‌ను హత్య చేసే వారు మ‌రుస‌టి జ‌న్మ‌లో ఎల్లప్పుడూ రోగాల‌ను అనుభ‌విస్తూ ఉంటార‌ట‌.

⭐ అబద్దపు సాక్ష్యం చెప్పిన వారు మూగవారుగా పుడతార‌ట‌.

⭐ అబద్దాలను వినేవారు చీమ‌లై పుడతార‌ట‌.

⭐ పుస్తకాలను దొంగిలించే వ్య‌క్తులు గుడ్డివారుగా పుడ‌తార‌ట‌.

⭐ వ్య‌భిచారం చేసే వారు అడ‌విలో ఏనుగులుగా జ‌న్మిస్తార‌ట‌.

⭐ పిలువని పేరంటానికి వెళ్ళినవారు కాకులుగా మ‌రుస‌టి జ‌న్మ‌లో జ‌న్మిస్తార‌ట‌.

⭐ మిత్రుల‌ను అదే ప‌నిగా మోసం చేసే వారు మ‌రుస‌టి జ‌న్మ‌లో గ‌ద్దగా పుడ‌తార‌ట‌.

⭐ భ‌ర్త‌ల‌ను, ఇత‌ర వ్య‌క్తుల‌ను హింసించే స్త్రీలు జ‌ల‌గలుగా మ‌రుస‌టి జ‌న్మ‌లో పుడ‌తార‌ట.

⭐ ఇత‌రుల‌ను మోసం చేస్తూ వ‌స్తువుల‌ను అమ్మేవారు మ‌రుస‌టి జ‌న్మ‌లో గుడ్ల గూబ‌లుగా పుడ‌తార‌ట‌.

⭐ భ‌ర్త‌ల‌ను మోసం చేసే ఆడ‌వారు బ‌ల్లులుగా జ‌న్మిస్తార‌ట‌.

⭐ గురుపత్నితో సంభోగం చేసే వారు తొండ‌లుగా జ‌న్మిస్తార‌ట‌.

⭐ అతిగా కామం కలిగినవారు గుర్రాలుగా పుడ‌తార‌ట‌.

⭐ భార్య‌ల‌ను ఎక్కువ‌గా హింసించే వారు మేక‌లుగా పుడ‌తార‌ట‌...సేకరణ..🌞🙏🌹🎻

 🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

No comments: