Adsense

Thursday, July 15, 2021

జిల్లా కలెక్టర్ అని నామకరణం చేసిందెవరో తెలుసా?


కలకత్తా ను బ్రిటిష్ ఇండియా కు రాజధానిగా ప్రకటించిందితనే. 1911 వరకు కొల్ కత నే మన దేశ రాజధాని.

కలకత్తాలో మొదటి సుప్రీం కోర్టును స్థాపించింది ఇతనే.

మన మనుధర్మ శాస్త్రాన్ని " కోడ్ ఆఫ్ జెంటూ లా" పేరుతో ఇంగ్లీసు లోనికి అనువాదం జరిగింది ఇతని పాలనలోనే.

రాజానందకుమార్ అనే బుర్ద్వాన్ జిల్లా కలెక్టర్ తప్పు చేస్తే  దోషిగా నిర్ణయించి ఉరిశిక్ష విధించింది ఇతనే.

భగవద్గీతను ఆంగ్లంలోనికి charles wilKins అనువదిస్తే దానికి ముందు మాట వ్రాసిందితనే.

హిందూ, ముస్లీంల ధర్మశాస్త్రాలను కోడికరించి, వారి లా ప్రకారం కోర్టులలో విచారించాలని ఆదేశించింది ఇతనే.

రాష్ట్రాలలో,జిల్లాలలో ప్రత్యేక సివిలు, క్రిమినలు కోర్టులను స్థాపించినదితనే. అంతకు ముందు సివిలు క్రిమినలు కేసులకు ఒకే రకం కోర్టులు ఉండేవి.

బెంగాలులో రాబర్ట్ క్లైవు ప్రవేశపెట్టిన  ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థను రద్దు చేసిందితనే.

భారతదేశానికి మొదటి గవర్నర్ జనరలు ఇతనే.

అతడే వారన్ హేస్టింగ్స్ .

20 అక్టోబరు 1773 నుండి 1 - 2-1785 వరకు బెంగాలు గవర్నరు జనరలు (ఇండియా గవర్నరు జనరలుగా) పని చేసిన వారన్ హెస్టింగ్స్ జిల్లాస్థాయి అధికారులకు జిల్లా కలెక్టర్లు అని పేరు పెట్టాడు.

అంతకు ముందు వీరిని జిల్లా సూపర్వైజర్లు అని పిలిచేవారు.
-సేకరణ

No comments: