🎻🌹🙏ప్ర: తీర్థం పుచ్చుకునేటప్పుడు పాటించవలసిన నియమాలు తెలుపగలరు.
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
జ: తీర్థం తీసుకునేటప్పుడు పాటించాల్సిన నియమాలు -
1. తీర్థం యందు ఎప్పుడూ జలం అనే దృష్టి ఉండకూడదు. తీర్థంలో దివ్యశక్తి ఉంటుంది. మనకి దివ్య దృష్టి ఉంటే తీర్థంలో దివ్య జ్యోతి కనిపిస్తుంది. మనకి దివ్య దృష్టి లేకపోయినా దివ్య శక్తిని మనం పుచ్చుకుంటున్నాం అనే శ్రద్ధతో తీర్థాన్ని పుచ్చుకోవాలి.
2. ఒంటి చేయిచాచి తీర్థాన్ని స్వీకరించరాదు.
3. చేతికింద వస్త్రాన్నుంచుకొని, శ్రద్ధగా స్వీకరించాలి. వస్త్రం లేని పక్షంలో చేతికింద చేతినుంచాలి.
4. సాధ్యమైనంత వరకు, నిలబడి తీర్థప్రసాదాలను స్వీకరించరాదు.
5. తీర్థం తీసుకునేటప్పుడు చప్పుడు కాకుండా చూసుకోవాలి.
6. తీర్థం తీసుకున్నాక, ఆ చేతిని తలపై రాసుకోరాదు...సేకరణ..🚩🌞🙏🌹🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
No comments:
Post a Comment