ట్రైబ్స్ ఇండియా: రాబోయే రాఖీ పండుగ మరియు ఇతర బహుమతి అవసరాలకు ఒకే గమ్యస్థానం
సున్నితమైన హస్తకళలు మొదలుకుని లోహ కళాఖండాలు, దుస్తులు మరియు సేంద్రీయ మూలికా ఉత్పత్తుల వరకు ఆకర్షణీయమైన మరియు విస్తృత శ్రేణి గిరిజన ఉత్పత్తులతో ట్రైబ్స్ ఇండియాలో (భౌతిక ఔట్‌లెట్ల నెట్‌వర్క్ మరియు ఆన్‌లైన్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాంలు రెండూ) మీ కుటుంబ సభ్యులు, మరియు స్నేహితులకు బహుమతులు అందించడానికి అవసరమైన అనేక ఎంపికలు అందుబాటులో ఉన్నాయి.
ట్రైబ్స్ ఇండియా కేటలాగ్‌లో ఇప్పుడు ప్రత్యేకమైన రాఖీలు అందుబాటులో ఉన్నాయి. భారతదేశంలోని వివిధ తెగలు చేతితో తయారు చేసిన ఆకర్షణీయమైన రాఖీలు, అలంకరించబడిన లోహ పూజా పెట్టెలు మరియు తోరన్స్ వంటి పూజా వస్తువులను కొనుగోలు చేయవచ్చు. ఇదే కాక పురుషులు మరియు మహిళలు ఇద్దరికీ రంగురంగుల కుర్తాలు, సల్వార్లు, వివిధ రకాల నేత మరియు శైలులలో జాకెట్లు, మరియు మహేశ్వరి, చందేరి, బాగ్, కాంత, భండారా, తుస్సార్, సంభల్‌పురి మరియు ఇకాట్‌లోని చీరలు, దుస్తులు మరియు అందమైన స్టోల్స్ సాంప్రదాయాలు మొదలైనవి ట్రైబ్స్ ఇండియా అవుట్‌లెట్‌లు మరియు వెబ్‌సైట్లలో అందుబాటులో ఉన్నాయి.
గిరిజనుల జీవనోపాధిని ప్రోత్సహించడానికి మరియు వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ మరియు అభివృద్ధి చేయడం ద్వారా వారిని శక్తివంతం చేయడానికి చేసిన ప్రయత్నాలకు అనుగుణంగా, ట్రైఫెడ్ ట్రైబ్స్ ఇండియా నెట్‌వర్క్‌లో అమ్మకానికి ఉన్న విభిన్న మరియు ఆకర్షణీయమైన ఉత్పత్తులను విస్తరిస్తోంది.
137 ట్రైబ్స్ ఇండియా అవుట్‌లెట్‌లు మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం (www.tribesindia.com) వివిధ రకాల బహుమతి అవసరాలను తీరుస్తున్నాయి. సేంద్రీయ హల్ది, ఆమ్ల పొడి, అడవి తేనె, నల్ల మిరియాలు, రాగి, త్రిఫల, మరియు కాయధాన్యాలు పెసర పప్పు, మినపప్పు, వైట్ బీన్స్ మరియు డాలియా వంటి సహజ మరియు రోగనిరోధక శక్తిని పెంచే గిరిజన ఉత్పత్తుల నుండి పెయింటింగ్స్ వంటి కళాఖండాల వరకు వర్లి శైలిలో పటాచిత్రాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే డోక్రా శైలిలో చేతితో తయారు చేసిన ఆభరణాల నుండి ఉత్తరాన వాంచో మరియు కొన్యాక్ తెగల తయారు చేసిన పూసల హారాలు ఉన్నాయి.
తూర్పు ప్రాంతం నుండి గొప్ప మరియు అందమైన వస్త్రాలు మరియు పట్టువస్త్రాలు; రంగురంగుల తోలుబొమ్మలు మరియు పిల్లల బొమ్మలు, డోంగ్రియా షాల్స్ మరియు బోడో వీవ్స్ వంటి సాంప్రదాయ నేత వరకూ; మెటల్ క్రాఫ్ట్ నుండి వెదురు ఉత్పత్తుల వరకు ఏదైనా మరియు ప్రతి రకమైన బహుమతి వస్తువు ఇక్కడ అందుబాటులో ఉంది. అవసరాలు మరియు బడ్జెట్‌ను బట్టి వాటిని ఆకర్షణీయమైన మరియు అనుకూలీకరించదగిన బహుమతి ప్యాక్‌ల్లో అందించబడతాయి. ఈ బహుమతి హాంపర్లు ప్రీమియం సేంద్రీయ, పునర్వినియోగపరచదగిన, స్థిరమైన ప్యాకింగ్ మెటీరియల్‌లో ప్యాక్ చేయబడతాయి. వీటిని ప్రఖ్యాత డిజైనర్ శ్రీమతి రినా ధాకా ప్రత్యేకంగా ట్రైబ్స్ ఇండియా కోసం రూపొందించారు. ఇవి ఏ సందర్భానికైనా అనుకూలంగా ఉండే బహుమతుల కోసం తయారు చేయబడ్డాయి.
ప్రేమ మరియు రక్షణకు సంబంధించిన ఈ పండుగకు మీరు సిద్ధమవుతున్నప్పుడు మీ సమీప ట్రైబ్స్ ఇండియా అవుట్‌లెట్ లేదా వెబ్‌సైట్‌ను దర్శించండి. అలాగే బహుమతులకు అవసరమైన వస్తువులను తిలకించండి.
No comments:
Post a Comment