☀️ ఏడు వారాల నగలు ☀️
ఏడువారాల నగలు అంటే పేరు వినటమే కాని అసలవి ఎలా
ఉంటాయో చాలామందికి తెలియదు. పూర్వము ఏడు వారాల నగలకు ఎంతో ప్రత్యేకత ప్రాముఖ్యత ఉండేది. ఆ ఏడు వారాల నగల గురించి ఎంతో గొప్పగా చెప్పుకునేవారు.
మన పూర్వీకులు మొదటగా గ్రహాల అనుగ్రహము కోసము, ఆరోగ్యరీత్య బంగారు నగలను ధరించేవారట, వారం రోజులు అంటే ఆదివారము మొదలు శనివారము వరకు రోజుకొక బంగారు ఆభరణములను ధరించేవారు, కంఠహారములు, గాజులు, కమ్మలు, ముక్కుపుడకలు, పాపిటబిల్ల, దండెకము(వంకీ), ఉంగరాలు ఇలా చాలా ఆభరణాలు ఉండేవట.
ఆదివారము : సూర్యునికిష్టమైన ఈరోజున కెంపుల కమ్మల,
హారాలు ధరించాలి.
సోమవారము : చండద్రునికిష్టమైన ఈ రోజున ముత్యాలహారాలూ,
గాజులు పెట్టుకోవాలి.
మంగళవారము : కుజునికిష్టమైన ఈ రోజున పగడాలదండాలూ,
ఉంగారాలు అలంకరించుకోవాలి.
బుధవారము : బుధునికిష్టమైన ఈ రోజున పచ్చల పతకాలూ,
గాజులు వేసుకోవాలి.
గురువారము : బృహస్పతికిష్టమైన ఈ రోజున పుష్పరాగపు
కమ్మలూ, ఉంగరము చేయించుకోవాలి.
శుక్రవారము : శుక్రునికిష్టమైన ఈ రోజున వజ్రాల హారములూ,
ముక్కుపుడక ధరించి లక్ష్మీదేవిలా మీ వాళ్ళకి దర్శనమివ్వాలి.
శనివారము : శనికిష్టమైన ఈ రోజున నీలమణితో చేయించుకున్న
కమ్మలూ, హారాలూ, ముక్కుపుడకా ధరించాలి.
ఇవీ ఏడు వారాల నగలు. ఆయా రోజుల్లో ఆయా నవరత్నములతో
పాపిడి బిళ్ళ, వంకీలూ ఇలా ఎన్నయినా చేయించుకోవచ్చు. ఆ రోజు ఆ రత్నం సంబంధించినవి బంగారంతో చేయించి పెట్టుకోవటమంటే అంతకు మించిన వైభోగము ఇంకేమీ ఉండదు.
🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯
No comments:
Post a Comment