🎻🌹🙏*గోరింటాకు చరిత్ర*
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
🌹*అసలు పేరు గౌరింటాకు…*
*గౌరి ఇంటి ఆకు….*🌹
గౌరీదేవి బాల్యంలో చెలులతో
వనంలో ఆటలాడే సమయాన
రజస్వల ఔతుంది. ఆ రక్తపు చుక్క నేలతాకినంతనే
ఓమొక్క పుడుతుంది.
ఈవింతను చెలులు పర్వతరాజుకుచెప్పగా సతీసమేతంగా చూసేందుకు
వస్తాడు. అంతలోనే ఆ చెట్టు పెద్దదై నేను సాక్షాత్పార్వతీ రుధిరాంశతో జన్మించాను,
నావలన లోకానికి
ఏఉపయోగం కలదూ అని అడుగుతుంది.
అపుడు పార్వతి(గౌరి) చిన్నతనపు చపలతతో ఆచెట్టు ఆకు కోస్తుంది. ఆమె వేళ్లు ఎర్రబారిపోతాయి.
అయ్యో బిడ్డచేయి కందిపోయినదనుకునే లోపుగానే పార్వతి నాకు ఏవిధమైనబాధా కలుగలేదు
పైగా చాలా అలంకారంగా అనిపిస్తోందీ అంటుంది.
పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యం చిహ్నంగా ఈ గౌరింటాకు మానవలోకంలో
ప్రసిధ్ధమవుతుంది. రజస్వల సమయాన ఉద్భవించిన ఈచెట్టు,స్త్రీలగర్భాశయ దోషాలు తొలగిస్తుంది. అతిఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. తనవర్ణం వలన చేతులకు, కాళ్లకూ అందాన్నిచ్చే
అలంకారవస్తువుగా వాడబడుతుంది.
అదే ఈచెట్టుజన్మకు సార్ధకత అని పలుకగా గౌరితో సహా అందరూ ఆ చెట్టు ఆకుల పసరుతో చేతులు కాళ్లూ అందంగా తీర్చుకుంటు ఉంటారు.
ఆసమయంలో కుంకుమకు సందేహం కలుగుతుంది. నుదుటన కూడాఈ ఆకు వలన
బొట్టు దిద్దుకుంటారేమో!!
నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమోనని గౌరితో
ఆసందేహం చెప్పగా…. నుదుటన పండదు అంటుంది. కావాలంటే చూడండీ గోరింటాకు నుదుటన పండదు.
ఇక శాస్త్రపరంగా గర్భాశయదోషాలు తీసేస్తుంది.
అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే
ప్రధాననాడులుంటాయి.
వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేసి
ప్రశాంతపరుస్తుందిగోరింటాకు.
ప్రసవం కాగానే గోరింటాకు ముద్దగా నూరి ఆబాలింతచేత మింగిస్తే ప్రసవంవలన ఏర్పడే గర్భాశయబాధలు నయం ఔతాయి.
ఇక మొగుడికీ గోరింటకుకి గల అనుబంధం
స్త్రీలోని స్త్రీత్వపు హార్మోనుల పనితీరు చక్కగా ఉన్నందు వలన దేహంకూడా
అందంగా సున్నితంగా ఉంటుంది.
అలా లేతగా ఉన్నచేతపెట్టుకున్న గోరింటాకు
మరింత అందంగా పండి కనిపిస్తుంది.
ఆ పండటం
అనేది ఆమగువ ఆరోగ్యాన్ని
సూచిస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం.
అందంగా ఉన్నమ్మాయికి చక్కనిభర్త వస్తాడూ ఆరోగ్యకరమైన దాంపత్యానికి కారణమైన భార్యను ప్రేమిస్తాడుకదా….
పెద్దోళ్ళు ఏంచెప్పినా మరీ ఓ పది పన్నెండు మైళ్ల దూరదృష్టి
తోనే చెబుతారండీ.
అపోహలేం కాదు. గోరింటి ఆకును అందరం శాస్త్రీయంగా ఆదరిస్తే మనకూ అన్నివిధాలా ఆరోగ్యం ఆనందం.
సంవత్సరానికోమారు పుట్టింటికి పోతుందండోయ్. అంటే పార్వతి దగ్గరికి.
ఆషాఢమాసంలో అక్కడున్నపుడు కూడా తనను
మరచిపోకుండా ఉండాలని తప్పక పెట్టుకోవాలనీ కోరిందట.
*ఇలా ఆషాఢంలో అందరూ పెట్టుకుంటారుకదూ...*
ఓం నమః శివాయ..🙏🌹🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
No comments:
Post a Comment