Adsense

Wednesday, July 7, 2021

గణేశుని వివిధ నామాలను అర్చిస్తే..

🎻🌹🙏*🌺 గణపతి 🌺*

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
గణేశుని వివిధ నామాలను పరికిస్తే అందు “లక్ష్మీ గణపతి, విద్యా గణపతి, విజయ గణపతి మొదలైన నామాలు ఉంటాయి. అనగా లక్ష్మి, సరస్వతి, దుర్గ ఇచ్చే వన్నీ గణపతి  ఇస్తాడన్న మాట. అంతేకాదు సర్వసిద్ది ప్రద గణపతి అనగా అన్నిటినీ ఈయగలడు. అందువల్ల సమస్త దేవతల కంటె గణపతి అధికుడు.

శివుని గణాలకు అధిపతి  కనుక గజేశుడని, గణపతి అని పిలుస్తారు. ఇతని కంటె మరొక అధిపతి లేడు, నాయకుడు లేడు కనుక ఇతడు గణపతి, గణేశుడు, వినాయకుడయ్యాడు. దేవతలందరికంటె ముందుగా పూజలందుకుంటున్నాడు. 

అందరికీ ఇష్టుడు. శివునకు సంబంధించిన లింగం, అమ్మవారు, సుబ్రహ్మణ్యస్వామి, విష్టలాయంలో ఉండవు. కాని వినాయక ప్రతిమలు మాత్రం ఉంటాయి. ఆయన శివ కుటుంబానికి 
చెందినవాడైనా! 🙏🌹🎻

        🌺 ఓం గణేశాయ నమః 🌺

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

No comments: