(అ) ఆణిముత్యము అంటే -- ఆణి = గుండ్రని. గుండ్రంగావున్న ముత్యం.
(ఆ) కూష్మాండం బద్ధలైతుంది -- కూష్మాండం = గుమ్మడిపండు. గుమ్మడిపండును పగులగొట్టి శుభకార్యం మొదలుపెట్టడం హిందువుల ఆచారం.అది యుద్ధానికైనా సరే గుమ్మడిని దిగదీసి (అనగా దృష్టిదోష నివారణకు) నేలకేసికొట్టడం అనవాయితి. కూష్మాండం బద్ధలైతుందంటే రణం మొదలైతుందని అర్థం.
(ఇ) ఇంగ్లీషు Switch కు సరైన తెలుగుపదం = మీట. మీటనొక్కాననుకో బాంబు పేలిపోతుంది జాగ్రత్త. బిస అని కూడా అంటారు.
(ఈ) వియ్యంకుడు = వియ్యమందినవాడు వియ్యంకుడు. వివాహసంబంధం ఏర్పరచుకొన్నవాడు.
(ఉ) న్యాయస్థానంలో వాజ్యం నడుస్తోంది. వాజ్యం కాదది వ్యాజ్యం, అంటే తగవని భావం.
(బుు) ఏట్రా మీ సొంటి కబుర్లు.సొంటి అంటే ఎండబెట్టిన అల్లం, కాబట్టి సొంటి కబుర్లు అనరాదు.సొంటు కబుర్లు అనాలి. సొంటు అంటే తప్పు, దోషం.సొంటి (తప్పు) గా మాట్లాడరాదు.
(దీర్ఘం బుు) అలక ? అలగడం ? అలక = అలకాపురం = కుబేరుడి రాజధాని. అలగడం = అలిగిపుట్టింటికి పోయింది.
(ఎ) కొప్పరపు సోదరకవులు = తెలుగు సాహిత్య అవధానంలో ప్రసిద్ధిచెందిన జంట సోదర కవులు. వీరు ప్రకాశం జిల్లా కొప్పరం గ్రామంలో వేంకటరాయలు, సుబ్బమాంబ దంపతులకు జన్మించారు. వీరిలో పెద్దవాడు కొప్పరపు వేంకటసుబ్బరాయ కవి జననం = నవంబరు 12, 1885 మరణం మార్చి 29, 1932. రెండవవాడు కొప్పరపు వేంకటరమణ కవి, జననం = డిసెంబరు 30, 1887 మరణంమార్చి 21, 1942. వీరి గురువులు (1) రామడుగు కృష్ణశాస్త్రి, (2) పోతరాజు రామకవి. ఈ సోదరులిరువురు పదహారేళ్ళు నిండకనే ఆశుకవిత్వాన్ని ప్రదర్శించి కొప్పరపు సోదర కవులుగా పేరుపొందారు.
కొప్పరమంటే విజృంభించుట, శిఖరమనే అర్థాలున్నాయి. సోదరులు ఊరిపేరును ఇంటిపేరుగా కలిగినా, అది వారి ప్రతిభకు సరిగా సరిపోయింది.
(ఏ) వాడివి వట్టిబీరాలే, వాడు బీరాలు పలుకుతాడు కాని ఏమి చేతకాదు. బీరాలు అంటే చేతకానితనం, ప్రగల్భాలని కాదు. బీరమంటే పరాక్రమం.
(i) నరకయాతన - - యాతన = తీవ్రమైన బాధ. నరకయాతనంటే నరకంలోపడే అంతులేని బాధలు. అలవికాని కష్టాలు. అలవి = కొంచెం.అలవికాని కష్టాలంటే కొంచెం బాధలే.
- సేకరణ
No comments:
Post a Comment