Adsense

Thursday, July 29, 2021

ప్రతీ ఇంట్లో తప్పకుండా ఉండవలసిన శ్రీ దక్షిణామూర్తి చిత్రం - LORD DHAKSHINA MURTHY

.
ఇంట్లో ఒక్క దక్షిణామూర్తి చిత్ర పటము పెట్టి, ప్రతీ రోజూ 10 నిమిషాలు ఆయన ముందు కూర్చుని, ఆయన స్తోత్రమును కానీ, మంత్రమును కానీ చేస్తే వచ్చే ఫలితము ఇంత అని చెప్పలేము. అపమృత్యువు తొలగిపోతుంది, మేధా శక్తి పెంపొందుతుంది, ధారణ, స్పష్టత కలుగుతాయి. కేవలము విద్యార్ధులకు మాత్రమే కాదు, అన్ని వయసుల వారికీ ఇది వర్తిస్తుంది. మంచి ఆలోచనలు కలుగుతాయి, సత్వ గుణం వృద్ధి చెందుతుంది, ప్రారబ్ధ కర్మలు, దుష్కర్మల ఫలితం క్షీణిస్తుంది, ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి. 

స్తోత్రము లేదా మంత్రము చదవలేని వారు ఉంటే కేవలము శ్రీ దక్షిణామూర్తి చిత్రపటాన్ని అలా చూస్తూ కూర్చున్నా విశేష ఫలితము ఉంటుంది. రాబోవు జన్మలలో కూడా దక్షిణామూర్తి అనుగ్రహం వలన మంచి విద్య వస్తుంది. ఒక్కసారి దక్షిణామూర్తిని శరణంటే జన్మజన్మల వరకూ ఆయన మనల్ని వదిలిపెట్టడు, ఇది సత్యం సత్యం సత్యం. మీ ఇంట్లో ఎవరైనా పెద్దలు కానీ, నడవలేని స్థితిలో ఉన్నవారు కానీ ఉంటే వారికి కనిపించేలా శ్రీ దక్షిణామూర్తి చిత్రపటాన్ని పెట్టండి. ఆ చిత్రపటాన్ని చూస్తూ ఉండమని చెప్పండి, అపమృత్యువు కలగదు.

 ఈ స్తోత్రం ఎటువంటి ఉపదేశమూ పొందకుండా కూడా  చేసుకోవచ్చు. స్త్రీలు కూడా నిత్యమూ   చేసుకోవచ్చు. వారికి ఇబ్బంది దినములలో చిత్రపటాన్ని చూస్తూ ఉన్నా చాలు.

🌿ఓం శ్రీ గురు దక్షిణామూర్తయే నమః🌿

🌱శ్రీ దక్షిణామూర్తి స్తోత్రము🌱

శాంతిపాఠః
ఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వం
యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై |
తంహదేవమాత్మ బుద్ధిప్రకాశం
ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే ||

ధ్యానమ్
ఓం మౌనవ్యాఖ్యా ప్రకటితపరబ్రహ్మతత్వంయువానం
వర్శిష్ఠాంతేవసదృషిగణైరావృతం బ్రహ్మనిష్ఠైః |
ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం
స్వాత్మరామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే ||

వటవిటపిసమీపే భూమిభాగే నిషణ్ణం
సకలమునిజనానాం జ్ఞానదాతారమారాత్ |
త్రిభువనగురుమీశం దక్షిణామూర్తిదేవం
జననమరణదుఃఖచ్ఛేద దక్షం నమామి ||

చిత్రం వటతరోర్మూలే వృద్ధాః శిష్యాః గురుర్యువా |
గురోస్తు మౌనవ్యాఖ్యానం శిష్యాస్తుచ్ఛిన్నసంశయాః ||

ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే |
నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః ||

గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |
గురుస్సాక్షాత్ పరం బ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః ||

నిధయే సర్వవిద్యానాం భిషజే భవరోగిణామ్ |
గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః ||

చిదోఘనాయ మహేశాయ వటమూలనివాసినే |
సచ్చిదానంద రూపాయ దక్షిణామూర్తయే నమః ||

ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే |
వ్యోమవద్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః ||

అంగుష్థతర్జనీయోగముద్రా వ్యాజేనయోగినామ్ |
శృత్యర్థం బ్రహ్మజీవైక్యం దర్శయన్యోగతా శివః ||

ఓం శాంతిః శాంతిః శాంతిః ||

విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం
పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథానిద్రయా |
యస్సాక్షాత్కురుతే ప్రభోధసమయే స్వాత్మానమే వాద్వయం
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 1 ||

బీజస్యాంతతి వాంకురో జగదితం ప్రాఙ్నర్వికల్పం పునః
మాయాకల్పిత దేశకాలకలనా వైచిత్ర్యచిత్రీకృతం |
మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవ యః స్వేచ్ఛయా
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 2 ||

యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే
సాక్షాత్తత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్ |
యస్సాక్షాత్కరణాద్భవేన్న పురనావృత్తిర్భవాంభోనిధౌ
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 3 ||

నానాచ్ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం
జ్ఞానం యస్య తు చక్షురాదికరణ ద్వారా బహిః స్పందతే |
జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్సమస్తం జగత్
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 4 ||

దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః
స్త్రీ బాలాంధ జడోపమాస్త్వహమితి భ్రాంతాభృశం వాదినః |
మాయాశక్తి విలాసకల్పిత మహావ్యామోహ సంహారిణే
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 5 ||

రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్
సన్మాత్రః కరణోప సంహరణతో యోఽభూత్సుషుప్తః పుమాన్ |
ప్రాగస్వాప్సమితి ప్రభోదసమయే యః ప్రత్యభిజ్ఞాయతే
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 6 ||

బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వవస్థాస్వపి
వ్యావృత్తా స్వను వర్తమాన మహమిత్యంతః స్ఫురంతం సదా |
స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 7 ||

విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామిసంబంధతః
శిష్యచార్యతయా తథైవ పితృ పుత్రాద్యాత్మనా భేదతః |
స్వప్నే జాగ్రతి వా య ఏష పురుషో మాయా పరిభ్రామితః
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 8 ||

భూరంభాంస్యనలోఽనిలోఽంబర మహర్నాథో హిమాంశుః పుమాన్
ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకమ్ |
నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్పరస్మాద్విభో
తస్మై గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 9 ||
సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్ స్తవే
తేనాస్వ శ్రవణాత్తదర్థ మననాద్ధ్యానాచ్చ సంకీర్తనాత్ |
సర్వాత్మత్వమహావిభూతి సహితం స్యాదీశ్వరత్వం స్వతః
సిద్ధ్యేత్తత్పునరష్టధా పరిణతం చైశ్వర్య మవ్యాహతమ్ || 10 ||

|| ఇతి శ్రీమచ్ఛంకరాచార్యవిరచితం దక్షిణాముర్తిస్తోత్రం సంపూర్ణమ్ ||

ఓం శ్రీ గురు దక్షిణామూర్తయే నమః🙏
(సేకరణ)

No comments: