Adsense

Tuesday, August 31, 2021

30 రకాల శివలింగములు



🌺సాధారణంగా మనకు తెలిసినవి - శిలా నిర్మితమైన లింగాలు మాత్రమే! అందులో కూడా నల్లరాతి శివలింగాలే అధికం.
కానీ మనకు తెలియని శివలింగాలు ఇంకా అనేకం ఉన్నాయి. అందులో 30 రకాల శివలింగాలు మరీ ముఖ్యమైనవి, అపూరూపమైనవి.🌺
🌺ఆయా లింగాలు ఇచ్చే ఫలితాలు అనంతం.
రకరకాల పదార్ధాలతో రూపొందించిన శివలింగాలు గురించి, పురాణాలు వివిధ సందర్బాలల్లో వర్ణించాయి.
ఏయే శివలింగాలను పూజిస్తే ఏయే ఫలితాలు
కలుగుతాయో చూద్దాం 🌺

🌺1) గంధ/చందన లింగం
2భాగాలు కస్తూరి, 4భాగాలు గంధం, 3భాగాలు కుంకుమను కలిపి ఈ లింగాన్ని చేస్తారు. దీనిని
పూజిస్తే శివ సాయిజ్యం లభిస్తుంది.

🌺2) నవనీత లింగం
వెన్నతో చేసిన ఈ లింగాన్ని పూజిస్తే కీర్తి,సౌభాగ్యాలు కలుగుతాయి.

🌺3) పుష్పలింగం
నానావిధ సుగంధ పుష్పాలతో దీనిని నిర్మిస్తారు. దీనిని పూజిస్తే రాజ్యాధిపత్యం కలుగుతుంది.

🌺4) రజోమయ లింగం
పుప్పొడితో నిర్మించిన ఈ లింగాన్ని పూజించడం వల్ల విద్యాథరత్వం సిద్ధిస్తుంది. శివ సాయిజ్యాన్ని పొందగలరు.

🌺5) ధ్యాన లింగం
యవలు, గోధుమలు, వరిపిండితో ఈ లింగాన్ని
నిర్మిస్తారు. దీనిని పూజించడం వల్ల సంపదల వృద్ధి, సంతానం కలుగుతుంది.

🌺6) తిలపిష్ఠ లింగం
నువ్వుల పిండితో చేసిన ఈ లింగాన్ని పూజిస్తే ఇష్టసిద్ది కలుగుతుంది.

🌺7) లవణ లింగం
హరిదళం, త్రికటుకము, ఉప్పు కలిపి చేసిన ఈ లింగాన్ని పూజిస్తే వశీకరణ శక్తి.

🌺8 కర్పూరాజ లింగం 
ముక్తి ప్రదమైనది.

🌺9) భస్మమయ లింగం
భస్మముతో తయారు చేస్తారు. సర్వసిద్ధులను
కలుగచేస్తుంది.

🌺10) శర్కరామయ లింగం
సుఖప్రదం.

🌺11) సద్భోర్ఖ లింగం
ప్రీతికరని కలిగిస్తుంది.

🌺12) పాలరాతి లింగం
ఆరోగ్యదాయకం.

🌺13) వంకాకురమయ లింగం
వంశవృద్ధిని కలిగిస్తుంది, దీనిని వెదురు మొలకలతో తయారు చేస్తారు.

🌺14) కేశాస్థి లింగం
వెంట్రుకలు, ఎముకలతో తయారు చేస్తారు. ఇది శత్రునాశనం చేస్తుంది.

🌺15) పిష్టమయ లింగం
ఇది పిండితో తయారు చేయబడుతుంది. ఇది విద్యలను ప్రసాదిస్తుంది.

🌺16) దధిదుగ్ధ లింగం 
కీర్తి,ప్రతిష్టలను కలిగిస్తుంది.

🌺17) ఫలోళ్ల లింగం
ఫలప్రదమైనది.

🌺18) రాత్రి ఘజాత లింగం
ముక్తి ప్రదం.

🌺19) గోమయ లింగం
కపిల గోవు పేడతో ఈ లింగాన్ని తయారు చేస్తారు. దీనిని పూజిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. భూమిపై పడి మట్టి
కలిసిన పేడ పనికిరాదు.

🌺20) దూర్వాకాండజ లింగం
గరికతో తయారు చేయబడు ఈ లింగం అపమృత్యుభయాన్ని తొలగిస్తుంది.

🌺21) వైడూర్య లింగం
శత్రునాశనం, దృష్టి దోషహరం.

🌺22) ముక్త లింగం 
ముత్యంతో తయారు చేయబడిన ఈ లింగం ఇష్ట సిద్ధిని కలిగిస్తుంది.

🌺23) సువర్ణ నిర్మిత లింగం
బంగారంతో చేసిన ఈ లింగం ముక్తిని కలిగిస్తుంది.

🌺24) ఇత్తడి - కంచు లింగం
ముక్తిని ప్రసాదిస్తుంది.

🌺25) రజత లింగం
సంపదలను కలిగిస్తుంది.

🌺26) ఇనుము - సీసపు లింగం
శత్రునాశనం చేస్తుంది.

🌺27) అష్టధాతు లింగం
చర్మరోగాలను నివారిస్తుంది. సర్వసిద్ధి ప్రదం.

🌺28) స్ఫటిక లింగం
సర్వసిద్ధికరం, అనుకున్న కార్యాలను సఫలీకృతం చేస్తుంది.

🌺29) తుష్టో లింగం
మారణ క్రియకు పూజిస్తారు.

🌺30) సీతాఖండ లింగం
పటిక బెల్లంతో తయారు చేసింది. ఆరోగ్యసిద్ధి కలుగుతుంది🌺

No comments: