Adsense

Tuesday, August 31, 2021

మధుర- బృందావనం


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన ప్రదేశంగా ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని మధురకు ప్రత్యేక గుర్తింపు ఉంది.

మథుర మరియు బృందావనం అనగానే శ్రీకృష్ణుడు, గోపికలు గుర్తుకు వస్తారు.

 బాల్యంలో యశోదా తనయుడు ప్రదర్శిం చిన లీలలెన్నో మదిలో మెదలుతాయి. ఇక్కడి సందర్శనీయ ప్రాంతాలెన్నో ఆనాటి కృష్ణలీలలతో ముడిపడినవే.

 గోపికావస్త్రాపహరణం, రాసలీల తదితరాలన్నీ ఇక్కడో చోటు చేసుకున్నట్లు భక్తులు భావిస్తుంటారు. 

సందర్శిం చేందుకు ఎన్నో ఆలయాలు కూడా ఉన్నాయి. దగ్గర్లోనే మరెన్నో చారిత్రక, పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉన్న స్థలాలు కూడా ఉన్నాయి. ఉత్తర భారతదేశ యాత్రలో తప్పని సరిగా దర్శించాల్సిన పుణ్యక్షేత్రం మథుర, బృందావనం .

కృష్ణుని జన్మస్థలం.

మథుర భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న హిందూ పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇది దాదాపు ఆగ్రాకు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది బృందావన్‌కు 12 కి.మీ. దూరంలో వుంది. ఇది కృష్ణుని జన్మస్థలం. దేవకి, వసుదేవులకు జన్మించాడు. శ్రీకృష్ణుడు చెరసాలలో పుట్టాడు. ఇప్పుడు ఆ చెరసాలను శ్రీ కృష్ణ జన్మభూమి అంటారు. ఇది మధుర కాంప్లెక్స్‌లో వుంది. ఈ గుడిని శ్రీకృష్ణునికి అంకితం చేశారు. ఇది మధుర పద్ధతిలో నిర్మించిన సాంస్కృతిక  భవంతి.

 ఇక్కడి కేశవ్‌దేవ్‌ దేవాలయం హిందువులకు అత్యంత పవిత్రం. ఈ దేవాలయాన్ని శ్రీకృష్ణుడి మునిమనుమడైన వజ్రనాభుడు దాదాపు ఐదువేల సంవత్సరాల కిందట నిర్మించాడని స్థలపురాణం. ఈ దేవాలయంలో జన్మాష్టమితోపాటు వసంత పంచమి, మహాశివరాత్రి, గోపాష్టమి, దీపావళి మొదలైన పండుగలను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.
 
చూడదగిన ప్రదేశాలు

శ్రీకృష్ణ జన్మభూమి దేవాలయం, గర్భ గుహ, భాగవత భవన్‌తోపాటు కృష్ణుడు బాల్యంలో నడయాడిన గోకులం, బృందావనం వంటి ప్రదేశాలు కూడా మధుర జిల్లాలోనే ఉన్నాయి. మధుర నుంచి బృందావనం 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ గోవిందదేవ్‌, మీరాబాయి, మదనమోహన దేవాలయాలు ప్రసిద్ధి పొందినవి. బృందావనానికి సమీపంలోనే గోవర్ధన పర్వతం ఉంది. 

నేటికీ దీపావళి పండుగ తరవాత రోజున గోవర్ధన పూజ నిర్వహించడం ఆనవాయితీ. గోవర్ధన గిరిని చిటికెన వేలుపై ఏడు రోజులు ఎత్తి పట్టుకొన్న శ్రీకృష్ణుడు, ఈ రోజునే ఇంద్రుడి గర్వభంగం చేశాడని చెబుతారు. ఈ పర్వతాన్ని స్థానికులు కృష్ణుడి ప్రతిరూపంగా కొలుస్తారు.

 మధుర నుంచి గోకులం 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. వీటితోపాటు మొఘలుల కాలంనాటి జామా మసీదు, కుసుమ సరోవరం, రాధా కుండ్‌, మధుర మ్యూజియం సందర్శనీయ స్థలాలు..సేకరణ...🚩🌞🙏🌹🎻

 🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

No comments: