🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
శ్రావణమాసం లో ప్రతిరోజూ పవిత్రమే గానీ, మంగళ, శుక్రవారాలంటే మరింత పవిత్రమని భావిస్తారు మహిళలు. జగన్మాతలైన ఉమ, రమలిద్దరికీ ఇష్టకరమైనదీ మాసం. కాబట్టి వారి పతులైన శివకేశవులకు కూడా ప్రీతికరమైనదే.
అందులో విష్ణువు జన్మనక్షత్రమైన శ్రవణా నక్షత్రం పేరుతో వచ్చే ఈ మాసమంటే ఆది కేశవునికి మరీ ఇష్టం. అందుకే ఈ మాసం వైష్ణవాలయాలు విశేషమైన పూజలతో అలరారుతుంటాయి.
ఈ మాసమంతా శివకేశవులిద్దరికీ అభిషేకం జరిపిస్తే జన్మజన్మల పాపాలు హరించుకుపోతాయి. అంతేకాదు, గ్రహపీడల నుంచీ కూడా ఉపశమనం కలుగుతుంది. సర్వసంపదలకు లక్ష్మీదేవి ఆవాసమైతే, ఐదోతనానికీ, సౌభాగ్యానికి ఆవాసం పార్వతీదేవి. ఈ ఇద్దరి కరుణాకటాక్షాలు సమృద్ధ్ధిగా తమ జీవితాలపై సుస్థిరంగా ఉండేలా చెయ్యమని వివాహితలందరూ ఆదిపరాశక్తులైన ఆ జగన్మాతలను భక్తిశ్రద్ధలతో పూజించే వారాలే పవిత్రమైన మంగళ, శుక్రవారాలు.
పూర్వం కృతయుగంలో దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం క్షీరసాగరమధనం చేసే సమయాన. అమృతానికి ముందు అగ్నిజ్వాలలు కక్కుతూ కాలకూట విషయం పుట్టుకొచ్చింది. దానిని చూసి భయకంపితులైన దేవదానవులు పరమేశ్వరుని శరణుకోరారు. ఆ సమయాన పరమేశ్వరుడు మందహాసముతో చిరునవ్వు నవ్వి.. ఇప్పుడు నేనేమి చెయ్యను? అన్నట్లు పార్వతి వైపు చూచాడు.
ఆ సర్వమంగళ స్వరూపిణియై జగన్మాత, భర్తచూపులోని ఆంతర్యమేమిటో గ్రహించింది. దేవతులైనా, దానవులైనా, మానవులైనా, మనభక్తులే కదా! మన బిడ్డలకు ఆపద కలిగినప్పుడు మనము కాక వేరెవరు రక్షిస్తారు? అని భావించి నిరంతరం స్త్రీల సౌభాగ్య సంపదను కాపాడే ఆ సర్వమంగళ స్వరూపిణి తన మాంగల్య సౌభాగ్యముపై ప్రగాఢ విశ్వాసముంచి, లోకవినాశానికి కారణభూతమైన ఆ భయంకర కాలకూట విషాన్ని తన భర్త మింగేందుకు అనుమతి ఇచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. అట్టి కరుణాంతరమూర్తి పార్వతీదేవి.
అట్టి సర్వమంగళ స్వరపిణి అయిన భవానీ మాతను కొత్తగా పెళ్లైన స్త్రీలు శ్రావణమాసం తొలిమంగళవారంతో మంగళగౌరీ వ్రతాన్ని విధిగా ప్రారంభించి ఐదు సంవత్సరాలు దీక్షగా ఆచరించాలి. అలా ఈ వ్రతాన్ని చేపట్టిన స్త్రీలపై శ్రీ మంగళగౌరి కటాక్షముతో వైధవ్యబాధలు లేకుండా వారీ జీవితాంతం సర్వసౌఖ్యములతో గడుపుతారని ప్రతీతి.
పార్వతిదేవికి మరో పేరు మంగళ గౌరి. శ్రావణ మాసంలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళగౌరి అయిన పార్వతీదేవిని పూజించాలి. మంగళ గౌరీ ఎక్కడ ఉంటుందో తెలుసా … పసువు , కుంకుమ , పూలు , సగుంధాది మంళ ద్రవ్యాలలోను , ఆవు నేతితో ప్రకాశించే జ్యోతిలోనూ కొలువై ఉంటుంది .
పూజావిధానం :
ఒక శుభ్రమైన పీటను పసుపు కుంకుములతో అలంకరించి, దాని పైన ఒక ఎండు కొబ్బరి చిప్పలో పసుపుతో చేసిన గౌరీదేవిని అలంకరించాలి. పసుపు వినాయకుడిని కూడా అలంకరించాలి. ముందుగా వినాయక పూజ చేయాలి. కలశంప్రతిష్ఠించే సంప్రదాయం ఉన్నవారు కలశాన్ని పెట్టి, కలశ పూజగావించాలి. ముందుగా వినాయకుడికి నైవేద్యం సమర్పించాక, మంగళ గౌరి లేక ఫణి గౌరి దేవి అష్టోత్తరం చదివి, అమ్మవారి ముందు 5 ముడులు, 5 పొరలు కలిగిన, 5 తోరాలు, 5 పిండి దీపారాధనలు (బియ్యం పిండి, బెల్లం మిశ్రమంతో చేసిన దీపాలు) పెట్టి పూజించాలి.
పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టి, హారతి ఇచ్చి, అమ్మవారి దగ్గర పూజ లో పెట్టిన ఒక తోరం చేతికి కట్టుకోవాలి. పిండి దీపారాధనలు కూడా….ఒకటి అమ్మవారికి, ఒకటి మనకి (పూజ చేసినవారు), మిగిలిన 3 ముత్తయిదువలకు తాంబూలంతో పాటు ఇవ్వాలి. వ్రతం చేసుకున్న మరు నాడు కూడా అమ్మవారికి హారతి ఇచ్చి, నైవేద్యం పెట్టాలి...🚩🌞🙏🌹🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
🎻🌹🙏*మంగళ గౌరీ - వాయనము*
( మొదటి మంగళ వారం )
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
*శ్రీ* ముఖీ! వరదాయీ,
*ని* ర్మల తేజోమయీ, కరుణా
*వా* స మయీ,
*స* కల శ్రేయోదాయీ, స
*మూ* లాగ్ర దానమయీ, కీ
*ర్తి* కలిగిన రక్షణ మయీ, ఓ
*శ్రావణ మంగళ గౌరీ*!
చక్కని పసిడి వర్ణంతో, తల నిండా పూ మాలలతో,
కరముల నిండా గాజులు సవ్వడులతో
నుదిట సింధూర తిలకం మెరయగా,
వన రంగు పట్టు చీరతో, ఏడు వారాల నగలు ధరించి,
కలహంసలా వెండి రెక్కలు తొడుక్కోని
మా చెంత చేరుటకు
జాలి గుండెల హృదయంతో
అంతరంగాల దీప్తి కాంతులతో *ఓ జననీ*!
తీవ్ర సూర్యకిరణములు శిరోభిషేకాలు చేయకమునుపే...
అపరాహ్నము కాక మునుపే....
*" నీ రక్షణలు*
*మా మనస్సులు "*
*ఒకరి కొకరం ఇచ్చుకునే వాయనంబులకు*
శ్రీఘ్ర గతిలో రావమ్మా *ఓ పెద్ద ముత్తైదువా*...
పసుపు గుమ్మాలతో
మామిడి ఆకుల తోరణములతో రంగవళ్ళులతో
మా మనస్సు, గృహములు *మూర్తి* భ వింప చేసామమ్మా... నీవు సంతసించునటుల.
*స్వాగతము స్వాగతము ఓ నిత్య సుమంగళీ మంగళ గౌరీదేవి* 🚩🌞🙏🌹🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
No comments:
Post a Comment