Adsense

Tuesday, August 10, 2021

మాంగళ్యాన్ని కాపాడే మంగళగౌరీ వ్రతం..


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

   మంగళగౌరీ వ్రతం అమంగళం దరిచేరకుండా రక్షిస్తుంది. స్త్రీలు తమ ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే మాంగళ్యాన్ని కాపాడుతూ ఉంటుంది. అందుకే శ్రావణమాసపు మంగళవారాల్లో గౌరీదేవిని శక్తిమేర పూజిస్తుంటారు .. భక్తిమేర తరిస్తుంటారు. సహజంగానే స్త్రీలు అమ్మవారిని పూజించడం జరుగుతూ వున్నా, శ్రావణ మంగళవారాల్లో గౌరీదేవిని వ్రత విధానం ద్వారా కొలవడం వలన అమ్మవారి అనుగ్రహం త్వరగా కలుగుతుంది.

ఒకానొక సందర్భంలో .. స్త్రీలు తమ మాంగళ్యం కలకాలం నిలిచి ఉండటానికి ఏంచేస్తే బాగుంటుందని 'ద్రౌపది' అడిగితే, అందుకు మంగళ గౌరీ వ్రతానికి మించిన మార్గం లేదని శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా ఆధ్యాత్మిక గ్రంధాల్లో కనిపిస్తుంది. ఈ వ్రతాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో .. వివాహమైన తరువాత వచ్చే శ్రావణమాసం నుంచి మొదలు పెట్టి, అయిదు సంవత్సరాల పాటు ఆచరించి ఆ తరువాత ఉద్యాపన చేయవలసి ఉంటుంది.

అమ్మవారి పూజలో గరిక .. ఉత్తరేణి దళాలు ఉపయోగించడం మరింత శ్రేష్ఠమని చెప్పబడుతోంది. వ్రతం ఆచరించిన తరువాత ముత్తయిదువులకు నానబెట్టిన శెనగలు వాయనంగా ఇవ్వాలి. ఇలా ముత్తయిదువులను ఆహ్వానించి.. 
ఆప్యాయంగా ఆదరించి.. 
వాళ్ల పాదాలకి పసుపురాసి.. 
కుంకుమ బొట్టు పెట్టి.. 
శ్రద్ధగా వాయనాలు సమర్పించడం వలన అమ్మవారు సంతోష పడుతుంది, సంతృప్తి చెందుతుంది. 
తన భక్తుల అయిదవతనాన్ని కాపాడే బాధ్యతను తాను తీసుకుని, వారికి సుఖశాంతులను ప్రసాదిస్తుంది....🚩🌞🙏🌹

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

No comments: