Adsense

Tuesday, August 3, 2021

శ్రీ రామకోటి వ్రాయువారు గమనించవలసిన విషయములు Things to note by Sri Ramakoti writers

శ్రీ రామకోటి వ్రాయువారు గమనించవలసిన విషయములు 👇
🚩భోజనమునకు ముందుగాని , వెనుకగాని , పగలుగాని , రాత్రిగాని , సర్వకాల సర్వావస్తల యందు విరామము దొరికినప్పుడంతయు వ్రాయవచ్చును. 
🚩వ్రాయునప్పుడు దిక్కులు చూడరాదు , మాటలాడరాదు , మనస్సు విడనాడరాదు , త్రికరణశుద్ధి కావలెను దానికి మించిన శుద్ధిలేదు.
🚩ఒకసారి (శ్రీరామ) అని వ్రాయుటతోపాటు మూడుసార్లు (శ్రీరామ శ్రీరామ శ్రీరామయనిగాని లేక శ్రీరామరామ) అని మరియెకసారి గాని యుచ్చరించవలెను. 
🚩బహు ఉత్సాహముతోను , సంతోషముతోను భక్తి శ్రద్ధలతోనూ వ్రాయవలెను. 
🚩వ్రాసిన యక్షరములు రమ్యములై చూచువారలకు సంతోషము కలిగించునట్లు ఉండవలెనుగాని చిరాకుగా నుండకూడదు.విడివిడిగా వ్రాయవలెను.
🚩శ్రద్ధయే కొనియాడదగినదిగాని , సంభ్యోధికము కాదు. 
🚩నిష్కామబుద్ధితో ఇది భగవత్సేవయసు తలంపుతో శ్రీరామకోటి వ్రాయువారు నిశ్చలబుద్ధితో నమస్కారమునకు మించి చేయవలసిన శాంతి ఏదియు లేదు.భగవంతుడు నమస్కార ప్రియుడు.
🚩శక్తిగలవారు ఒకరిద్దరు సత్పాత్రులు కన్నదానము చేయవలెను. 
🚩ఒక్కొక్క సంపుటము పూర్తికాగానే దానిని దేవుని పూజా మందిరమున దేవుని పూజించునట్లు పూజించవలయును. 
🚩నిరసనగా విడువరాదు ఆచార సంపన్నులైన శీలవంతులగు ముత్తైదువులు తులసీ శుక్రవార లక్ష్మీపూజలతో పాటు ఈ పుస్తకములను పూజించుకొనవచ్చును.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

No comments: