Adsense

Tuesday, August 3, 2021

🔱♦️నరసింహస్వామి మండల దీక్ష♦️🔱 Initiation of Narasimhaswamy Mandal

నరసింహస్వామి మండల దీక్ష
ఈ  కలియుగంలో ఎన్నో ఆపదలనుండి ప్రమాధాల నుండి శత్రువుల నుండి రక్షించే స్వామి నరసింహ స్వామి కోరిన కోరికలు త్వరగా అనుగ్రహించే స్వామి నరసింహ స్వామి భక్తుల యొక్క శత్రువులను తన పంజాతో తరిమికొట్టే స్వామి నరసింహ స్వామి.. ఈ స్వామి కి పెట్టే తొలి నమస్కారం "ప్రహ్లాదవరదా నమో నమః " అని పెట్టాలి.

♦️ఈ మండల దీక్ష ఎవరు ధేనికోసం చేయాలి♦️

1. వివాహం కోసం , వివాహం అయి కూడా సఖ్యత లేక విడిపోయిన వారు, అనుమానాలతో దూరం అయిన వాళ్ళు తిరిగి కలుసుకోవడం కోసం చేయాలి.

2. సంతానం కోసం చేయాలి, సంతానం ఉన్నా వారికి ఏదైనా సమస్య ఉంటే వారికోసం చేయాలి.

3.ఏ ఉపాధి లేని వారు ఏ ఆర్ధిక ఆదాయం లేని వారు, వ్యాపార వృద్ధి లేని వారు, మంచి అవకాశాలు ఏదైనా రంగంలో కావాలి అని కోరుకునే వారు.. కొత్త  వ్యాపారస్తులు వీరంతా ఈ మండల దీక్ష చేయాలి.

4. ముఖ్యంగా ఇది శత్రు సంహారం కోసం సంహారం అంటే మన పైన ఉన్న పగని ద్వేషాన్ని దూరం చేస్తారు. అకాల మృత్యువు రాదు గండాలు తొలగి పోతుంది. మీపైన పగతో సాదిస్తున్న వారి వేధింపులు శాశ్వతంగా తొలగిపోతాయి.. వ్యాపారం లో శత్రువులు ఆటంకాలు తొలగిపోతాయి..

5. ఎంతకీ తీరని అప్పులతో బాధ పడే వారు ఈ మూల మంత్రాన్ని నిరంతరం మనసులో జపించు కుంటూ ఉంటే అప్పులు తీర్చే మార్గాన్ని స్వామి అనుగ్రహిస్తారు.

♦️ఏ రోజు చేయాలి♦️

నరసింహ స్వామి అవతరించిన తిది శుక్లపక్ష చతుర్థి, స్వాతి నక్షత్రం రోజున.. సూర్యాస్తమయం లో అవతరించారు..నరసింహ స్వామి ఉపాసన మొదలు పెట్టాలి అనుకునే వారు, శుక్లపక్ష చతుర్దశి నాడు కానీ లేక శుక్లపక్షo లో స్వాతి నక్షత్రం రోజున మొదలుపెట్టవచ్చు..అలాగే మంగళవారం , బుధవారం, ఆదివారం రోజున కూడా ఈ ఉపాసన మొదలు పెట్టవచ్చు..41 రోజులు చేయలేని వారు మంగళవారం, బుధవారం, ఆదివారం చేయాలి. అనారోగ్యంతో అది కూడా చేయలేని వారు మూలమంత్రం నిరంతరం మనసులో జపించు కోవాలి. 41 రోజులు మణ్డల దీక్ష చేసే వారికి అమోఘమైన ఫలితం స్వామి అనుగ్రహ దొరుకుతుంది.

♦️నియమాలు : ♦️
41 రోజు లు రోజూ తల స్నానం అవసరం లేదు.. చేసిన పర్వాలేదు, పసుపు రంగు వస్త్రాలు శుభం కుదరని వాళ్ళు శుభ్రంగా ఉతికినవి ధరించాలి, ఈ 41 దినములు తులసి మాలను కంఠంలో ధరించాలి.శాకాహారం భుజించాలి , నెలపైన చాప వేసుకొని నిద్రించాలి, బ్రహ్మచర్యం పాటించాలి.. ఉదయం పూజ ఐయ్యాక అల్పాహారం రాత్రి పూజ అయ్యాక అల్పాహారం తీసుకోవాలి మధ్యాహ్నం రెండు లోపల భోజనం చేయాలి.అసత్యం పలక కూడదు.. గొడవలు పడకూడదు..పూజ అయ్యాక కూడా మంత్రం మనసులో జపిస్తూనే ఉండాలి..41 రోజులు పూర్తి అయ్యాక కూడా ఈ మంత్రం రోజు 9 సార్లు కానీ 21 సార్లు కానీ రోజూ జపించుకుంటూ ఉంటే స్వామి దయ ఎల్లప్పుడూ ఉంటుంది. 108 సార్లు రోజూ చేయడం మంచిది

♦️పూజా విధానం:♦️

 నరసింహ స్వామి ఫోటో పెట్టుకుని పూజ చేసే వాళ్ళు రోజూ ఫోటోని శుభ్రం చేసి గంధం ,కుంకుమ. పెట్టి అలంకరించాలి,41 రోజులు పసుపు రంగు పువ్వులను వాడటం మంచిది దొరకని పక్షంలో మీ సౌకర్యం ఏదైనా వాడుకోవచ్చు కానీ పసుపు రంగు ఉన్న పూలు కార్యసిద్ధికి ఉపయోగ పడుతుంది.

 ఇక విగ్రహం ఉన్న వాళ్ళు ఈ విధంగా చేయాలి.  అఘోరా నరసింహ ఉపాసన చేసే వారు స్వామి వారు ఒక్కరే ఉన్న విగ్రహం పెట్టుకోవచ్చు.. అలా కాకుండా సర్వ కార్యసిద్ధి కోసం చేసే వాళ్ళు లక్ష్మీ నరసింహ విగ్రహం చాలా చిన్న పరిమితిలో రెండు అంగుళాలు మించకుండా పెట్టుకోవాలి.. నరసింహ స్వామి ని తలుచుకుంటూ స్వామి కి మొదట పాలతో అభిషేకం చేసాక తర్వాత నీరు పోయాలి, తర్వాత బెల్లం పానకం తో అభిషేకం చేయాలి మళ్ళీ నీరు పోయాలు, చివరిగా పసుపునీటితో అభిషేకం చేసి నీటితో శుభ్రంగా కడిగి గంధం కుంకుమ పువ్వులతో అలంకారం చేయాలి. ఒక చిన్న పీఠ లాంటి ఎత్తుగా ఉన్న దానిపైన చిన్న వస్త్రం వేసి స్వామి వారిని పెట్టాలి..

♦️నైవేద్యం : ♦️

స్వామి వారికి ఇష్టమైనది పానకం రోజూ పెట్టాలి   అలాగే నాన బెట్టిన పెసులు(వడపప్పు) పెట్టాలి..వీటితో పాటు మీ సౌకర్యం ఉన్న వరకు పండ్లు ప్రసాదం పెట్టుకోవచ్చు... ప్రతి మంగళవారం పులిహోర నివేదించాలి..ప్రతి ఆదివారం కొబ్బరికాయ నైవేద్యం ఉండాలి , రోజూ కొబ్బరికాయ కొట్టే పని లేదు..ఆదివారాలు మటుకు పానకం వడపప్పు తో పాటు కొబ్బరికాయ కూడా పెట్టాలి. తులసి చాలా ప్రధానం. ఈ తులసి ప్రసాదంలోను అలంకారం లో కూడా వాడాలి.. పానకంలో కొద్దిగా మిర్యాల పొడి కచ్చితంగా వేయాలి ఎందుకంటే ఇది రుచి కోసమే కాదు మీకు ఉన్న ఆటంకాలు తొలగడం కోసం మిర్యాల పొడిని ప్రసాదంలో ఉపయోగించి స్వీకరించాలి.

♦️పూజ♦️ :

 దీపాలు పెట్టి ఆగరబత్తులు ధూపం వేయాలి ఈ 41 రోజులు రోజూ సాయంత్రం సూర్యాస్తమయం లో సాంబ్రాణి ఇల్లంతా ధూపం వేయాలి.
 వినాయకుడికి ముందుగా నమస్కారం చేసి 21 సార్లు "  వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభా
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా....
" ఈ మంత్రాన్ని జపించి బెల్లం ముక్క నివేదించి మీ పూజ నిర్విఘ్నంగా జరగాలి అని కోరుకోవాలి.
నిత్యపూజలో సంకల్పము ఇక్కడ చెప్పుకోండి తిది వరాన్ని అనుసరించి ఆ రోజు ప్రకారం మీ నామ గోత్రాలతో సంకల్పమ్ చెప్పుకోండి.
సంకల్పమ్ లో మీ కోరిక ఏంటో  నరసింహ స్వామికి చెప్పుకుని అష్టోత్తరం చదివి మీరు సిద్ధం చేసుకున్న నైవేద్యం పెట్టి హారతి ఇవ్వాలి..తర్వాత స్వామి వారి అనుగ్రహము కోసం సర్వకార్యసిద్ది కోసం మీ సంకల్పమ్ నెరవేర్చమని కోరుకొని ఈ మంత్రాన్ని జపం 108 కానీ 1008 సార్లు కానీ జపం చేయాలి..ఈ జప మంత్రం ఉదయం సాయంత్రం రెండు వేళలా చేయాలి.

ఈ మూల మంత్రం అమృత గడియల్లో జపించడం చాలా విశేషం కుదరని వాళ్ళు సూర్యోదయానికి ,సూర్యాస్తమయం లో జపించాలి మంత్రం త్వరగా సిద్ధిస్తుంది.

🔱♦️నరసింహ స్వామి మూల మంత్రం " ఓం ణ్రం ణ్రం ణ్రం నరసింహాయ నమ​:"♦️🔱

🙏తులసి మలతో కానీ స్పటిక మాలతో కానీ ఈ జపం చేయాలి.. 🙏

 🕉️ ఇంకా ఈ ఈ మంత్రాలతో కూడా జపం చేయవచ్చు

🔺ఉగ్రం వీరం మహా విష్ణుం జ్వలంతం సర్వతోముఖం
నృసింహం భీషణం భద్రం మృత్యోర్ మృత్యుర్
నమామ్యహమ్.

💐41 రోజులు పూజ పూర్తి అయ్యాక ఒక పంతులుగారిని కానీ లేదా ఎవరైనా పెద్ద వయసు ఉన్నవారిని ఆహ్వానించి అతన్ని నరసింహ స్వామి గా భావించి భోజనం పెట్టి అతనికి తాంభూలం సమర్పించండి మీకు కుదిరితే పంచ కండువా , దక్షణ తాంభూలం ఇవ్వండి.. అక్షంతలు వేయించు కోండి.. తండ్రి , పిల్లను ఇచ్చిన మామగారు, లేదా పెద్ద అన్నయ్య వీరిలో ఎవరికైనా కూడా ఈ తాంబులం సమర్పించి ఆశీర్వాదం తీసుకోవచ్చు.. 

ఈ పూజ ఆడవాళ్ల మగవాళ్ళు ఎవ్వరైనా చేయవచ్చు దంపతులు కలిసి చేసుకోవచ్చు.. తాంభూలం కి దంపతులను లక్ష్మీ నరసింహులుగా ఆహ్వానించి..వారికే సమర్పించి నట్టు మనస్ఫూర్తిగా అక్కడ స్వామినే చూడాలి...అప్పుడు వారి రూపంలో మీకు నరసింహ స్వామి స్వీకరిస్తారు.. తాంబులం కి భార్య తో సహా ఫిలిస్తే ఆమెకు ఒక జాకెట్ ముక్క తాంబులం లో ఇవ్వండి. ఇది ఆచరించిన వారికి జీవితంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా స్వామి రక్షిస్తారు , ఆటుపోట్లు చిన్న చిన్న సమస్యలు లేని జీవితం ఉండదు ఎటువంటి పరిస్థితి ని అయినా దాటగల శక్తిని అనుగ్రహిస్తారు.. దిక్కుతోచని పరిస్థితి అంటూ ఉండదు.

🙏♦️నరసింహ స్వామి అపార కరుణా మూర్తి ఒక బాలున్ని రక్షించడం కోసం వచ్చిన అవతారం "

🔱🙏"శరణం శరణం నృసింహ శరణం ,ప్రహ్లాద వరదా శరణం, లక్ష్మీ నృసింహ శరణం" అంటూ హారతి ఇచ్చి మీరు పెట్టిన పానకం తీర్థం గా స్వీకరించి వడపప్పు ప్రసాదం తినాలి.. 🙏🔱

🙏నమ్మకంతో ఈ దీక్ష ఆచరించే వారికి శ్రీ లక్ష్మీ నరసింహ అనుగ్రహ సిద్దిరస్తు. 🙏

No comments: