Adsense

Tuesday, August 17, 2021

అయ్యప్పస్వామి ధీక్షలో భోజన నియమాలు.

 
👉 ఉదయము ఫలహారమును తగు మాత్రంగా తీసుకోవాలి. 

👉 మధ్యాహ్నం 12 గంటలకు భోజనం చేయడం ఉత్తమం మధ్యాహ్నం 1 గంటకు భోజనం చేయడం మధ్యమం. 
మధ్యాహ్నం 2 గంటలకు భోజనం చేయడం అధమం. 
రెండు గంటలకు భోజనం చేయడం వలన శరీరంలో జఠరాగ్ని మందముగ యుండి వాతమును ప్రకోపింప చేసి రోగములకు కారణమగును

👉 భోజనంలో 50% ఆహారం , 25% నీరు (సేవించిన పిదప ఉదరంలో) 25% ఖాళీగా ఉండునట్లు శ్రద్ధ తీసుకోవలెను. 

👉 భోజనం చేసే పద్ధతి వడ్డన పూర్తయిన తరువాత అన్నం సంస్కరించబడడం కోసం అన్నంపై కొద్దిగా నేతిని వేస్తారు. 
నేతిని వడ్డించిన తరువాత స్వల్పంగా నేయ్యి కలిగిన అన్నమును ప్రాణాహుతిగా సేవించిన యెడల శ్రోతో మార్గము (జలము కలిగినట్టి నాలుక మీదుగా కంఠము వరకు గల మార్గము శ్రోతో మార్గము)శుద్ధి గావించబడుతుంది ఆ తరువాత పప్పుగారెలు , బూరెలు మొదలగు గురుస్నిగ్ధ గుణములు కలిగిన ఘన పదార్ధములను ముందుగా భుజించవలెను. 

👉 ఆ తరువాత కూరలు , పులుపు మొదలైన *"పైత్యహర"* ద్రవ్యములను భుజించాలి.

👉 చివరిగా పాలు పెరుగులకు సంబంధించిన వాటిని భుజించవలెను.

👉 దీక్షాకాలంలో మసాలా దినుసులు కలిగిన పదార్థాలను విడిచి పెట్టుట అలవాటు చేసుకోవాలి. 

👉సాత్త్వికములైన ఆహారాన్ని (ఉప్పు , కారాలు తక్కువగా ఉండి , పక్వమైన , శుద్ధమైన సాత్త్విక ఆహారాన్ని ) భుజించవలెను. 

👉 భోజనానికి ముందు , భోజనానంతరం కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.

👉 ఆహార నియమాలు లేనట్టి దీక్ష దీక్షేకాదని , ఆహార నిబంధనలు పాటించకపోతే దీక్షఫలవంతం  అవ్వదని దీక్షధర్మాలు చెబుతున్నాయి.

No comments: