Adsense

Tuesday, August 3, 2021

ఏ రోజున ఏ దేవుడు పూజ చేయాలి



వారానికి ఏడు రోజులు. అయితే ప్రతీ రోజుకీ ఓ ప్రత్యేకత ఉంది. పంచాంగం ప్రకారం ప్రతీ రోజుకీ ఓ దేవుడు అధిపతిగా ఉంటాడు. ఆ రోజున ఆ దేవుడికి పూజ చేసుకుంటే కార్యసిద్ధి చేకూరుతుంది. దైవానుగ్రహం లభిస్తుంది. 

వారానికి ఏడు రోజులు. అయితే ప్రతీ రోజుకీ ఓ ప్రత్యేకత ఉంది. పంచాంగం ప్రకారం ప్రతీ రోజుకీ ఓ దేవుడు అధిపతిగా ఉంటాడు. ఆ రోజున ఆ దేవుడికి పూజ చేసుకుంటే కార్యసిద్ధి చేకూరుతుంది. దైవానుగ్రహం లభిస్తుంది. ఏయే రోజున ఏ దేవుడికి పూజ చేయాలో చూద్దాం.. 

ఆదివారం పూట నవగ్రహాల్లో అగ్రజుడైన సూర్య భగవానుడిని స్మరించుకోవాలి. సూర్య దోషం ఉన్నవారు ఈ రోజున వ్రతమాచరించి సూర్యుడిని ప్రార్థిస్తే దోషాలు తొలగిపోతాయని పండితులు అంటున్నారు.

సోమవారం శివునికి విశిష్టమైన రోజు. ఆ రోజున నీలకంఠేశ్వరుడిని పూజించాలి. శివునికి సోమవారం పూట పాలు, బియ్యం, పంచదారతో చేసిన ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పించి.. పూజ చేయడం ద్వారా సర్వేశ్వరుడి అనుగ్రహం పొందవచ్చు.

మంగళవారం పూట హనుమంతుడిని పూజించాలి. దుర్గాదేవిని కూడా పూజించవచ్చు. మంగళవారం పూట వ్రతమాచరించి రాహుకాలంలో దుర్గాదేవికి నిమ్మకాయతో దీపం వెలిగించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయం పూర్తవుతాయి. 

బుధవారం పూట వినాయకుడిని పూజించాలి. విఘ్నేశ్వరుడికి గరిక సమర్పించి పూజించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయి.

గురువారం విష్ణు భగవానుడిని, సాయిబాబాను, లక్ష్మీదేవి, రాఘవేంద్రస్వామిని పూజించడం శుభ ఫలితాలను ఇస్తుంది. ఇంకా దక్షిణామూర్తి పూజిస్తే దోషాలు తొలగిపోతాయి.

శుక్రవారం పూట దుర్గాదేవిని, రాజరాజేశ్వరిని పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు, విజయాలు చేకూరుతాయి. కార్యసిద్ధి లభిస్తుంది.

శనివారం పూట శని భగవానుడికి దీపం వెలిగించాలి. ఆంజనేయుడు, కాళీదేవతను పూజించవచ్చు. 


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

No comments: