Adsense

Saturday, August 7, 2021

మూడు కళ్ళు పది భుజాలతో దర్శనమిచ్చే ఆంజనేయ స్వామి ఆలయం ఎక్కడుందో తెలుసా?

  🕉

👉 ఆంజనేయుడు లేని గ్రామం అంటూ ఉండదు.
మనం ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లిన అక్కడ మనకు ఆంజనేయ స్వామి విగ్రహం దర్శనమిస్తుంది.
 ఆంజనేయుడిని ధైర్యానికి బలానికి ప్రతీకగా భావిస్తారు. అంతేకాకుండా భక్తికి, బ్రహ్మచర్యానికి కూడా ఆంజనేయ స్వామి ప్రతీక అని చెప్పవచ్చు.

👉 ఆంజనేయ స్వామి విగ్రహం అనగానే మనకు రాముడి పాదాలచెంత భక్తితో నమస్కరిస్తూ ఉన్నటువంటి రూపం, లేదా సంజీవిని పర్వతాన్ని చేతిలో పెట్టుకొని గాలిలో పయనిస్తున్న చిత్రం గుర్తుకు వస్తుంది.
అయితే ఆంజనేయ స్వామికి పది భుజాలు, మూడు కళ్ళు కలిగినటువంటి విగ్రహాన్ని ఎప్పుడైనా చూశారా. 

👉 అసలు ఈ విగ్రహం ఎక్కడ ఉంది ఈ ఆలయ విశిష్టత ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

👉 తమిళనాడు రాష్ట్రం, నాగపట్నం జిల్లాలోని ఆనందమంగళంలో మూడు కళ్ళు, పది చేతులు కలిగినటువంటి ఆంజనేయ స్వామి ఆలయం ఉంది.

👉 అసలు ఈ ఆలయంలో స్వామివారి మూడు కన్నులతో పది భుజాలతో భక్తులకు దర్శనం ఇవ్వడానికి ఓ పురాణ కథ ప్రాచుర్యంలో ఉంది.

👉 త్రేతాయుగంలో రాముడు అవతారంలో ఉన్న విష్ణుమూర్తి రావణాసురుడిని సంహరించాడు ,అయోధ్యకు పట్టాభిషిక్తుడు అవుతాడు. 
ఈ క్రమంలోనే నారద మహర్షి రాముడితో రావణాసురుడి సంహారం ఇంకా పూర్తి కాలేదు. ఆయన వారసులు సముద్ర అడుగు భాగంలో తపస్సు చేస్తున్నారు. వారి ఎప్పుడైనా మీపై దండయాత్ర చేయవచ్చు కనుక తపస్సు పూర్తి కాకముందే మీరు వారిని సంహరించమని రామునికి నారదుడు చెబుతాడు.

👉 ఈ క్రమంలోనే రాముడు మరి కొద్ది రోజులలో ఈ అవతారాన్ని చాలించనున్నాను.
దీనికోసం మరి ఎవరైనా పంపించమని రాముడి చెప్పగా ఇంత పరాక్రమశాలి ఎవరున్నారని ఆలోచించగా అందుకు ఆంజనేయుడునీ పంపించాలని అందరూ భావిస్తారు.
ఈ క్రమంలో యుద్ధానికి వెళ్లేముందు ఆంజనేయస్వామికి విష్ణుమూర్తి తన శంకు, చక్రాలను ప్రసాదించారు. 
అదేవిధంగా బ్రహ్మదేవుడు తన కమండలం ఆంజనేయునికి ప్రసాదించాడు.
శివుడు తన మూడో కంటిని ఆంజనేయుడికి ప్రసాదించారు.
 ఇలా వివిధ దేవతల నుంచి పది ఆయుధాలు పొందిన ఆంజనేయస్వామికి పది చేతులు కలిగి ఉండి, పరమేశ్వరుడు మూడవ కంటి దానం చేయడంతో ముక్కంటిగా మారి రాక్షస వధ చేసి పూర్తిగా విజయంతో ఆనందంగా తిరిగి రావడంతో ఆ ప్రాంతాన్ని ఆనందమంగళమ్ అని పిలుస్తారు.

🙏 జై శ్రీరామ్...🙏

No comments: