Adsense

Monday, August 30, 2021

శ్రీ కృష్ణాష్టమి

 
👉పదహారు కళల పరిపూర్ణావతారమైన శ్రీ మహావిష్ణువు భూమిపై అవతరించిన పుణ్యదినం. 
ఈ రోజున కృష్ణుని అర్చిస్తే సకల పాపాలు నశించి, చతుర్విధ పురుషార్థాలు సిద్ధించడమే కాక మహా జయములు కలుగుతాయని స్కాంద పురాణములో చెప్పబడింది. 

👉పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం శ్రీ కృష్ణుని పూజించాలి. 
శ్రీ కృష్ణునకు ప్రీతికరమైన ఆవు పాలు, వెన్న, మీగడ, పండ్లు మొదలైన వాటితో నైవేద్యం సమర్పించాలి. 
పూజ అయిన తరువాత "నమస్తుభ్యం జగన్నాథ దేవకీతనయ ప్రభో, వసుదేవాత్మజ అనంత త్రాహి మాం భవసాగరాత్" అని ప్రార్ధించి మోకాళ్ళపై కూర్చుని గంధం, అక్షతలు, పువ్వులు కలిపిన నారికేళజలముతో ఈ విధముగా అర్ఘ్యమును సమర్పించవలెను "జాతః కంసవధార్థాయ భూభారోత్తారణాయ చ, కౌరవాణాం వినాశాయ దైత్యానాం నిధనాయ చ, గృహాణార్ఘ్యం మయా దత్తం దేవక్యా సహితో హరే". 
అంతే కాక వెండితో చేసిన చంద్రబింబాన్ని శుద్ధి గానున్న పాత్రలోనుంచి చంద్రునికి అర్ఘ్యం ఇవ్వాలని భవిష్యోత్తర పురాణములో చెప్పబడింది.

No comments: