Adsense

Monday, August 30, 2021

శ్రీ కృష్ణుడి వృత్తాంతము



1. శ్రీకృష్ణుడు శ్రీముఖనామ సంవత్సర శ్రావణ బహుళ అష్టమినాడు అర్థరాత్రమున రోహిణీ నక్షత్రమునందు జన్మించెను . (క్రీస్తుకు పూర్వము 3228 వ సంవత్సరమున జూలై నెల 19 వ తేదీ గడచి 20 వ తేదీ ప్రవేశించుచుండగా జననము)

 2.తన 89 వ సంవత్సరమున మహాభారత యుద్ధమున అర్జునునకు సారథిగా పనిచేసెను . ( మహాభారత యుద్ధము - క్రీ.పూ. 3139 ) 

3.తన 126 వ సంవత్సరమున ప్రమాధినామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమినాటి ఉదయమున బాణము తగిలిన గాయము వలన దేహత్యాగము చేసెను .
 ( దేహత్యాగము - క్రీ.పూ. 3102 వ సంవత్సరమున ఫిబ్రవరి మాసమున 18 వ తేదీ ఉదయము)

 సన్నివేశము     శ్రీకృష్ణునివయస్సు
పూతనాహరణం---15 రోజులు
శకటాసుర వధ ----3 నెలలు
తృణావర్త వధ --- 1 సం ॥  
తల్లికి విశ్వరూప దర్శనం -1 సం గోపికల పితూరీలు---18 నెలలు
మన్ను తినడం --- 2  సం॥లు
విశ్వరూప దర్శనం రెండు -  2సం॥లు
యమళార్జున భంజనం --3 సం॥లు
బృందావన గమనము -- 3 సం॥లు
వత్సాసుర,బకాసురుల వధ---4 సం లు
( అఘాసుర ) అజగర వధ-- 5సం॥లు
బ్రహ్మ పరాభవం --6 సం॥లు
ధేనుకాసుర వధ --6 సం॥లు
కాళీయమర్దనం--6 సం॥లు
దావాగ్ని భక్షణం-- 7సం॥లు
ప్రలంబాసుర వధ-- 7సం॥లు
గోపికా వస్త్రాపహరణం--7సం॥లు
 ముని భార్యలను అనుగ్రహించడం--7సం॥లు
గోవర్ధనోద్ధరణం-- 8సం॥లు
నందుని వరుణ నగరం నుండి లేవడం-- 8సం॥లు
రాసక్రీడలు-- 8సం॥ల
వృషభాసుర వధ--9సం॥లు
 కేశి , వ్యోమాసుర వధ 10సం॥లు
అక్రూరునికి విశ్వరూప దర్శనం11సం॥లు
కంస వధ --11సం॥లు
సాందీపని వద్ద విద్యాభ్యాసం--12సం॥లు
భ్రమర గీతలు-- 13 సం || లు 
పాండవులు హస్తినకు వచ్చుట--14సం॥లు
 అక్రూరుడు హస్తినకు వెళ్ళి వచ్చుట--16సం॥లు
 జరాసంధుని దండయాత్రలు
 (17 సార్లు)--13 నుండి22సం॥లు

ద్వారకా నిర్మాణం 13 నుండి 22సం॥లు
 కాలయవన వధ-- 22సం॥లు
రుక్మిణీ కళ్యాణం-- 23సం॥లు
పాండవుల వారణావత గమనం--27సం॥లు
జాంబవతీ పరిణయం--28సం॥లు సత్యభామా పరిణయం--28 సం॥లు
సత్రాజిత్తు మరణం--29-30 సం॥లు
 కృష్ణుడు హిమాలయాల్లో శివుని గూర్చి-- 31-42 సం॥లు (12 సం || లు తపస్సు చేయడం)
 ద్రౌపదీ స్వయంవరం-- 43 సం॥లు
 కృష్ణుడు మిగిలిన ఐదుగురు  భార్యలను వివాహమాడడం--44 నుండి 18 సం॥లు
 పాండవులు ద్రౌపదితో హస్తినాపురికి వచ్చారు --44 సం || లు 
5 సం || హస్తినాపురంలో ఉన్న తరువాత  కృష్ణుని సన్నిధిలో అర్థరాజ్యం వచ్చింది-- 44 నుండి 48 సం || లు
ఇంద్రప్రస్త నిర్మాణం-- 49 సం॥లు
 పాండవులు ఇంద్రప్రసంలో ఉన్నది ( 23 సం || లు )-- 50 నుండి 72 సం || లు 

అర్జునుని తీర్థయాత్ర--54 నుండి 65 సం || లు 
  ఖాండవ వన దహనము--66 సం॥లు
 మయ సభ-- 68 సం॥లు
 రాజసూయారంభం--71 సం॥లు  రాజసూయం-- 72సం || లు
ద్యూతం-- 74 సం || లు 
అరణ్యవాసం-- 75 నుండి 86 సం || లు
అజ్ఞాతవాసం--- 87 సం || లు 
ఉత్తర కళ్యాణం--88 సం॥లు 
 యుద్ధ ప్రయత్నం గీతాగానం ( కీ || పూ || 3139 )--89 సం॥లు
ధర్మరాజు పట్టాభిషేకం-- 90 సం॥లు ధృతరాష్ట్రుని నిర్యాణం--105 సం || లు 

 కృష్ణ నిర్యాణం-- 126 సం॥లు

పాండవులు స్వర్గారోహణం--  127 సం || లు 3

సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

No comments: